Ginna Closing Collections: మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ ప్రెసిడెంట్ మంచు విష్ణు హీరో గా నటించిన ‘జిన్నా’ సినిమా ఇటీవలే దీపావళి కానుకగా విడుదలై పాజిటివ్ టాక్ ని తెచ్చుకుంది..పాజిటివ్ టాక్ ని అయితే తెచ్చుకుంది కానీ కలెక్షన్స్ ని మాత్రం రాబట్టలేకపోయింది..పాపం మంచు విష్ణు తనని చూసి థియేటర్స్ కి జనాలు రాకపోయినా,కనీసం పాయల్ రాజ్ పుట్,సన్నీ లియోన్ ని చూసైనా వస్తారు అనుకోని వాళ్లకి భారీ స్థాయి రెమ్యూనరేషన్స్ ని ఇచ్చి సినిమాలో పెట్టుకున్నాడు..పాపం ఆ డబ్బులు మొత్తం నష్టపోయినట్టే.

అంతే కాకుండా ఇండస్ట్రీ లో ఉన్న టాప్ లీడింగ్ క్యారక్టర్ ఆర్టిస్ట్స్ మరియు కమెడియన్స్ ని కూడా పెట్టుకున్నాడు..వాళ్ళని చూసి కూడా జనాలు థియేటర్స్ కి కదలడం లేదంటే ‘మంచు’ బ్రాండ్ అంటే జనాలు ఎలా బయపడిపోతున్నారో అర్థం చేసుకోవచ్చు..టీజర్, ట్రైలర్ కాస్త కొత్తగా ఉండేలోపు డిస్ట్రిబ్యూటర్స్ ఈ సినిమాని 4 కోట్ల 50 లక్షల రూపాయలకు కొనుగోలు చేసారు..ఇప్పుడు ఈ సినిమాకి రెండవ రోజు నుండి షేర్స్ రావడం ఆగిపోయాయి..దీనితో అన్ని ప్రాంతాలలో దాదాపుగా క్లోసింగ్ కి వచేసినట్టే..ఫుల్ రన్ లో ఈ సినిమా ఎంత వసూలు చేసిందో ఒక లుక్ వేద్దాం.
మొదటి రోజు ఈ సినిమాకి దాదాపుగా 12 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి..రెండవ రోజు కూడా ఇంచుమించు అదే స్థాయి వసూళ్లు రాగ నాలుగు రోజులకు కలిపి దాదాపుగా 40 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి..ఇక ఐదవ రోజు నుండి అమెరికా నుండి అనకాపల్లి వరుకు ఈ సినిమాకి కేటాయించిన షోస్ అన్ని తీసివేసి వేరే సినిమాలకు ఇస్తున్నారు..అమెరికాలో అయితే ఈ సినిమాకి కేవలం వెయ్యి డాలర్లు మాత్రమే వచ్చాయి..నాలుగు రోజులకు కలిపి 150 టిక్కెట్లు అమ్ముడుపోయాయి అన్నమాట..ఇక బెంగళూరు వంటి ప్రాంతాలలో ఈ సినిమాని చూడడానికి వెళ్లే వారిని తిరిగి ఇంటికి వెళ్ళిపోమంటున్నారట థియేటర్స్ యాజమాన్యం.

ఎందుకంటే ఒక షో కి కనీసం పది టికెట్స్ అయినా అమ్ముడుపోవాలంట..అప్పుడే షో వేస్తారట..కానీ మన జిన్నా భాయ్ కి ఆ పరిస్థితి లేకపోవడం తో రేపటి నుండి అన్ని థియేటర్స్ లో ఎత్తేస్తున్నారట..అలా మొత్తం మీద ఈ సినిమాకి 40 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు రాబట్టి కనీసం ప్రింట్ ఖర్చులను కూడా వసూలు చెయ్యలేని సినిమాగా చరిత్రలో నిలిచిపోయింది అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.