https://oktelugu.com/

Ana de Armas: ఆ హాలీవుడ్ హీరోయిన్ లా ఉన్న ఈవిడ ఎవరో తెలుసా..? గిల్ ను సైతం ఫిదా చేసిందా..?

కాలు మీద కాలు వేసుకొని, చేతులు కట్టుకొని కూర్చున్న ఆమెను చూసి అందరూ అనా డి ఆర్మాస్ అనుకున్నారు. ఇంక దానికి తగ్గట్టుగానే స్క్రీన్ మీద హాలీవుడ్ హీరోయిన్ అనా డి ఆర్మాస్ ఫోటోని వేశారు.

Written By:
  • Gopi
  • , Updated On : April 20, 2024 / 11:56 AM IST

    Ana De Armas Lookalike

    Follow us on

    Ana de Armas: ఐపీఎల్ సీజన్ 17 లో ప్రతి టీం కూడా తమదైన రీతిలో మ్యాచ్ లు ఆడుతూ గెలుపు ఒక్కటే లక్ష్యం గా పెట్టుకొని ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తుంది. అందుకు తగ్గట్టుగానే భారీ కసరత్తులను చేస్తూన్నారు. ఇక ఇది ఇలా ఉంటే ఈనెల 17 తేదీన గుజరాత్ టైటాన్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో ఒక అద్భుతమైన దృశ్యం అయితే నెలకొంది. అది ఏంటి అంటే హాలీవుడ్ హీరోయిన్ అయినా ‘అనా డి ఆర్మాస్’ ను పోలిన ఒక అమ్మాయి సేమ్ అదే లుక్కు లో స్టేడియంలో కనిపించింది.

    కాలు మీద కాలు వేసుకొని, చేతులు కట్టుకొని కూర్చున్న ఆమెను చూసి అందరూ అనా డి ఆర్మాస్ అనుకున్నారు. ఇంక దానికి తగ్గట్టుగానే స్క్రీన్ మీద హాలీవుడ్ హీరోయిన్ అనా డి ఆర్మాస్ ఫోటోని వేశారు. ఇక దానికి తగ్గట్టుగా పాటలను కూడా ప్లే చేశారు. ఇక అది చూసిన శుభ్ మన్ గిల్ సైతం ఒకసారిగా ఆశ్చర్యానికి గురయ్యాడు. ఆ అమ్మాయి అచ్చం హాలీవుడ్ హీరోయిన్ ను పోలి ఉండడమే దానికి కారణం..అది చూసిన చాలామంది క్రికెట్ అభిమానులు కూడా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు.

    ఇక కొందరైతే ఆమె అనా డి అర్మాస్ అనే అనుకున్నారు. కానీ తను హీరోయిన్ కాదని ఆమె ‘డోపెల్ గాంజర్ ‘ అని స్పష్టం చేశారు. అయితే ఆమె పైన కెమెరాని ఫోకస్ చేయడం పట్లా ఆమె కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయినట్టుగా కనిపించింది. ఇక క్రికెట్ గ్రౌండ్ లో ఉన్న ప్రతి ఒక్క క్రికెటర్ సైతం ఒకసారి స్క్రీన్ మీద వచ్చిన ఆమె పిక్ చూసి ఆశ్చర్య పోయారు.అలాగే స్టాండ్స్ లో ఉన్నవాళ్ళు కూడా ఆమెను చూడటానికి అసక్తి చూపించారు.

    ఇక మనిషిని పోలిన మనుషులు చాలామంది ఉంటారు కాబట్టి తను కూడా హాలీవుడ్ హీరోయిన్ అయిన ‘అనా డి ఆర్మాస్’ లాగా ఉండడం అనేది అక్కడున్న వాళ్ళందరిని ఆశ్చర్యపరిచింది. ముఖ్యంగా ఆవిడ అభిమానులైతే డోపెల్ గాంజర్ ని చూసి ఆశ్చర్యపోయారు… ఇక మొత్తానికైతే గత రెండు రోజుల నుంచి ఈ న్యూస్ నెట్టింట తెగ వైరలు అవుతుంది…