Geethanjali Malli Vachindi Review: ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’ మూవీ రివ్యూ…

అంజలి ఈ సినిమాతో తనని తాను మరోసారి ప్రూవ్ చేసుకొని మంచి కంబ్యాక్ ఇచ్చిందా? లేదా అనే విషయాలను మనం ఒకసారి బ్రీఫ్ అనాలసిస్ ద్వారా తెలుసుకుందాం...

Written By: Gopi, Updated On : April 25, 2024 5:44 pm

Geethanjali Malli Vachindi Movie Review

Follow us on

Geethanjali Malli Vachindi Review: రైటర్ కోన వెంకట్ ఒకప్పుడు కమర్షియల్ సినిమాలకి కథ మాటలు అందించి స్టార్ రైటర్ గా ఇండస్ట్రీ లో చాలా సంవత్సరాల పాటు మంచి గుర్తింపు పొందాడు. ఇక ఇప్పుడు ఆయన రాసిన కథలు పెద్దగా సక్సెస్ కాకపోవడంతో అడపదడపా సినిమాలకి కథ మాటలు అందిస్తూ వస్తున్నాడు. ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన ఒకప్పుడు కథ మాటలు అందించి ప్రొడ్యూసర్ గా కూడా వ్యవహరించిన గీతాంజలి సినిమా సూపర్ డూపర్ సక్సెస్ ని సాధించింది.ఇక హార్రర్ కామెడీ జానర్ లో తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో సూపర్ హిట్ అయింది. ఇక దాదాపు 10 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఆ సినిమాకి సీక్వెల్ గా “గీతాంజలి మళ్లీ వచ్చింది” అనే పేరుతో ఒక సినిమాని చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఇక ఈ రోజు రిలీజ్ అయిన ఈ సినిమా ఎలా ఉంది. కోన వెంకట్ కి ఈ సినిమాతో ఓ మంచి సక్సెస్ దక్కిందా? అంజలి ఈ సినిమాతో తనని తాను మరోసారి ప్రూవ్ చేసుకొని మంచి కంబ్యాక్ ఇచ్చిందా? లేదా అనే విషయాలను మనం ఒకసారి బ్రీఫ్ అనాలసిస్ ద్వారా తెలుసుకుందాం…

కథ

ముందుగా ఈ సినిమా కథ విషయానికి వస్తే శ్రీను ( శ్రీనివాస రెడ్డి),ఆరుద్ర( శకలక శంకర్), ఆత్రేయ(సత్యం రాజేష్) లాంటి వారు హైదరాబాద్ లో సినిమా అవకాశాల కోసం విపరీతంగా కష్టపడుతూ ఉంటారు. అవకాశం వచ్చినట్టే వచ్చి చేజారిపోతుంటుంది. ఇక ఇలాంటి సమయం లోనే అయాన్ (సత్య) హీరో అవ్వాలనే కోరికతో శ్రీను, ఆరుద్ర, ఆత్రేయ లకు అయ్యే ఖర్చులు మొత్తం తనే చూసుకుంటాడు… ఇక ఇలాంటి క్రమంలో వీళ్లకి వచ్చిన ఒక సినిమా అవకాశాన్ని వాడుకొని ఒక సినిమా తీయాలని అనుకుంటారు. ఇక ఇలాంటి క్రమంలో కంపల్సరీ గా ఆ సినిమాని “సంగీత్ మహల్” లోనే తీయాలని అందులో హీరోయిన్ గా అంజలిని పెట్టీ తీయాలని ప్రొడ్యూసర్ ఒక చిన్న కండిషన్ పెట్టడంతో తప్పని సరి పరిస్థితుల్లో వీళ్లు కూడా ఒప్పుకొని సంగీత్ మహల్ కి వెళ్లి అక్కడ అంజలిని హీరోయిన్ గా పెట్టి ఆ సినిమాని తెరకెక్కించే ప్రయత్నం చేస్తుంటారు. ఇక వీళ్ళకి గీతాంజలి కి మధ్య సంబంధం ఏంటి? సినిమా అక్కడే తీయాలని ప్రొడ్యూసర్ ఎందుకు వీళ్లకు కండిషన్ పెట్టాడు? గీతాంజలి కి ఈ సినిమాలో హీరోయిన్ గా చేస్తున్న అంజలికి మధ్య సంబంధం ఏంటి? అనే విషయాలు తెలియాలి అంటే మీరు తప్పకుండా ఈ సినిమా చూడాల్సిందే…

విశ్లేషణ

ఇక ఈ సినిమా విశ్లేషణ విషయానికి వస్తే ఈ సినిమా దర్శకుడు అయిన శివ ఈ సినిమాను కామెడీ ఎంటర్ టైనర్ గా తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. అందులో కొంతవరకైనా సక్సెస్ అయ్యాడు. ఇక ఈ సినిమాకి కథ, మాటలను అందించిన కొన వెంకట్ తన మాటలతో కొంతవరకు సక్సెస్ ని సాధించాడనే చెప్పాలి. ఇక దర్శకుడు శివ ఈ సినిమా ప్లాట్ పాయింట్ ను ఓన్ చేసుకొని పేపర్ మీద ఉన్న ప్రతి సీన్ ను స్క్రీన్ మీదకి ఆజ్ ఇట్ ఇజ్ గా తీసుకువచ్చే ప్రయత్నం అయితే చేశాడు. ఇక ఈ విషయంలో మనం దర్శకున్ని మెచ్చుకోవచ్చు. కానీ హార్రర్ సినిమాల ట్రెండ్ స్టార్ట్ అయినప్పటి నుంచి నడిచే ఒక రొటీన్ రెగ్యులర్ కథని ఈ సినిమా కోసం ఎంచుకోవడం అనేది ఈ సినిమాకి చాలా వరకు మైనస్ అయిందనే చెప్పాలి. ఇక ఇప్పటికే ఇలాంటి కథలని మనం ఒక 100 నుంచి 200 చూసేశాం. కాబట్టి కొత్తదనం ఏమీ లేని ఇలాంటి కథను ఎంచుకొని హిట్ కొట్టాలని రైటర్ కోన వెంకట్ గాని, దర్శకుడు శివ గాని ఎలా అనుకున్నారనేది ఇప్పుడు మనకు అర్థం కాని ప్రశ్న…

ఇక రోటీన్ స్టోరీ కావడం వల్లే ఈ సినిమాలో హార్రర్ సీన్స్ అంతలా పండలేదు. ఇక ఇలాంటి ఒక రొటీన్ రొట్ట ఫార్ములా సినిమాను తీసి జనాల మీదికి వదలడం అనేది కరెక్ట్ కాదు. అయితే ఈ సినిమా మరి అంత తీసిపారేసేలా ఉందా అంటే అలా ఏం లేదు. ఫస్ట్ హాఫ్ కొంచెం బోరింగ్ ఉన్నప్పటికీ సెకండ్ హాఫ్ లో సునీల్,సత్య, అలీ వాళ్ల కామెడీతో ఈ సినిమాకి కొంతవరకు హెల్ప్ చేశారనే చెప్పాలి. కానీ హర్రర్ సినిమా అంటే మరీ ఇంత రొటీన్ ఫార్ములానే ఎందుకు ఫాలో అవడం కొత్త వే లో సినిమాని టేకాఫ్ చేసి ఉంటే వీళ్ళకి మంచి గుర్తింపు వచ్చి ఉండేది… నార్మల్ గా హార్రర్ సినిమా కాబట్టి ఈ సినిమాలో పెద్దగా లాజిక్కులను పట్టుకొని చూడాల్సిన అవసరం అయితే లేదు.కానీ మొత్తానికి లాజిక్కులేం లేకుండా స్టోరీని రాసుకోవడం అనేది కూడా కరెక్ట్ కాదు. ఇక ఈ సినిమాకి కోన వెంకట్ తో పాటు భాను కూడా రైటర్ గా వ్యవహరించాడు. ఇప్పటికే భాను ధమాకా, సమాజవరగమన లాంటి సక్సెస్ ఫుల్ సినిమాలకి కథ, స్క్రీన్ ప్లే, డైలాగులల్లో సహకారం అందించాడు. కాబట్టి ఆయన పేరు ఈ మధ్య బాగా వినిపిస్తుంది. ఇక ఆయన కూడా డైరెక్టర్ గా మారి రవితేజ తో ఒక సినిమా చేయబోతున్నాడు.

అయినప్పటికీ ఆయన రాసిన కొన్ని డైలాగులు గాని, కొన్ని సీన్లు గాని ఈ సినిమాలో కామెడీని పందించినప్పటికి ఎంటైర్ సినిమాను చూసుకుంటే మాత్రం సగటు ప్రేక్షకుడికి మాత్రం అంతలా నచ్చే విధంగా అయితే ఈ సినిమాను లేదు..ఇక కోన వెంకట్ ఇప్పటికైనా కొన్ని మంచి కథలను రాసి మరోసారి తనను తాను రైటర్ గా ప్రూవ్ చేసుకుంటే మంచిది. అలా కాకుండా రొటీన్ ఫార్ములా కథలను మళ్లీ తీసుకొచ్చి చేయడం వల్ల ఆయనకి వచ్చేది ఏమి లేదు. కాబట్టి ఇలాంటి కథలు సినిమాలు ఆయనకు చాలా వరకు మైనస్ అయ్యే అవకాశాలు అయితే పుష్కలంగా ఉన్నాయి.

ఆర్టిస్టుల పర్ఫామెన్స్

ఇక ఈ సినిమాలో ఆర్టిస్టులు పర్ఫామెన్స్ విషయానికి వస్తే శ్రీనివాసరెడ్డి, అలీ, సత్యం రాజేష్ ,సత్య, సునీల్ లా యాక్టింగ్ అద్భుతంగా ఉంది. ప్రతి సీన్ లో వీళ్ళు పండించిన కామెడీ బాగుంది. అయినప్పటికీ ఈ సినిమా మాత్రం ప్రేక్షకుడిని ఎంగేజింగ్ చేయలేకపోయింది. ఇక అంజలి నటన కూడా చాలా సెటిల్డ్ గా ఉంది. తనకు ఇది కంబ్యాక్ సినిమా అవుతుందని అనుకున్నప్పటికీ దీనికంటే ఆమె ఇంతకు ముందు చేసిన గీతాంజలి సినిమానే బాగుంది. ఆ సినిమా ద్వారా ఆమెకి మంచి గుర్తింపురావడమే కాకుండా అవకాశాలు కూడా వచ్చాయి… ఇక రవి శంకర్ క్యారెక్టర్ బాగుంది. భైరవకోన తర్వాత ఈ సినిమాలో ఒక మంచి పాత్ర లో నటించాడు. ఇక మిగిలిన ఆర్టిస్టులు అందరూ వాళ్ళ పాత్రల పరిధి మేరకు ఓకే అనిపించారు…

సాంకేతిక అంశాలు…

ఇక ప్రవీణ్ లక్కరాజు ఇచ్చిన మ్యూజిక్ కొంతవరకు ఓకే అనిపించినప్పటికీ, కొన్ని ఇంపార్టెంట్ హర్రర్ సీన్స్ లో మాత్రం ఆ మ్యూజిక్ అంత ఇంపాక్ట్ చూపించలేదు. ఇక సినిమా విజువల్స్ పరంగా అంత పర్ఫెక్ట్ గా రాలేదు. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చల్. పూర్ గా ఉన్నాయి. కోన వెంకట్, ఎం వి వి సత్యనారాయణ నిర్మతలుగా వ్యవహ. అయినప్పటికీ కొన్ని సీన్లల్లో మాత్రం ప్రొడక్షన్ వాల్యూస్ చాలా చీప్ గా ఉన్నట్టుగా అనిపించింది…

ప్లస్ పాయింట్స్

సెకండాఫ్ లో వచ్చే కొన్ని కామెడీ సీన్స్…
సునీల్, అలీ, సత్య లా యాక్టింగ్…

మైనస్ పాయింట్స్

రోటీన్ కథ, స్క్రీన్ ప్లే
హార్రర్ ఎపిసోడ్స్
లాజిక్స్ లేని సీన్స్…

రేటింగ్
ఇక ఈ సినిమాకి మేము ఇచ్చే రేటింగ్ 2/5

చివరి లైన్
హార్రర్ కామెడీ అన్నారు. కామెడీ ఒకే కానీ హార్రర్ మిస్ అయింది…