Ghaati Movie First Review: అనుష్క మెయిన్ లీడ్ లో క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఘాటీ’ సినిమా ఈనెల 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ రివ్యూ వచ్చేసింది అంటూ సోషల్ మీడియాలో ఒక న్యూస్ అయితే చక్కర్లు కొడుతోంది…ఇక ఈ సినిమా తో డైరెక్టర్ క్రిష్ తనను తాను ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరమైతే ఉంది. మరి ఏది ఏమైనా కూడా హరిహర వీరమల్లు సినిమా నుంచి తప్పుకున్న తర్వాత క్రిష్ మీద పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు చాలామంది ప్రేక్షకులు సైతం కొంచెం కోపంతో ఉన్నారు. ఎందుకంటే అంత మంచి సినిమాని వదులుకొని ఎందుకని ఆయన బయటికి వచ్చాడు అనే ధోరణిలో కొన్ని అభిప్రాయాలైతే వ్యక్తం అవుతున్నాయి. ఇక రీసెంట్ గా క్రిష్ ఇచ్చిన ఇంటర్వ్యూ తో వీరమల్లు సినిమా నుంచి తను బయటికి రావడానికి గల కారణాలను వెల్లడించాడు. ఇక ఏది ఏమైనా కూడా ఘాటీ సినిమా ఫస్ట్ రివ్యూ కొంతమందిని కలవరపెడుతోంది. అసలు ఇంతకీ ఈ సినిమా కథ ఏంటి కథనం ఎలా ఉంది. క్రిష్ డైరెక్షన్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నాడు అనే విషయాలను మనం ఒకసారి తెలుసుకుందాం…
అడవి ప్రాంతంలోని ఒక ఏరియాలో బతికే కొంతమంది వ్యక్తులు గంజాయి పంటలు పండిస్తూ బతుకుతూ ఉంటారు. వాళ్ళ జీవన ఆధారంగా చేసుకున్న ఆ గాంజాయి పంట వల్ల ఎలాంటి అనర్ధాలు జరిగాయి. దాంతో వాళ్లు ఎలాంటి నిర్ణయాన్ని తీసుకున్నారు అనే కథాంశంతో ఈ సినిమా అయితే తెరకెక్కింది…
ఇక అనుష్క ఈ సినిమాలో చాలా బెస్ట్ పెర్ఫార్మెన్స్ అయితే ఇచ్చినట్టుగా తెలుస్తోంది. దర్శకుడు కూడా తన శాయశక్తుల ప్రయత్నం చేసి ఈ కథను డిఫరెంట్ గా స్క్రీన్ మీద ప్రజెంట్ చేసే ప్రయత్నం అయితే చేశాడు. మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమాకి కొంతవరకు ప్లస్ అయిందనే వార్తలైతే వస్తున్నాయి… ఇక సినిమా ఫస్టాఫ్ కొంతవరకు డల్ అయిందనే వార్తలైతే వస్తున్నాయి. ఇక ఇప్పటికే క్రిష్ ఈ సినిమా మీద చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు.
సెకండాఫ్ లో ఒక మూడు ఎలిమెంట్స్ మాత్రం ప్రేక్షకుడిని ఆకట్టుకునే విధంగా ఉన్నాయనే వార్తలు కూడా వస్తున్నాయి. మరి ఆ మూడు ఎపిసోడ్ల వల్ల ఈ సినిమా నిలబడుతుందని సినిమా మేకర్స్ కూడా చాలా కాన్ఫిడెంట్ ని వ్యక్తం చేస్తున్నారు. మరి అనుష్క ఈ సినిమాలో తన నట విశ్వరూపాన్ని చూపించిందట… మొత్తానికైతే ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుందా? లేదా అనేది తెలియాలంటే మాత్రం సెప్టెంబర్ 5వ తేదీ వరకు వెయిట్ చేయాల్సిందే…