https://oktelugu.com/

Game Changer: ఆశ్చర్యపరుస్తున్న ‘గేమ్ చేంజర్’ రన్ టైం..శంకర్ సినిమాకి ఇదే తొలిసారి..ఫలితం ఎలా ఉంటుందో!

ఏపీదితే 'గేమ్ చేంజర్' చిత్రం రన్ టైం ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. సాధారణంగా శంకర్ సినిమాల రన్ టైం కచ్చితంగా మూడు గంటలకు పైగానే ఉంటుంది. కానీ 'గేమ్ చేంజర్' చిత్రం రన్ టైం మాత్రం కేవలం 2 గంటల 42 నిమిషాలు మాత్రమేనట.

Written By:
  • Vicky
  • , Updated On : December 12, 2024 / 07:45 PM IST

    game changer

    Follow us on

    Game Changer: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన ‘గేమ్ చేంజర్’ చిత్రం మరో నెల రోజుల్లో తెలుగు, హిందీ, తమిళ భాషల్లో గ్రాండ్ గా విడుదల అవ్వబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్, పాటలకు ఫ్యాన్స్, ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. మరికొద్ది రోజుల్లోనే ఈ సినిమాకి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ ని విడుదల చేయబోతున్నారు. అదే విధంగా దేశవ్యాప్తంగా టూర్స్ ప్లాన్ చేసి, గ్రాండ్ గా ఈవెంట్స్ ని ఏర్పాటు చేయబోతున్నారు మేకర్స్. అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తి అయ్యాయట. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ లండన్ లో మొదలయ్యాయి. రేపటి నుండి నార్త్ అమెరికా, కెనడా వంటి ప్రాంతాల్లో గ్రాండ్ గా అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం కాబోతుంది. రెగల్ చైన్ థియేటర్స్ లో బుకింగ్స్ మొదలు పెట్టారు కానీ, ఆన్లైన్ లో టెక్నీకల్ సమస్యలు ఉండడం వల్ల ఆన్లైన్ సేల్స్ ప్రస్తుతానికి జరగడం లేదట.

    ఇదంతా పక్కన ఏపీదితే ‘గేమ్ చేంజర్’ చిత్రం రన్ టైం ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. సాధారణంగా శంకర్ సినిమాల రన్ టైం కచ్చితంగా మూడు గంటలకు పైగానే ఉంటుంది. కానీ ‘గేమ్ చేంజర్’ చిత్రం రన్ టైం మాత్రం కేవలం 2 గంటల 42 నిమిషాలు మాత్రమేనట. శంకర్ సినిమాకి ఇది చాలా తక్కువ రన్ టైం. ఇందులో పాటలకు 30 నిమిషాలు తీసేసిన, 2 గంటల 10 నిమిషాల పాటు సినిమా కథ ఉంటుంది. తక్కువ రన్ టైం ఉండడం వల్ల ఓవర్సీస్, హైదరాబాద్, బెంగళూరు వంటి ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో షోస్ వేసుకునే వెసులుబాటు ఉంటుంది. దాని వల్ల అత్యధిక గ్రాస్ వసూళ్లు వస్తాయి. అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రాన్ని ఇండియా వైడ్ గా జనవరి 10 వ తేదీన 12 వేలకు పైగా స్క్రీన్స్ లో విడుదల చేయబోతున్నారు.

    పాజిటివ్ టాక్ ఒక్కటే బ్యాలన్స్, మొదటి రోజు 200 కోట్ల రూపాయిల గ్రాస్ ని కొల్లగొట్టేందుకు రామ్ చరణ్ అభిమానులు కసిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకి లండన్ లో 6 వేలకు పైగా టిక్కెట్లు అమ్ముడుపోయాయి. నెల రోజుల ముందు ఈ రేంజ్ లో టికెట్స్ అమ్ముడుపోవడం అనేది సాధారణమైన విషయం కాదు. ఊపు చూస్తుంటే ప్రీమియర్స్+ మొదటి రోజు కి కలిపి ఈ సినిమాకి 60 వేలకు పైగా టిక్కెట్లు అమ్ముడుపోయే అవకాశాలు ఉన్నాయట. ఇక నార్త్ అమెరికా లో ఈ చిత్రానికి చాలా పెద్ద టార్గెట్స్ ఉన్నాయి. దేవర, కల్కి, సలార్, పుష్ప 2 వంటి చిత్రాలు కేవలం ప్రీమియర్ షోస్ నుండే మూడు మిలియన్ కి పైగా డాలర్లను రాబట్టాయి. ఈ చిత్రానికి అంత రేంజ్ ఉందా అనేది చూడాలి.