Gangar Movie Review : తమిళ్ సినిమా ఇండస్ట్రీ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటీని సంపాదించుకున్న దర్శకుడు సుందర్ సి (Sunde C)…ఒకప్పుడు రజనీకాంత్ (Rajinikanth) తో అరుణాచలం (Arunachalam) అనే సినిమా చేశాడు… ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. ఇక ఈయన ఈ మధ్య కాలంలో ఎక్కువగా దయ్యాలు, ఆత్మలు అంటూ సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు… ఇక ఇప్పుడు ‘గ్యాంగర్ ‘ (Ganger) అనే కామెడీ థ్రిల్లర్ సినిమా ను చేశాడు…ఈ సినిమా ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫాం అయిన అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది…ఈ మూవీ ఎలా ఉంది అనేది ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…
కథ
కథ విషయానికి వస్తే ఇది ఒక ఊరిలో జరిగే స్టొరీ… ఒకే ఊర్లో ఉంటున్న మల్లేష్ (మైమ్ గోపి), కోటేష్ (అరుళ్ దాస్) ఇద్దరు అన్నదమ్ములు వాళ్ల కనుసన్నల్లో ఆ ఊరుని నడిపిస్తూ ఉంటారు. ఆ ఊరిని అడ్డాగా చేసుకుని ఎన్నో ఇల్లీగల్ బిజినెస్ లను సైతం చేస్తూ ఉంటారు… ఇదే సమయంలో అక్కడి గవర్నమెంట్ స్కూల్లో రమ్య అనే ఒక టీనేజ్ అమ్మాయి కనిపించకుండా పోతుంది. ఇక అదే స్కూల్లో టీచర్ గా చేస్తున్న సుజిత (కేథరిన్) ఆ అమ్మాయి మిస్ అయినట్టుగా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తుంది. మరి ఆ అమ్మాయిని మిస్ చేసింది ఎవరు? ఈ ఇల్లీగల్ బిజినెస్ లకు ఆ అమ్మాయి కిడ్నాప్ కి మధ్య ఏదైనా సంబంధం ఉందా అనే విషయాలు తెలియాలంటే మీరు ఈ సినిమా చూడాల్సిందే…
విశ్లేషణ
ఇక ఈ మూవీ విశ్లేషణ విషయానికి వస్తే దర్శకుడు సుందర్ సి ఈ సినిమాని చాలా ఇంటెన్స్ థ్రిల్లర్ లా తెరకెక్కించే ప్రయత్నం చేశాడు. అలాగే ఈ సినిమాలో ట్విస్ట్ లను సైతం చాలా వరకు హోల్డ్ చేసి పెట్టుకుని అసలు ఏ ఆడియోన్ కూడా ట్విస్ట్ లను ఎక్స్పెక్ట్ చేయని విధంగా వాటిని తీర్చిదిద్దాడు. ముఖ్యంగా ట్విస్ట్ ల మీద ఈ సినిమా మొత్తం నడుస్తుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు… సుందర్ సి ఈ మధ్యకాలంలో చేస్తున్న సినిమాలన్నీ హార్రర్ జానర్ లోనే తెరకెక్కిస్తుండటం విశేషం…కానీ మొదటిసారి తను చేసిన ఈ మిస్టీరియస్ థ్రిల్లర్ సినిమా చూసిన ప్రేక్షకులందరికీ ఏదో ఒక కొత్త అనుభూతినైతే ఇస్తుంది…
సుందర్ సి నటన కూడా చాలా బాగుంది… అక్కడక్కడ కొన్ని లాజిక్స్ మిస్ అయినప్పటికి సినిమా మొత్తాన్ని ముందుకు తీసుకెళ్లిన విధానం అయితే చాలా బాగుంది. ఇక ఎంటర్ టైనింగ్ గా చెబుతూ ఎక్కడ కూడా ప్రేక్షకుడికి బోర్ కొట్టే వీలు లేకుండా జాగ్రత్త పడ్డారు… ఇక కొన్ని సీన్లలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే అద్భుతంగా ఉంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వల్లే కొన్ని సీన్ల మీద విపరీతమైన హైప్ అయితే పెరిగింది…
ఆర్టిస్టుల పర్ఫామెన్స్
ఆర్టిస్టుల పర్ఫామెన్స్ విషయానికి వస్తే సుందర్ సి చాలా అద్భుతంగా నటించడనే చెప్పాలి. అలాగే కేథరిన్ కూడా తన పాత్రలో పరిధి మేరకు ఒదిగిపోయి నటించి సినిమా మీద హైప్ ని తీసుకొచ్చింది. వడివేలు కామెడీ అక్కడక్కడ బాగున్నప్పటికి చాలా వరకు రొటీన్ కామెడీ అనిపించింది. ఆయన తన నటనలో వేరియేషన్ అయితే చూపించలేక పోతున్నారు… ఎప్పుడో 90స్, ఎర్లీ 2000 నాటి కామెడీ నే ఇప్పుడు కూడా ప్రేక్షకుల మీద రుద్దాలి అని చూస్తే అది ఏ మాత్రం వర్కౌట్ అవ్వదు.
ఈ సినిమా ద్వారా వడివేలు తన నటనకి స్వస్తి చెప్పి రెస్ట్ తీసుకుంటే బాగుంటుంది. ఇంతకుముందు బ్రహ్మానందం సైతం ఇలాంటి రొటీన్ కామెడీ చేస్తున్నాడు అనే ఒక ముద్ర పడడంతో ఆయన కొత్త క్యారెక్టర్ లను ఎంచుకుంటూ ఇక దానికి తగ్గట్టుగానే సినిమాలు ఎక్కువగా చేయకుండా రెస్ట్ తీసుకుంటున్నాడు… మరి వడివేలు కూడా అదే విషయం తీసుకుంటే మంచిదని ఈ సినిమాను చూస్తే మనకు క్లియర్ గా అర్థం అయిపోతుంది…
టెక్నికల్ అంశాలు…
ఇక ఈ మూవీ టెక్నికల్ అంశాల విషయానికి వస్తే మ్యూజిక్ కొంతవరకు పర్లేదు అనిపించినప్పటికి బ్యాగ్రౌండ్ స్కోర్ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా తీసుకున్నారు… సినిమాటోగ్రఫీ విషయానికి వస్తే అక్కడక్కడ కొన్ని బ్లాక్స్ సీరియల్ చూస్తున్నట్టుగా అనిపించినప్పటికి ఇంకా కొన్ని సీన్స్ లో మాత్రం ఎక్స్ట్రాడినరీ విజువల్స్ అయితే అందించే ప్రయత్నం చేశారు…ముఖ్యంగా మిస్టీరియస్ సన్నివేశాల్లో విజువల్స్ బాగున్నాయి. విజువల్ గా ఈ సినిమా కొంతవరకు ఓకే అనిపించినప్పటికి కంటెంట్ సినిమాను ఎంగేజ్ చేస్తూ ముందుకు తీసుకెళ్తుంది. కాబట్టి విజువల్ మీద ప్రేక్షకుడు అంత పెద్దగా ఫోకస్ చేసే అవకాశం అయితే లేదు…
ప్లస్ పాయింట్స్
ఫస్ట్ హాఫ్
ట్విస్టులు
మైనస్ పాయింట్స్
అనవసరపు సీన్స్…
వడివేలు కామెడీ…
రేటింగ్
ఈ మూవీకి మేము ఇచ్చే రేటింగ్ 2.25/5