
కరోనా ఎఫెక్ట్ తో థియేటర్లు, సినిమా షూటింగులు బంద్ అయ్యాయి. దీంతో సెలబ్రెటీలంతా ఇంటికే పరిమితమయ్యారు. సోషల్ మీడియాలో అభిమానులతో పిచ్చాపాటి మాట్లాడుతూ టైంపాస్ చేస్తున్నారు. ఎప్పుడు బీజీగా ఉండే హీరోలు దొరికిన సమయాన్ని ఫ్యామిలీతో గడుపుతున్నారు. ఇక హీరోయిన్లయితే హాట్ హాట్ ఫొటోలు, ఫొటో షూట్ లతో రెచ్చిపోతూ తమ ఫాలోయింగ్ ను పెంచుకుంటున్నారు.
Also Read: పాపం నిర్మాతలు.. తగ్గనంటున్న క్రియేటివ్ డైరెక్టర్ !
ఇటీవల కాలంలో దర్శకుడు పూరి జగన్మాథ్ సైతం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్నారు. సెలబ్రెటీల బర్త్ డేలకు విషెస్ చేస్తూ.. తన సినిమాల్లో నటించిన హీరోయిన్లతో పిచ్చపాటి మాట్లాడుతూ కన్పిస్తుంటాడు. అదేవిధంగా సమాజంలో నెలకొన్న సమస్యలపై తనదైన శైలిలో స్పందిస్తుంటాడు. తాజాగా పూరి పెళ్లిపై స్పందించాడు. ఇందుకు సంబంధించిన ఆడియో క్లిప్పును తన ఇన్ స్ట్రాగ్రామ్లో పోస్టు చేశాడు.
వివాహాలకు పోయేకాలం దగ్గరపడిందని.. పెళ్లి అంత మంచిదైతే ఏసు క్రీస్తు పది పెళ్లిళ్లు చేసుకునేవాడని.. ఉన్న భార్యను వదిలేయడం వల్లే రాజులా కుర్రాడు బుద్ధుడయ్యాడని.. ఏమైనా సాధించాలనుకుంటే పెళ్లి చేసుకోవద్దని.. పెద్ద పెద్ద ఆలోచనలుంటే ఎవరికీ తాళి కట్టొద్దు.. ప్రపంచమంతా తిరగాలని.. మీకు జీవితంలో ఏదైనా సాధించాలనే కసి, పట్టుదల ఉంటే కాళ్లకి పారాణి రాసుకోవద్దని సూచించాడు.
Also Read: రవితేజ మీద పగ పట్టిన డైరెక్టర్ !
నేను ఎలాగూ బుర్ర తక్కవ వాడినే.. మా ఆవిడ పకోడీలు చేస్తే తింటా.. సీరియల్ చూస్తా.. అని మీరు అనుకుంటుంటే.. అర్జంటుగా మీ శుభలేఖ నాకు పంపించండి.. నేను వచ్చి ఆశీర్వదిస్తా.. జీనియస్ లు ఎవరూ పెళ్లి చేసుకోరు.. పెళ్లి చేసుకున్న వారందరూ పెళ్లికాని బాబా కాళ్ల మీదే పడతారు.. పెళ్లి కాని హీరోయిన్‌కు ఉన్న ఫాలోయింగ్ పెళ్లి అయిన హీరోయిన్‌కు ఉండదు.. కాబట్టి మిమ్మల్ని మీరు తాడుతో కట్టేసుకోకండ`ని పూరి తనదైన శైలిలో పెళ్లిపై స్పందించాడు. పూరి మాటలు నిజమేనని అనిపిస్తున్నా.. ఎందరు ఆయన మాట వింటారనేది ఆసక్తికరంగా మారింది.