Ginna Collections: మంచు విష్ణు హీరో గా నటించిన జిన్నా సినిమా నిన్న ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదలై యావరేజి రివ్యూస్ ని దక్కించుకున్న సంగతి మన అందరికి తెలిసిందే..సన్నీ లియోన్ మరియు పాయల్ రాజపుట్ హీరోయిన్స్ గా నటించగా, వెన్నెల కిషోర్, సునీల్ తదితరులు ప్రధాన పత్రాలు పోషించారు..ఇంత మంది టాప్ నటీనటులు ఉన్నప్పటికీ కూడా ఈ సినిమాకి కనీస స్థాయి హైప్ కూడా జనరేట్ అవ్వలేదు..మంచు విష్ణు ఈ సినిమా విడుదలకి ముందు కొన్ని కాంట్రోవర్సియల్ కామెంట్స్ చేసి సినిమా పై హైప్ ని పెంచే ప్రయత్నం చాలా గట్టిగానే చేసాడు కానీ వర్కౌట్ అవ్వలేదు.

ఇక ఈ సినిమాకి మొదటి రోజు వచ్చిన వసూళ్లు చూస్తే మంచు కుటుంబం సినిమాలను ప్రేక్షకులు థియేటర్స్ లో చూడడం ఎప్పుడో మానేశారు అనే విషయం అర్థం అవుతుంది..గతం లో విడుదలైన సన్ ఆఫ్ ఇండియా కంటే అతి దారుణమైన వసూళ్లను ఈ సినిమా దక్కించుకోవడం చూస్తే ఆశ్చర్యపోక తప్పదు.
ఇక అసలు విషయానికి వస్తే ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ 4 కోట్ల 50 లక్షల రూపాయలకు జరిగింది..సన్నీ లియోన్ మరియు పాయల్ రాజ్ పుట్ తో పాటు టాలీవుడ్ లో మోస్ట్ క్రేజిస్ట్ స్టార్ కాస్ట్ మొత్తం ఈ సినిమాలో ఉండడం తో అంత బిజినెస్ జరిగింది..కానీ ఈ సినిమాకి మొదటి రోజు వచ్చిన వసూళ్లు చూస్తుంటే ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ లో కనీసం 10 శాతం కూడా రికవరీ చేసే ఛాయలు కనిపించడం లేడు..రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి ఈ సినిమా మొదటి రోజు సుమారు 12 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.

ఎలాంటి సినిమాకి అయినా అద్భుతమైన వసూళ్లను ఇచ్చే ఉత్తరాంధ్ర వంటి ప్రాంతం లో కూడా ఈ సినిమాకి లక్ష రూపాయిల రేంజ్ లో గ్రాస్ వచ్చిందంటే ఎంత దారుణమో అర్థం చేసుకోవచ్చు..ఇక ఓవర్సీస్ నుండి ఈ సినిమాకి కేవలం 40 వేల రూపాయిల గ్రాస్ వసూళ్లు మాత్రమే వచ్చాయి..ప్రేక్షకులు సినిమాలు చూసిన చూడకపోయినా మంచు కుటుంబం కోట్లు ఖర్చుపెట్టి సినిమాలను ఇంకా తీస్తూనే ఉంది..ఇలా తీసి డబ్బులు అనవసరం గా వేస్ట్ చేసుకోవడం ఎందుకు..లేని వారికి ఆ డబ్బులు ఇస్తే వాళ్ళైనా బాగుపడతారు కదా అని ట్రేడ్ విశ్లేషకులు అంటున్న మాట.