https://oktelugu.com/

Ustaad Bhagat Singh : ‘ఉస్తాద్’ అరాచకం.. వింటేజ్ పవర్ స్టార్ వచ్చేసాడోచ్..ఇదేమి మాస్ పోస్టర్ అండీ బాబోయ్!

పవన్ కళ్యాణ్ మార్క్ వింటేజ్ యాటిట్యూడ్ తో స్టైల్ గా కళ్ళజోడు తగిలించి నిలబడిన ఈ పోస్టర్ కి ఫ్యాన్స్ నుండి సెన్సషనల్ రెస్పాన్స్ వచ్చింది. హరీష్ శంకర్ మరోసారి తాను పవన్ కళ్యాణ్ కి ఎలాంటి భక్తుడో నిరూపించుకున్నది,

Written By: , Updated On : May 11, 2023 / 12:43 PM IST
Ustad bhagath singh

Ustad bhagath singh

Follow us on

Ustaad Bhagat Singh : సోషల్ మీడియా మొత్తం ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మేనియా తో ఊగిపోతోంది.ఎక్కడ చూసిన ఈ సినిమా గురించే చర్చ, ఈ చిత్రం కి ఉన్న హైప్ ని చూస్తుంటే విడుదల రేపేనా అన్నట్టుగా అనిపిస్తుంది.గబ్బర్ సింగ్ చిత్రం విడుదలై 11 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ హరీష్ శంకర్ – పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీ కి సంబంధించి చిన్న గ్లిమ్స్ వీడియో ని నేడు విడుదల చేసేందుకు సన్నాహాలు చేసారు.

ఈరోజు సాయంత్రం 4 గంటల 59 నిమిషాలకు ఈ గ్లిమ్స్ వీడియో ని విడుదల చెయ్యబోతున్నారు. దీనికోసం కేవలం ఫ్యాన్స్ మాత్రమే కాదు, ఆడియన్స్ కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు, కాంబినేషన్ అలాంటిది మరి.ఈ సందర్భంగా ఒక మాస్ పోస్టర్ ని కాసేపటి క్రితమే విడుదల చేసింది మూవీ టీం.

పవన్ కళ్యాణ్ మార్క్ వింటేజ్ యాటిట్యూడ్ తో స్టైల్ గా కళ్ళజోడు తగిలించి నిలబడిన ఈ పోస్టర్ కి ఫ్యాన్స్ నుండి సెన్సషనల్ రెస్పాన్స్ వచ్చింది. హరీష్ శంకర్ మరోసారి తాను పవన్ కళ్యాణ్ కి ఎలాంటి భక్తుడో నిరూపించుకున్నది, ఫ్యాన్స్ పవర్ స్టార్ ని ఎలా అయితే చూడాలి అనుకున్నారో, అంతకు మించి ఎక్కువే చూపించాడని అభిమానులు ఎంతో మురిసిపోతున్నారు.

ఈ రేంజ్ మాస్ ని మేము కూడా ఊహించలేదు అంటూ పోస్టులు పెడుతున్నారు.ఇక ఈ సినిమా గ్లిమ్స్ వీడియో కి సంబంధించిన లాంచ్ ఈవెంట్ కాసేపట్లో ప్రారంభం కాబోతుంది. సంధ్య 70 MM థియేటర్ లో ఈ ఈవెంట్ ని చెయ్యబోతున్నారు.దీనికి ఫ్యాన్స్ తండోపతండాలుగా తరలి రాబోతున్నట్టు సమాచారం. పోస్టర్ తోనే ఈ రేంజ్ హైప్ ని రేపిన ఈ చిత్రం గ్లిమ్స్ తో ఇక ఏ రేంజ్ హైప్ ని తీసుకొస్తుందో చూడాలి.