Getup Srinu: బుల్లితెర మీద ప్రసారమయ్యే జబర్దస్త్ కామెడీ షో ద్వారా లక్షలాది మంది అభిమానులను సొంతం చేసుకున్న కమెడియన్స్ లో ఒకరు గెటప్ శ్రీను..సుడిగాలి సుధీర్ టీం కి వెనుముక లాంటోడు..అందరూ ఈయనని బుల్లితెర కమల్ హాసన్ అని పిలుస్తూ ఉంటారు..ఆ స్థాయిలో గెటప్స్ వేసి నవ్వులు పూయించాడు..ముఖ్యంగా బిల్డ్ బాబాయి స్కిట్ సోషల్ మీడియా లో ఏ రేంజ్ లో ట్రెండ్ అయ్యిందో మన అందరికి తెలిసిందే..బుల్లితెర మీద ఈ రేంజ్ క్రేజ్ దక్కించుకున్న గెటప్ శ్రీను కి సినిమాల్లో అవకాశాలు కూడా బాగానే వస్తున్నాయి..రీసెంట్ గా ఆయన మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటించిన గాడ్ ఫాదర్ లో కూడా ఒక ముఖ్య పాత్ర పోషించాడు.

ఇది ఇలా ఉండగా ఎప్పుడు వివాదాలకు మరియు కాంట్రవర్సీలకు దూరంగా ఉండే గెటప్ శ్రీను , లేటెస్ట్ గా తన ఫేస్ బుక్ అకౌంట్ ద్వారా చేసిన ఒక కామెంట్ పెద్ద వివాదానికి దారి తీసింది..గెటప్ శ్రీను కి క్లోజ్ ఫ్రెండ్స్ అయినా సుడిగాలి సుధీర్ మరియు ఆటో రామ్ ప్రసాద్ కూడా ఏమి చెయ్యలేక అతని విషయం లో చేతులెత్తేశారు.
ఇక అసలు విషయానికి ఇటీవలే ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన ‘హను మాన్’ అనే పాన్ ఇండియా మూవీ టీజర్ వచ్చింది..ఈ టీజర్ కి సోషల్ మీడియా లో ఏ రేంజ్ రెస్పాన్స్ వచ్చిందో తెలిసిందే..15 కోట్ల రూపాయిల బడ్జెట్ తో 500 కోట్ల రూపాయిల క్వాలిటీ ఉన్న సినిమాని చేసావు..శబాష్ అంటూ అందరూ పొగడ్తలతో ముంచి ఎత్తేసారు..వారిలో గెటప్ శ్రీను కూడా ఒకడు..ఇతను అయితే కాస్త అతిశయ మోతాదు పెంచి ఇండస్ట్రీ కి మరో రాజమౌళి దొరికేసాడు అంటూ కామెంట్స్ చేసాడు..ఇక్కడే మనోడు నెటిజెన్స్ కి అడ్డంగా దొరికిపోయాడు..
రాజమౌళి తెలుగు చలన చిత్ర పరిశ్రమకి గర్వకారణం లాంటి మనిషి..ఆయన తదుపరి సినిమాలు హాలీవుడ్ మూవీస్ కలెక్షన్స్ తో పోటీపడుతాయి..ఇప్పుడు మీ ప్రశాంత్ వర్మ పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు అంటే అది రాజమౌళి మన మార్కెట్ ని పెంచడం వల్లే సాధ్యపడింది..అలాంటి రాజమౌళి తో ప్రశాంత్ వర్మ ని పోలుస్తావా..బుద్ది ఉందా నీకు..తిప్పి కొడితే రెండు బ్లాక్ బస్టర్ హిట్స్ కూడా లేని ప్రశాంత్ వర్మ ఎక్కడ..కెరీర్ మొత్తం మీద ఒక్క ఫ్లాప్ కూడా లేకుండా తెలుగు సినిమా ఇండస్ట్రీ ని ప్రపంచపటం లో పెట్టిన రాజమౌళి ఎక్కడా అంటూ గెటప్ శ్రీను పై తీవ్రమైన నెగటివ్ కామెంట్స్ వస్తున్నాయి.

మరో గెటప్ శ్రీను ఫాన్స్ కూడా నెగటివ్ కామెంట్స్ చేసే వాళ్ళని సోషల్ మీడియా లో ఎదురుకుంటున్నారు..అంతే కాకుండా సుడిగాలి సుధీర్ మరియు ఆటో రాంప్రసాద్ మీద కూడా విరుచుకుపడుతున్నారు..మీ స్నేహితుడిని అంత దారుణంగా తిడుతుంటే అతని తరుపున మీరైనా రియాక్ట్ అయ్యి ఎదో పొరపాటున అన్నాడు క్షమించండి చెప్పొచ్చు కదా..ఎప్పుడు కలిసి ఉంటారు కానీ కాస్త సమయాల్లో మాత్రం కలిసి ఉండలేరా అంటూ తిడుతున్నారు..మొత్తానికి కాంట్రవర్సీలకు దూరం గా ఉంటూ వచ్చే గెటప్ శ్రీను పొరపాటున నోరు జారడం తో పెద్ద చిక్కుల్లో ఇరుక్కున్నాడు.