Bigg Boss 7 Telugu Gautham Krishna: బిగ్ బాస్ గురించి తెలిసిందే. కంటెస్టెంట్స్ ఒకరితో మరొకరు కలిసిపోయి హ్యాపీగా ఉంటే ఆయనకు నచ్చదు. ఎప్పుడూ గొడవలు పడాలని కోరుకుంటాడు. హౌస్ ప్రశాంతంగా ఉంటే ప్రేక్షకులకు మజా రాదని బిగ్ బాస్ అభిప్రాయం. అందుకే కంటెస్టెంట్స్ మధ్య చిచ్చు పెడుతూ ఉంటాడు. నామినేషన్స్ ప్రక్రియ అందుకే. ఇక సీక్రెట్ టాస్క్స్ ఉండనే ఉన్నాయి. వాటితో కంటెస్టెంట్స్ కొట్టుకునేలా చేస్తాడు.
బిగ్ బాస్ సీజన్ 7 మొదలై వారం రోజులు కూడా గడవలేదు. సీక్రెట్ టాస్క్స్ తో కంటెస్టెంట్స్ మధ్య వివాదాలు రాజేసే ప్రయత్నం జరుగుతుంది. బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ లో భాగంగా యూట్యూబర్ టేస్టీ తేజా ఇద్దరు కంటెస్టెంట్స్ మధ్య పుల్లలు పెట్టాడు. ప్రిన్స్ యావర్, గౌతమ్ కృష్ణ ఒకరిగురించి మరొకరు తప్పుగా మాట్లాడారని వాళ్లకు చెప్పాడు. మొదట ప్రిన్స్ యావర్ వద్దకు వెళ్లి ”గౌతమ్ నిన్ను అన్న మాటలు వింటే బాధేస్తుంది బ్రో. నువ్వు బాడీ చూపిస్తూ బాగా షో చేస్తున్నావంట. బిల్డప్ ఇస్తున్నావట” అని చెప్పాడు.
తేజా మాటలకు ప్రిన్స్ పెద్దగా రియాక్ట్ కాలేదు. తర్వాత గౌతమ్ కృష్ణ దగ్గరకు పోయి ”యావర్ నీ గురించి తప్పుగా అన్నాడు. అతని బాడీ చూసి నువ్వు కుళ్ళుకుంటున్నావట. అతనిలాగే నువ్వు కూడా బాడీ చూపించాలని ట్రై చేస్తున్నావట” అని అన్నాడు. తేజా చాడీలకు గౌతమ్ రియాక్ట్ అయ్యాడు. నేను డాక్టర్ ని. నా బాడీ సహజంగా డెవలప్ అయ్యింది. యావర్ వలె నేను ఇంజక్షన్స్ వాడి పెంచలేదు అన్నాడు.
ఈ చాడీలు ఎఫెక్ట్ నామినేషన్స్ లో కనిపించింది. అయితే తేజా సీక్రెట్ టాస్క్ లో భాగంగా ఇలా చేశాడని యావర్, గౌతమ్ కృష్ణ తర్వాత అర్థం చేసుకున్నారు. దీంతో ఇద్దరూ ఒక్కటైపోయారు. ఇక ఈ వారం నామినేషన్స్ లో పల్లవి ప్రశాంత్, శోభా శెట్టి, షకీలా, కిరణ్ రాథోడ్, గౌతమ్ కృష్ణ, దామిని, ప్రిన్స్ యావర్, రతికా రోజ్ ఉన్నారు. వీరిలో ఒకరు వచ్చే వారం ఎలిమినేట్ కానున్నారు.