Bigg Boss 8 Telugu Finale LIVE : ఇన్ని రోజులు బిగ్ బాస్ సీజన్ 8 టైటిల్ విన్నర్ గా ఎవరు నిలవబోతున్నారు అనే దానిపై ఏ రేంజ్ చర్చలు నడిచాయి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ప్రతీ సీజన్ లోనూ నాలుగు వారాల తర్వాత టైటిల్ విన్నర్ ఎవరో తెలిసిపోయేది. కానీ ఈసారి మాత్రం వైల్డ్ కార్డు కంటెస్టెంట్ గా వచ్చిన గౌతమ్ నిఖిల్ కి చాలా బలమైన పోటీ ని ఇచ్చాడు. దీంతో ఎవరు టైటిల్ గెలవబోతున్నారు అనేది చెప్పలేకపోయారు. బిగ్ బాస్ టీం కి కూడా ఫినాలే లో వీళ్లిద్దరికీ పడిన ఓటింగ్ ని చూసి షాక్ కి గురి అయ్యారట. బిగ్ బాస్ హిస్టరీ లో ఇంత క్లోజ్ ఫైట్ ఇప్పటి వరకు జరగలేదట. అయితే ఈ పోరు లో నిఖిల్ దే చివరికి పై చెయ్యి గా నిల్చింది. స్వల్ప మెజారిటీ తో నిఖిల్ టైటిల్ ని గెలుచుకున్నాడు.
ముఖ్య అతిథిగా విచ్చేసిన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ చేతుల మీదుగా ఆయన టైటిల్ అందుకున్నాడు. అయితే టాప్ 3 కంటెస్టెంట్స్ మిగిలినప్పటి నుండి సూట్ కేసు ఆఫర్లు వచ్చాయట. కానీ కంటెస్టెంట్స్ స్వీకరించలేదు. టాప్ 2 కంటెస్టెంట్స్ గా మిగిలినప్పుడు నిఖిల్, గౌతమ్ కి నాగార్జున భారీ ఆఫర్ ఇచ్చాడు. ఎవరో ఒకరు 55 లక్షల రూపాయిల ప్రైజ్ మనీ ని తీసుకొని టైటిల్ రేస్ నుండి తప్పుకోవచ్చు అని బంపర్ ఆఫర్ ఇస్తాడు నాగార్జున. ఈ ఆఫర్ కి వీళ్లిద్దరు ఒప్పుకోరు. దీంతో ఓటింగ్ ప్రకారం నిఖిల్ టైటిల్ విన్నర్ అయ్యాడు. గౌతమ్ అభిమానులకు ఇది చాలా బాధని కలిగించింది. పడిన కష్టానికి కనీసం ప్రైజ్ మనీ ని తీసుకొని వచ్చునంటే బాగుండేది అని సోషల్ మీడియా లో ఆయన అభిమానులు తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తం చేస్తున్నారు. కానీ ఏది ఏమైనా వీళ్లిద్దరు టైటిల్ గెలుచుకోవడానికి అర్హులు. గౌతమ్ వైల్డ్ కార్డు గా అడుగుపెట్టి రన్నర్ గా నిలవడం అనేది సాధారణమైన విషయం కాదు.