Chiranjeevi Godfather: 68 ఏళ్ళ వయస్సు లో మెగాస్టార్ చిరంజీవి నేటికీ కూడా యువతరం హీరోలతో పోటీ పడుతూ శబాష్ అనిపించుకుంటూ వస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే..పదేళ్ల తర్వాత ఆయన రీ ఎంట్రీ ఇస్తూ చేసిన ఖైదీ నెంబర్ 150 మరియు సై రా నరసింహారెడ్డి వంటి బ్యాక్ టూ బ్యాక్ 100 కోట్ల రూపాయిల షేర్ సినిమాలు ఆయన స్టార్ స్టేటస్ రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత కూడా ఏ మాత్రం చెక్కు చెదరలేదు అనడానికి నిదర్శనం..కానీ ఈ ఏడాది లో విడుదలైన ఆచార్య సినిమా మాత్రం మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో అతి పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ గా నిలిచి ఆయనకీ మాయని మచ్చలాగా నిలిచింది..ఈ సినిమా తర్వాత ఆయన మలయాళం లో సూపర్ హిట్ గా నిలిచిన లుసిఫెర్ రీమేక్ ‘గాడ్ ఫాదర్’ చేసిన సంగతి మన అందరికి తెలిసిందే..ఈ సినిమా వచ్చే నెల 5 వ తారీఖున విడుదల కాబోతుంది..ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన టీజర్ మరియు పాట విడుదల చెయ్యగా పర్వాలేదు అనే రేంజ్ రెస్పాన్స్ ని దక్కించుకుంది.

కానీ ఈ సినిమాకి ఇప్పటి వరుకు మెగాస్టార్ చిరంజీవి సినిమాకి రావాల్సినంత హైప్ లో పది శాతం కూడా రాలేదు..వీక్ ప్రొమోషన్స్ అందుకు కారణం అని అభిమానులు వాపోతున్నారు..ఇటీవలే చిరంజీవి – సల్మాన్ ఖాన్ కాంబినేషన్ సాంగ్ ‘మార్ మార్ తక్కర్ మార్’ అనే లిరికాల్ వీడియో సాంగ్ ని విడుదల చేస్తాము అంటూ ఒక ప్రకటన చేసిన సంగతి మన అందరికి తెలిసిందే..కానీ వర్క్ బాలన్స్ ఉండడం తో కేవలం ఆడియో ని మాత్రమే విడుదల చేసి లిరికల్ వీడియో సాంగ్ ని అతి త్వరలో విడుదల చేస్తాము అంటూ ట్వీట్ వేశారు..ఈ ట్వీట్ మెగా అభిమానులకు పీకలదాకా కోపం వచ్చేలా చేసింది..చిరంజీవి సినిమా అంటే 20 రోజుల ముందే రెండు తెలుగు రాష్ట్రాల్లో పండగ వాతావరణం నెలకొంటుంది..కానీ మీరు కనీస స్థాయి ప్రొమోషన్స్ కూడా చెయ్యకుండా అసలు ఇది చిరంజీవి సినిమానేనా అనే ఫీలింగ్ రప్పించారు..ఇంకెప్పుడు మా హీరో తో సినిమాలు చెయ్యొద్దు అంటూ దర్శక నిర్మాతలను టాగ్ చేసి ట్విట్టర్ లో తిడుతున్నారు..ఇది కాసేపు పక్కన పెడితే ఈ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా అంతంత మాత్రమే జరుగుతుంది..కోస్తాంధ్ర లో అన్ని ప్రాంతాలకు కలిపి ఈ సినిమా హక్కులను 45 కోట్ల రూపాయలకు అడుగుతున్నాడు నిర్మాత..కానీ డిస్ట్రిబ్యూటర్స్ అంత పెట్టడానికి ఏ మాత్రం ఆసక్తి చూపడం లేదు..దానికి ప్రధాన కారణం ఈ సినిమాకి హైప్ లేకపోవడం ఒకటైతే..ఆచార్య సినిమా ఫలితం కూడా మరొకటి అంటున్నారు ట్రేడ్ పండితులు..మరో విషయం ఏమిటి అంటే ఈ సినిమాకి అమెరికా లో కేవలం 3 కోట్ల రూపాయిలు మాత్రమే ఇష్టము అంటున్నారట డిస్ట్రిబ్యూటర్స్..ఇదే కనుక నిజమైతే మెగాస్టార్ కి ఇది అవమానం అనే చెప్పొచ్చు..ఇతర ప్రాంతాలలో కూడా డిస్ట్రిబ్యూటర్స్ పెద్దగా ఈ సినిమాని కొనడానికి ఆసక్తి చూపించకపోవడం తో నిర్మాత సొంతంగా రిలీజ్ చేసుకునేందుకు ఆలోచిస్తున్నాడట..మెగాస్టార్ లాంటి హీరో కి ఇలాంటి పరిస్థితి రావడం నిజంగా శోచనీయం..కానీ ఈ సినిమాకి హిట్ టాక్ వస్తే మాత్రం అవలీలగా వంద కోట్ల రూపాయిల షేర్ కొల్లగొడుతుంది అని మాత్రం చెప్పొచ్చు..చూడాలి మరి ఈ సినిమా అభిమానులకు ఆచార్య చేసిన గాయాన్ని తగ్గించుతుందా..లేదా పెంచుతుందా అనేది.