Gandeevadhari Arjuna Collections: సోషల్ మీడియా టాక్ ఎంతగా చిత్ర ఫలితాలను ప్రభావితం చేస్తుందో చెప్పేందుకు గాండీవధారి అర్జున నిదర్శనం. జనాలు రివ్యూలు రేటింగ్ లు చూసి సినిమాలకు వెళ్లడం అలవాటు పడ్డారు. ఓ మూవీకి సోషల్ మీడియాలో నెగిటివ్ టాక్ వస్తే రెండో రోజే మూవీ ఢమాల్ అంటుంది. గాండీవధారి అర్జున విషయంలో అదే జరిగింది. గాండీవధారి అర్జున ఫస్ట్ షో నుండి నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. రేటింగ్ 2- 2.5 వరకూ ఇచ్చారు. కొందరు డిజాస్టర్ అంటూ కామెంట్స్ చేశారు.
ఇది వసూళ్ల మీద ప్రభావం చూపింది. గాండీవధారి అర్జున ఫస్ట్ డే కేవలం రూ. 1 కోటి వరల్డ్ వైడ్ షేర్ రాబట్టింది. ఇది వరుణ్ తేజ్ కెరీర్ లోయస్ట్ ఓపెనింగ్. ఆయన గత చిత్రం గని కూడా డిజాస్టర్. అయితే ఆ మూవీ రూ. 3 కోట్లకు పైగా ఫస్ట్ డే షేర్ వసూలు చేసింది. గాండీవధారి అర్జున 3 డేస్ షేర్ కోటిన్నర దాటలేదు. మూడో రోజు కేవలం రూ. 26 లక్షల వరల్డ్ వైడ్ షేర్ వచ్చినట్లు ట్రేడ్ వర్గాల సమాచారం.
చిత్ర ప్రమోషన్స్ విషయంలో యూనిట్ ఫెయిల్ అయ్యింది. గాండీవధారి అర్జున అనే మూవీ విడుదలవుతున్నట్లు మెగా ఫ్యాన్స్ కి కూడా తెలియదు. ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు కానీ స్టార్స్ ఎవరూ గెస్ట్స్ గా రాలేదు. పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, చిరంజీవి, అల్లు అర్జున్ లలో ఏ ఒక్క మెగా హీరో హాజరైనా కనీసం మంచి ఓపెనింగ్స్ దక్కేవి. ఇది కూడా సినిమాకు మైనస్ అయ్యింది. వెరసి వరుణ్ తేజ్ కి ఊహించని పరాజయం ఎదురైంది.
ఇక ఈ చిత్ర బడ్జెట్ రూ. 45 కోట్లని సమాచారం. కథ రీత్యా అధికభాగం లండన్ లో షూట్ చేశారు. అనుకున్న దాని కంటే ఎక్కువ బడ్జెట్ అయ్యిందని వరుణ్ తేజ్ స్వయంగా చెప్పారు. వీకెండ్ ముగిసినా గాండీవధారి అర్జున చిత్రానికి రెండు కోట్లు రాలేదు. ఓటీటీ, శాటిలైట్స్ హక్కులతో కొంత కవర్ అయినా… పెద్ద మొత్తంలో గాండీవధారి అర్జున నష్టాలు మిగల్చనుంది. చెప్పాలంటే గాండీవధారి అర్జున అంత చెత్త సినిమా ఏం కాదు. సోషల్ బర్నింగ్ టాపిక్ ని హాలీవుడ్ తరహా మేకింగ్ లో చెప్పే ప్రయత్నం జరిగింది. అది ఆడియన్స్ కి కనెక్ట్ కాలేదు. గాండీవధారి చిత్రానికి ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించారు.