Good Bad Ugly Movie Review: తమిళ్ సినిమా ఇండస్ట్రీలో రజనీకాంత్, కమల్ హాసన్ ల తర్వాత అంత మంచి గుర్తింపును సంపాదించుకున్న నటుడు అజిత్… ఈయన చేసిన సినిమాలు ఒకప్పుడు మంచి విజయాలను అందుకున్నాయి. ఇక గత కొన్ని రోజుల నుంచి ఆయన చేసిన సినిమాలు సరైన సక్సెస్ అయితే సాధించడం లేదు. వచ్చిన సినిమాలు వచ్చినట్టుగా డిజాస్టర్ బాట పడుతున్నాయి. మరి ఇప్పుడు ఆయన ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించింది. అజిత్ కెరియర్ లో మరొక భారీ సక్సెస్ ని అందుకున్నాడా లేదా అనే విషయాన్ని మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…
Also Read: జాక్ ఫుల్ మూవీ రివ్యూ
కథ
ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే అజిత్ డాన్ గా కొద్ది సంవత్సరాల పాటు కొనసాగిన తర్వాత తన కొడుకు కోసం వదిలేసి మామూలు మనిషిగా బతుకుతూ ఉంటాడు. కానీ తన కొడుకుకి ఆపద వచ్చినప్పుడు మాత్రం మరోసారి తన గన్నును పట్టుకొని విలన్స్ మీద యుద్ధం చేస్తూ ఉంటాడు. మరి వాళ్ళ కొడుకుకి వచ్చిన ఇబ్బంది ఏంటి మళ్లీ గ్యాంగ్ స్టర్ గా ఎందుకు మారాడు అనే విషయాలు తెలియాలంటే మీరు ఈ సినిమా చూడాల్సిందే…
విశ్లేషణ
ఇక విశ్లేషణ విషయానికి వస్తే ఈ సినిమా దర్శకుడు అయిన అధిక్ రవిచంద్రన్ ఈ మూవీని మొదటి నుంచి చివరి వరకు చాలా ఎంగేజింగ్ తీసుకెళ్లే ప్రయత్నమైతే చేశాడు. అయితే అక్కడక్కడ సినిమా కొంచెం స్లో అయినప్పటికి సినిమా మీద హైప్ తీసుకురావడానికి ఏదో ఒక డిఫరెంట్ ప్రయత్నం అయితే చేస్తూ వచ్చాడు. సినిమాలో చాలా వరకు యాక్షన్ ఎపిసోడ్స్ ఉండడం సినిమాకి కొంతవరకు ప్లస్ అయింది. ప్రతి యాక్షన్ ఎపిసోడ్స్ కూడా చాలా స్టైలిష్ గా డిజైన్ చేశారు. ఇక సెకండ్ హాఫ్ లో వచ్చే కొన్ని ఎమోషనల్ సీన్స్ కి బ్యాగ్రౌండ్ స్కోర్ అయితే బాగా ప్లస్ అయింది.
దాని వల్లే ఆ సీన్స్ భారీగా ఎలివేటయ్యాయి. ఇక దర్శకుడు స్టైలిష్ మేకింగ్ తో సినిమా మీద అంచనాలను పెంచుతూ వచ్చాడు. మొదట్లో కొంతవరకు సినిమా స్లోగా స్టార్ట్ అయినప్పటికి ఇంటర్వెల్ లో వచ్చే ట్విస్ట్ గాని, సెకండ్ హాఫ్ లో వచ్చే ఎమోషనల్ సీన్స్ గాని సినిమాకి బాగా హైలైట్ అయ్యాయి. ఫ్రీ క్లైమాక్స్ లో వచ్చే మరొక ట్విస్ట్ తో సినిమాను నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్ళే ప్రయత్నం చేశాడు…
ఆర్టిస్టుల పర్ఫామెన్స్
ఇక ఆర్టిస్టుల పర్ఫామెన్స్ విషయానికి వస్తే అజిత్ వన్ మ్యాన్ షో చేశారనే చెప్పాలి. మొదటి నుంచి చివరి వరకు ఆయన ఈ సినిమాని భుజాల మీద మోసుకెళ్లాడు. ఇక మిగతా ఆర్టిస్టులందరు కూడా అజిత్ కి సపోర్ట్ చేస్తూ నటించారు. త్రిష సైతం ఈ సినిమాలో ఒక మంచి పర్ఫామెన్స్ అయితే ఇచ్చింది. చాలా రోజుల తర్వాత అజిత్ తో కలిసి ఆమె నటించడం విశేషం… సిమ్రాన్ సైతం ఈ సినిమాలో కనిపించింది తక్కువ సమమయమే అయినప్పటికి ఆమె క్యారెక్టర్ తో సినిమాకి ఒక జస్టిఫికేషన్ అయితే ఇచ్చే ప్రయత్నం చేసింది…
టెక్నికల్ అంశాలు
ఇక ఈ సినిమా టెక్నికల్ అంశాల విషయానికి వస్తే మ్యూజిక్ డైరెక్టర్ జి వి ప్రకాష్ కుమార్ అందించిన మ్యూజిక్ ఈ సినిమాకి చాలా బాగా ప్లస్ అయింది. ఈ మధ్యకాలం లో జీవి ప్రకాష్ అందించిన ప్రతి సినిమా మ్యూజిక్ కూడా ఆ సినిమాకి ప్లస్ అవుతుంది. ఇక ఈ సినిమాలో పాటలు పెద్దగా ప్రేక్షకుల్ని ఆకట్టుకోనప్పటికి బ్యాగ్రౌండ్ స్కోర్ విషయంలో ఆయన స్పెషల్ కేర్ తీసుకున్నాడు.
ఈ మధ్యకాలంలో జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించిన ప్రతి సినిమా కూడా మ్యూజికల్ సక్సెస్ అయితే సాధిస్తున్నాయి. ఇక ఆ బాటలోనే ఈ సినిమా కూడా మంచి బ్యాగ్రౌండ్ మ్యూజిక్ తో ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం అయితే చేసింది. ఇక విజువల్స్ పరంగా చూసుకున్న ఈ సినిమాకి చాలా మంచి విజువల్స్ అయితే అందించారు…
ప్లస్ పాయింట్స్
అజిత్
సెకండ్ హాఫ్ లో వచ్చే ఎమోషనల్ సీన్స్
ట్విస్టు లు
మైనస్ పాయింట్స్
రొటీన్ కథ
ఫస్ట్ హాఫ్ స్లో అయింది…
రేటింగ్
ఈ సినిమాకి మేమిచ్చే రేటింగ్ 2.5/5