Dhee Special : వాలెంటైన్స్ డే దగ్గర పడుతున్న కొద్దీ, బుల్లితెరపై ప్రేమికుల దినోత్సవం సంబరాలు మొదలయ్యాయి. ప్రతి షో ఇప్పుడు వాలంటైన్స్ డే నేపథ్యంలో ప్రేమ, ఫన్, ఎమోషనల్ క్షణాలతో నిండిపోతుంది. ఇక ప్రముఖ రియాలిటీ డాన్స్ షో ‘ఢీ’ కూడా ఈ ఎపిసోడ్‌ను వాలెంటైన్స్ డే స్పెషల్‌గా ప్లాన్ చేసుకుంది. ఈ ప్రత్యేక ఎపిసోడ్‌లో ప్రేమను వ్యక్త పరిచే విధంగా అనే డ్యాన్స్ లు, పలువురి లవ్ స్టోరీలను సందడిగా మారింది. ప్రస్తుతం వాలంటైన్స్ డే నాడు ప్రసారం అయ్యే షోకు సంబంధించిన ట్రైలర్ రిలీజ్ అయింది. ఈ ఎపిసోడ్ కంప్లీట్ గా వాలంటైన్స్ డే స్పెషల్ గా రాబోతోంది.
ఈ వాలెంటైన్స్ డే స్పెషల్ ఎపిసోడ్‌లో హైపర్ ఆది నందుకు ఒక ఫన్నీ ఛాలెంజ్ ఇచ్చాడు. “నువ్వు ఇప్పుడు ఇక్కడ నుంచి డైరెక్ట్‌గా గీతామాధురికి ఫోన్ చేసి ‘ఐ లవ్ యూ’ అని చెప్పమని ఫన్నీ టాస్క్ ఇస్తాడు. నందు, ఈ ఛాలెంజ్‌ను అంగీకరించి, గీతామాధురిను ఫోన్‌లో కాల్ చేసి, తన ప్రేమను వ్యక్తం చేశాడు. అయితే, గీతా మాత్రం నవ్వుతూ, “ఆ ఆ” అంటూనే పూర్తిగా వినకుండా ఫోన్ కట్టేసింది. దీని తర్వాత ఆది, హన్సిక పగలబడి నవ్వారు, అయితే నందు తన ఈగో మాత్రం హర్ట్ అయినట్లు తెలుస్తుంది.
అయితే, వెంటనే గీతామాధురి నందుకు ఫోన్ చేసింది. ఈ సారి నందు ఫోన్ లిఫ్ట్ చేసి “ఐ లవ్ యూ” అన్నాడు. గీతా స్పందిస్తూ, “ఐ లవ్ యూ టూ…ఇక్కడ అందరూ ఉన్నారు, కట్ చెయ్” అని గుసగుసగా చెప్పి ఫోన్ పెట్టేసింది. ఈ మాటతో షో మొత్తం నవ్వుల సందడిగా మారింది. నందు జోష్‌తో ఫుల్ ఖుషీగా ఉన్నాడు.
నందు, గీతామాధురి టాలీవుడ్‌లో అత్యంత క్యూట్ కపుల్స్‌గా పేరుపొందారు. వీరి సంతానం గురించి కూడా అభిమానులకు చాలా మందికి తెలుసు. 2014లో వీరు ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆ తరువాత 2019లో వీరికి ఒక పాప పుట్టింది. ఆమె పేరు దాక్షాయణి ప్రకృతి. ఇక, మరి కొద్ది సంవత్సరాలకు వీరికి ఒక బాబు పుట్టాడు. అతని పేరు ధృవధీర్ తారక్. సోషల్ మీడియాలో ఈ జంట తరచూ యాక్టివ్‌గా ఉంటూ, వారి అభిమానులతో ప్రతి క్షణాన్ని పంచుకుంటారు. వీరికి ఉన్న ప్రేమ, పరస్పర బంధం, సరదా క్షణాలు, వారు చేస్తున్న పని, వారి జీవితానికి సంబంధించిన ప్రతి అంశాన్ని షేర్ చేసుకుంటారు. ఈ సారి ‘ఢీ’ షోలో జరిగిన ఈ ప్రేమికుల దినోత్సవ స్పెషల్ ఎపిసోడ్, నందు, గీతామాధురి మధ్య ప్రేమను చూపిస్తూ, ప్రేక్షకుల మన్ననలు గెలుచుకుంది.