
Gang Leader: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ‘వాల్తేరు వీరయ్య’ సక్సెస్ తో ఫుల్ జోష్ మీద ఉన్నాడు.ఈ సినిమా ఫలితం మెగా అభిమానులను చాలా కాలం తర్వాత పండగ చేసుకునేలా చేసింది..అయితే ఈ ఊపుని క్యాష్ చేసుకునేందుకు కొన్ని మూడవ పార్టీ బయ్యర్లు మెగాస్టార్ చిరంజీవి నటించిన పాత ఇండస్ట్రీ హిట్ చిత్రం ‘గ్యాంగ్ లీడర్’ ని 4K క్వాలిటీ కి మార్చి నిన్న గ్రాండ్ గా రెండు తెలుగు రాష్ట్రాలలో విడుదల చేసారు.కేవలం ఒకటి రెండు చోట్ల తప్ప ఈ సినిమాకి ఎక్కడా కూడా హౌస్ ఫుల్ కలెక్షన్స్ నమోదు కాలేదు.
దీనిని బట్టీ అభిమానులు ఈ సినిమాని ప్రోత్సహించేందుకు సిద్ధంగా లేరని తెలుస్తుంది.కొత్త సినిమా లాగానే ఈ చిత్రాన్ని కూడా భారీ లెవెల్ లో విడుదల చేసారు, కానీ ప్రొమోషన్స్ పెద్దగా చెయ్యకపోవడం, అందులోనూ మరీ పాత సినిమా అవ్వడం వల్లే ఫ్యాన్స్ ఆసక్తి చూపించలేదని ట్రేడ్ పండితులు చెప్తున్నామాట.

మొత్తం మీద రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి ఈ సినిమా మొదటి రోజు 20 లక్షల రూపాయిల గ్రాస్ ని వసూలు చేసిందని అంచనా వేస్తున్నారు.అంటే ప్రింట్ ని తయారు చేయించడానికి అవసరమైన డబ్బులను తిరిగి రప్పించింది అన్నమాట.అయితే ఈ చిత్రాన్ని కేవలం ఒక్క రోజు కోసం విడుదల చేసింది కాదు,వారం రోజులపాటు థియేటర్స్ లో ఉంటుంది.కాబట్టి ఫుల్ రన్ లో 50 నుండి 70 లక్షల రూపాయిల వరకు గ్రాస్ ని వసూలు చేస్తుందని అంచనా.
ఇది డీసెంట్ స్థాయి వసూళ్లే అయ్యినప్పటికీ మెగాస్టార్ రేంజ్ కి ఇది చాలా తక్కువ.అభిమానులు కూడా మా ప్రేమని క్యాష్ చేసుకోవడానికి ఎవడు పడితే వాడు మధ్యలోకి వచ్చి ఇలా రీ రిలీజ్ లు చేస్తే ప్రోత్సహించబోమని ఇది వరకు పలుసార్లు చెప్పారు కూడా, ఈసారి ఆచరించి చూపించారు.రాబొయ్యే రోజుల్లో రీ రిలీజ్ కోసం వెంపర్లేదే మూడవ పార్టీ వాళ్లకు ఇది ఒక హెచ్చరిక అనే చెప్పాలి.