Game Changer vs Pan Indian films : ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలైన రామ్ చరణ్(Global Star Ram Charan) ‘గేమ్ చేంజర్'(Game Changer Movie) చిత్రం ఎంత పెద్ద ఫ్లాప్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. రామ్ చరణ్ అభిమానులకు ఈ సినిమా ఒక పీడకల లాగా మిగిలిపోయింది. భారీ బడ్జెట్ విజువల్ ఎఫెక్ట్స్ ఉన్న సినిమాలు, డిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చే సినిమాలు రాజ్యం ఏలుతున్న ఈ రోజుల్లో ఒక మామూలు పొలిటికల్ థ్రిల్లర్ ని రామ్ చరణ్ ఎంచుకోవడమే పెద్ద తప్పు. టీజర్, ట్రైలర్ విడుదలైనప్పుడే ఇది పాత కాలం సినిమాలాగా ఉందని విమర్శలు వచ్చాయి. ఇక విడుదల తర్వాత అయితే ఆ విమర్శలు తారాస్థాయికి చేరాయి. ఇంతటి నాసిరకమైన సినిమాకు రామ్ చరణ్ మూడేళ్ళ విలువైన సమయాన్ని కేటాయించాడా అంటూ అభిమానులు సైతం వాపోయారు. అయితే డిజాస్టర్ టాక్ వచ్చినప్పటికీ కూడా ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతీయ భాషలకు కలిపి 200 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.
Also Read : బ్రాహ్మణులపై మంచు కుటుంబం పగబట్టేసిందా..? మరో వివాదంలో చిక్కుకున్న ‘కన్నప్ప’!
మొదటిరోజు ఈ చిత్రానికి వచ్చిన వసూళ్లు దాదాపుగా 90 కోట్ల రూపాయలకు పైగానే ఉంది. రామ్ చరణ్ పాన్ ఇండియన్ సూపర్ స్టార్ కాబట్టి, ఈ చిత్రం మొదటి రోజు వంద కోట్ల గ్రాస్ వసూళ్లను అందుకోలేదని పెద్ద ఎత్తున ట్రోల్స్ వేశారు దురాభిమానులు. ‘గేమ్ చేంజర్’ విడుదలకు ముందు, విడుదలకు తర్వాత ఎదురుకున్న ట్రోల్స్ ఈమధ్యకాలంలో ఏ స్టార్ హీరో సినిమా కూడా ఎదురుకోలేదు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అన్ని ట్రోల్స్ ఎదురుకున్న ఈ సినిమా ఓపెనింగ్ ని ఇప్పటి వరకు ఈ ఏడాది లో విడుదలైన పాన్ ఇండియన్ స్టార్ హీరోల సినిమాలు ఒక్కటి కూడా అందుకోలేకపోయింది అంటే అతిశయోక్తి కాదేమో. తమిళనాడు నుండి సూపర్ స్టార్స్ లో ఒకరిగా పిలవబడే అజిత్(Thala Ajith Kumar) నుండి ‘విడాముయార్చి’,’గుడ్ బ్యాడ్ అగ్లీ’ వంటి చిత్రాలు విడుదలయ్యాయి. విడాముయార్చి కి 46 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు రాగా, ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ కి 54 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.
ఈ రెండు సినిమాల మొదటిరోజు గ్రాస్ వసూళ్లను కలిపితే ‘గేమ్ చేంజర్’ మొదటిరోజు వసూళ్లతో సమానంగా ఉన్నది. ఇక గత నెలలో తమిళ హీరో సూర్య నటించిన ‘రెట్రో’ చిత్రం విడుదలైంది. ఈ సినిమాకు మొదటి రోజు కేవలం 40 కోట్ల గ్రాస్ మాత్రమే వచ్చింది. అదే విధంగా బాలీవుడ్ లో ఓపెనింగ్స్ కింగ్ గా పిలవబడే సల్మాన్ ఖాన్ ‘సికిందర్’ కి 48 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు రాగా, రీసెంట్ గా విడుదలైన కమల్ హాసన్ ‘థగ్ లైఫ్’ చిత్రానికి 38 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఇలా విడుదలైన ప్రతీ సినిమా ‘గేమ్ చేంజర్’ ఓపెనింగ్ ని కొట్టడం పక్కన పెడితే కనీసం అందులో సగం ఓపెనింగ్స్ ని కూడా దక్కించుకోలేదు. కనీసం ‘హరి హర వీరమల్లు’ అయినా ‘గేమ్ చేంజర్’ ని కొడుతుందో లేదో చూద్దాం.