Ghani movie: మెగా ఫ్యామిలి నుంచి “ముకుంద” సినిమాతో తెలుగు తెరకు గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు వరుణ్ తేజ్. కంచె చిత్రంతో తనలోని నటుడికి ప్రాణం పోసి ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు ఈ యంగ్ హీరో. ఆ తర్వాత వచ్చిన లోఫర్, ఫిదా, గద్దలకొండ గణేశ్ చిత్రాలు బాక్సాఫీసు వద్ద మంచి కలెక్షన్లు కురిపించాయి. ఇక విక్టరీ వెంకటేష్ తో కలిసి “ఎఫ్ 2” సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకున్నారు వరుణ్.
ఆ చిత్రం కూడా మంచి విజయం సాధించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు వరుణ్ తేజ్ “గని” సినిమాలో నటిస్తున్న విశయం తెలిసిందే. తాజాగా ఈ మూవీ కి సంబంధించి ఓ అప్డేట్ ను చిత్ర బృందం ప్రకటించింది. ఈ సినిమాలో శాయి మంజ్రేకర్ హీరోయిన్గా నటిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే, తాజాగా మంజ్రేకర్ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను విడుదల చేసింది చిత్రబృందం. ఇందులో మాయా అనే పాత్రలో కనిపించనుంది ఈ భామ. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది.
బాక్సింగ్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. అల్లు బాబీ, రినైసాన్స్ పిక్చర్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. జగపతి బాబు, ఉపేంద్ర, సునీల్ శెట్టి తో 0పాటు నవీన్ చంద్ర ఈ సినిమాల కీలక పాత్రలు పోషిస్తున్నారు. డిసెంబరు 3న ఈ సినిమా థియేటర్లలో సందడి చేయనుంది. ఈ క్రమలోనే ప్రమోషన్స్‌లో భాగంగా రోజుకో కొత్త అప్డేట్ విడుదల చేస్తున్నారు మేకర్స్.
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Read MoreWeb Title: Ghani movie heroin saiee manjrekar role first look released
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com