https://oktelugu.com/

ప్రభాస్‌ మూవీలో నిధి అగర్వాల్‌కు గోల్డెన్‌ చాన్స్!

హైదరాబాద్‌లో పుట్టి బెంగళూరులో పెరిగి.. బాలీవుడ్‌ నుంచి తెరంగేట్రం చేసింది  నిధి అగర్వాల్‌.  బాలీవుడ్ నుంచి తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఈ యువ నటి  ఇస్మార్ట్‌ శంకర్ మూవీలో మెప్పించింది.   మోడలింగ్‌ తర్వాత 2017లో ‘ మున్నా మైఖేల్‌’ అనే మూవీతో హిందీ పరిశ్రమకు పరిచయం అయిన ఆమె తర్వాత  పూర్తిగా టాలీవుడ్‌పై దృష్టి పెట్టింది. ఇక్కడ ఆమెకు మంచి అవకాశాలే వస్తున్నాయి. రెండేళ్ల కిందట నాగ చైతన్య సరసన ‘సవ్యసాచి’ చిత్రంతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. […]

Written By:
  • Neelambaram
  • , Updated On : August 24, 2020 / 07:17 PM IST
    Follow us on

    హైదరాబాద్‌లో పుట్టి బెంగళూరులో పెరిగి.. బాలీవుడ్‌ నుంచి తెరంగేట్రం చేసింది  నిధి అగర్వాల్‌.  బాలీవుడ్ నుంచి తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఈ యువ నటి  ఇస్మార్ట్‌ శంకర్ మూవీలో మెప్పించింది.   మోడలింగ్‌ తర్వాత 2017లో ‘ మున్నా మైఖేల్‌’ అనే మూవీతో హిందీ పరిశ్రమకు పరిచయం అయిన ఆమె తర్వాత  పూర్తిగా టాలీవుడ్‌పై దృష్టి పెట్టింది. ఇక్కడ ఆమెకు మంచి అవకాశాలే వస్తున్నాయి. రెండేళ్ల కిందట నాగ చైతన్య సరసన ‘సవ్యసాచి’ చిత్రంతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. ఆ వెంటనే మరో అక్కినేని హీరో అఖిల్‌తో ‘మిస్టర్మజ్ఞూ’ చేసింది. ఈ రెండు సినిమాలు ఫెయిలైనా పూరి జగన్నాథ్‌ తన ‘ఇస్మార్ట్‌ శంకర్’లో నిధికి చాన్సిచ్చాడు. ఈ చిత్రం ఘన విజయం సాధించడంతో పాటు నిధి అగర్వాల్‌కు సైతం  మంచి పేరు తెచ్చిపెట్టింది. ప్రస్తుతం ఆమె చేతిలో రెండు ప్రాజెక్టులున్నాయి. తమిళ్‌లో  ‘భూమి’ అనే సినిమాలో నటిస్తున్న నిధి.. మహేశ్‌ బాబు అల్లుడు గల్లా అశోక్‌ హీరోగా పరిచయం అవుతున్న  చిత్రంలో హీరోయిన్‌గా చేస్తోంది.

    Also Read : మెగాస్టార్ ‘ఆచార్య’ షూటింగ్ డిటైల్స్ ! 

    ఇప్పుడు నిధిని మరో  గోల్డెన్‌ చాన్స్‌ వరించినట్టు సమాచారం. ఏకంగా ప్రభాస్‌ సినిమాలో నటించే అదృష్టం ఆమె సొంతమైందట. ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌, ప్రభాస్‌ కాంబినేషన్లో ఓ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. వైజయంతీ మూవీస్‌ బ్యానర్పై అశ్వినీదత్‌ భారీ బడ్జెట్‌ నిర్మించే ఈ పాన్‌  ఇండియా మూవీలో బాలీవుడ్‌ స్టార్దీపిక పడుకోన్‌ హీరోయిన్‌గా ఎంపికైంది. ఈ సినిమాలో మరో హీరోయిన్‌ కూడా స్పేస్‌ ఉంది. ఆ పాత్రకు నాగ్‌ అశ్విన్‌.. ఇస్మార్ట్‌ బ్యూటీ నిధి అగర్వాల్‌ను తీసుకోవాలని చూస్తున్నాడని సమాచారం. దీని గురించి తొందర్లోనే ప్రకటన చేయాలని చూస్తున్నాడని తెలుస్తోంది. అంతా సవ్యంగా సాగితే  ప్రభాస్‌, దీపిక పడుకోన్‌తో కలిసి పనిచేసే లక్కీ చాన్స్‌ నిధి సొంతం కానుంది. తన నటనా నైపుణ్యాలను మెరుగు పరుచుకునేందుకు లాక్‌డౌన్‌ విరామంలో  న్యూయార్క్‌ ఫిల్మ్‌ అకాడమీలో ఆన్‌లైన్‌ కోర్సు చేసింది నిధి. ఒకవేళ ఇంత పెద్ద ప్రాజెక్టులో భాగం అయితే తన నైపుణ్యాలను ప్రదర్శించే అవకాశం లభిస్తుందని భావిస్తోందామె.
    Also Read : ఐటమ్ సాంగ్ ను సమర్థిస్తున్న మరో హీరోయిన్ !