Game Changer: ఈ ఏడాది మన టాలీవుడ్ లో సంక్రాంతి కానుకగా విడుదలైన సినిమాల ఫలితాలు ఏమిటో మన అందరికీ తెలిసిందే. విక్టరీ వెంకటేష్(Victory Venkatesh) ‘సంక్రాంతికి వస్తున్నాం'(Sankranthiki Vastunnam) చిత్రం కమర్షియల్ గా సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అవ్వగా, రామ్ చరణ్(Global Star Ram Charan) ‘గేమ్ చేంజర్'(Game Changer) డిజాస్టర్ ఫ్లాప్ అయ్యింది. అదే విధంగా బాలయ్య(Nandamuri Balakrishna) ‘డాకు మహారాజ్'(Daaku Maharaj) చిత్రం యావరేజ్ రేంజ్ లో ఆడింది. ఈ మూడు సినిమాలు కూడా ఓటీటీ లో విడుదలయ్యాయి. ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రం జీ5 యాప్ లో విడుదల అవ్వగా, ‘గేమ్ చేంజర్’ చిత్రం అమెజాన్ ప్రైమ్ లో, ‘డాకు మహారాజ్’ చిత్రం నెట్ ఫ్లిక్స్ లో విడుదలైంది. ‘గేమ్ చేంజర్’ హిందీ వెర్షన్ ని ప్రత్యేకంగా జీ5 యాప్ లో మార్చి 7 న విడుదల చేసారు. ఈ సినిమా హిందీ వెర్షన్ కి ఊహించని రేంజ్ రెస్పాన్స్ రావడం విశేషం.
‘సంక్రాంతికి వస్తున్నాం’ మరియు ‘గేమ్ చేంజర్’ చిత్రాలు వారం గ్యాప్ లో జీ5 లో విడుదలయ్యాయి. అయితే ‘గేమ్ చేంజర్’ కి ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రం కంటే బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ ఓటీటీ లో రావడం అందరినీ షాక్ కి గురి చేసింది. వీకెండ్స్ లో ఇండియా వైడ్ గా ‘సంక్రాంతికి వస్తున్నాం’ టాప్ 10 లో ట్రెండ్ అవుతూ కనిపిస్తుంది కానీ, మామూలు వర్కింగ్ డేస్ లో మాత్రం టాప్ 10 ట్రెండింగ్ లో కనపడకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్న విషయం. కానీ ‘గేమ్ చేంజర్’ హిందీ వెర్షన్ మాత్రం ప్రతీ రోజు నాన్ స్టాప్ గా జీ5 యాప్ లో ట్రెండ్ అవుతూనే ఉంది. ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రం 5 భాషల్లో విడుదల అవ్వగా, ‘గేమ్ చేంజర్’ చిత్రం కేవలం ఒక్క హిందీ బాషలోనే విడుదలైంది. కేవలం ఒక్క బాషతోనే ఈ రేంజ్ రెస్పాన్స్ అంటే, ఇక అన్ని భాషల్లో విడుదల అయ్యుంటే ఏ రేంజ్ రెస్పాన్స్ ఉండేదో అని అంటున్నారు ట్రేడ్ పండితులు.
రామ్ చరణ్ కి మొదటి నుండి హిందీ లో మంచి క్రేజ్ ఉంది. ముఖ్యంగా #RRR చిత్రం లో ఆయన రాముడి గెటప్ కి నార్త్ ఇండియాలో అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అక్కడి ఆడియన్స్ కి రామ్ చరణ్ ని బాగా దగ్గర చేసింది. అందుకే ‘గేమ్ చేంజర్’ చిత్రానికి డిజాస్టర్ టాక్ వచ్చినా కూడా హిందీ లో 40 కోట్ల రూపాయలకు పైగా నెట్ వసూళ్లు వచ్చాయి. ఇది చిన్న విషయం కాదు. కేవలం థియేట్రికల్ వెర్షన్ తోనే కాదు, ఓటీటీ లో కూడా హిందీ వెర్షన్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. రామ్ చరణ్ అభిమానులకు ఇది కాస్త ఊరటని ఇచ్చే విషయం. ఈ సినిమా పోతే పోయింది కానీ, తదుపరి సినిమాలతో రామ్ చరణ్ పాన్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని ఏలుతాడని అభిమానులు బలమైన నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు.