Geetu Royal: బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చాక గీతూ రాయల్ వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా ఆమె హౌస్లో తన అనుభవాలు, ఎలిమినేషన్ కి కారణాలు వెల్లడిస్తున్నారు. ఎలిమినేషన్ షాక్ నుండి ఇంకా బయటపడని గీతూ అది తలచుకొని కన్నీటి పర్యంతం అవుతున్నారు. తన గేమ్ గాడి తప్పడానికి బిగ్ బాస్ తో పాటు హోస్ట్ నాగార్జున పరోక్షంగా కారణమయ్యారని గీతూ ఆవేదన చెందుతున్నారు. హౌస్లో నేను ఏం చేసినా బిగ్ బాస్ ఏమీ అనేవాడు కాదు. పైగా నా గేమ్ ని బిగ్ బాస్ పొగుడుతూ ఉండేవాడు. ప్రచారం అవుతున్నట్లు బిగ్ బాస్ దత్తపుత్రికను అని నాకు కూడా అనిపించింది.

హోస్ట్ నాగార్జున సైతం నా గేమ్ ని ఎంతగానో పొగిడారు. వీకెండ్ ఎపిసోడ్ గంట గంటన్న మాత్రమే చూపిస్తారు. కానీ దాదాపు నాలుగు గంటలు అది జరుగుతుంది. ఎలిమినేషన్ రోజు కూడా నాగార్జున నాపై ప్రశంసలు కురిపించారు. ఈ హౌస్లో నటించని, జెన్యూన్ ప్లేయర్ ఒక్క గీతూనే. ఆమె మిగతా కంటెస్టెంట్స్ నుండి ఫైర్ బయటకు తీసింది అన్నారు. అది ఎపిసోడ్లో చూపించలేదు. హౌస్ ని పాలించకుండానే బయటకు వెళ్ళిపోతున్నానని బాధపడ్డాను. దానికి నాగార్జున 9 వారాలు హౌస్ ని ఏలింది నువ్వే అని చెప్పారని గీతూ వెల్లడించారు.
బిగ్ బాస్, నాగార్జున నా గేమ్ ని పొగుడుతూ నన్ను ములక చెట్టు ఎక్కించారు. ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ కి కారణమయ్యారు. టైటిల్ గెలిచేది నేనే అనుకున్నాను. కనీసం టాప్ 5 లో ఉంటానని గట్టిగా ఫిక్స్ అయ్యాను. ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ నా గేమ్ ని దెబ్బతీసిందని గీతూ వాపోయారు.

నిజంగా డే వన్ నుండి గీతూ హౌస్లో ఎంటర్టైన్ చేయడానికి ట్రై చేసింది. ఉన్నది ఉన్నట్లు మాట్లాడుతూ ఫైర్ ఉన్న జెన్యూన్ ప్లేయర్ గా పేరు తెచ్చుకుంది. అయితే 8,9 వారాల్లో ఆమె గేమ్ గతి తప్పింది. ఓవర్ కాన్ఫిడెన్స్ ఆమెలో స్పష్టంగా కనిపించింది. బిగ్ బాస్ రూల్స్ కూడా పక్కన పెట్టి తన రూల్స్ అమలు చేయడానికి చూసింది. కంటెస్టెంట్స్ తో ఆట ఆడిస్తా అంటూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడింది. ఆ వారం నాగార్జున గీతూకి గట్టి వార్నింగ్ ఇచ్చాడు. 9వ వారం కూడా వరస్ట్ గేమ్ ఆడిన గీతూ పూర్తి నెగిటివిటీ మూటగట్టుకొని ఎలిమినేట్ అయ్యింది.


