Bigg Boss 8 Telugu: బిగ్ బాస్ సీజన్ 8 త్వరలోనే ప్రారంభం కానుందని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ హౌస్ లోకి పంపించేందుకు కంటెస్టెంట్స్ ఎంపిక కూడా మొదలైనట్టు తెలుస్తోంది.ఈ నేపథ్యంలో కొందరు బుల్లితెర సెలబ్రిటీల పేర్లు వినిపిస్తున్నాయి. జబర్దస్త్ కమెడియన్స్ కూడా ఈ సీజన్ లో కంటెస్ట్ చేసే అవకాశం లేకపోలేదు. తాజాగా జబర్దస్త్ కమెడియన్ పంచ్ ప్రసాద్ బిగ్ బాగ్ షోకి వెళ్లడం పై ఆసక్తికర కామెంట్స్ చేశారు.
కమెడియన్ పంచ్ ప్రసాద్ జబర్దస్త్ వేదికగా పాపులర్ అయ్యాడు. స్పాంటేనియస్ గా పంచులు వేసి నవ్విస్తూ తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. చాలా కాలంగా జబర్దస్త్ లో స్కిట్స్ చేస్తూ అలరిస్తున్నాడు. ప్రస్తుతం జబర్దస్త్, శ్రీ దేవి డ్రామా కంపెనీ షోలు చేస్తున్నాడు. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న పంచ్ ప్రసాద్ బాగ్ బిన్ షోకి వెళ్లడం పై తన అభిప్రాయం చెప్పాడు.
బిగ్ బాస్ సీజన్ 8 లో మీకు అవకాశం వస్తే మీరు వెళ్తారా అని యాంకర్ అడిగారు. ఇందుకు సమాధానంగా .. తాను బిగ్ బాస్ కి వెళ్లాలని అనుకుంటున్నాను అని తెలిపారు.నా ఇంటిని బిగ్ బాస్ హౌస్ లాగే ఫీల్ అవుతున్నాను. ఇంట్లో భార్య పిల్లలతో పడే టార్చర్ కంటే బిగ్ బాస్ హౌస్ చాలా బెటర్ అని అన్నారు. తన కొడుకు ఒక్కడిని హ్యాండిల్ చేస్తే చాలు పది మందిని హ్యాండిల్ చేసినట్లని పంచ్ ప్రసాద్ అన్నారు. అలాగే తన భార్యను హ్యాండిల్ చేయడం 16 మందిని హ్యాండిల్ చేసిన దాంతో సమానం అంటూ ఫన్నీ కామెంట్స్ చేశారు.
వైఫ్ పర్మిషన్ ఇస్తే తప్పకుండా బిగ్ బాస్ లోకి వెళ్తానని అన్నారు. మీ భార్య వద్దంటే ఆగిపోతారా అని యాంకర్ అడగ్గా .. వద్దన్నా వెళ్తాను అంటూ, పంచ్ వేసి నవ్వించారు. మొత్తానికి బిగ్ బాస్ 8 లో అవకాశం వస్తే ఖచ్చితంగా వెళ్తానంటూ పంచ్ ప్రసాద్ వెల్లడించారు. ఇది ఇలా ఉండగా .. ఈ సీజన్ లో కొందరు పాత కంటెస్టెంట్స్ కి కూడా అవకాశం కల్పిస్తున్నారని అని వార్తలు వినిపిస్తున్నాయి. సీజన్ 7 లో పాపులర్ అయిన ఇద్దరు ముగ్గురు కంటెస్టెంట్స్ బిగ్ బాస్ 8 లో సందడి చేయనున్నారు అని టాక్ నడుస్తుంది.