https://oktelugu.com/

Game Changer Shailesh Kolanu: గేమ్ ఛేంజర్ మూవీకి శైలేష్ కొలను మెరుగులు… శంకర్ ఏం చేస్తున్నాడు? షాకింగ్ ట్విస్ట్

గతంలో శంకర్ తెరకెక్కించిన అవుట్ అండ్ అవుట్ పొలిటికల్ థ్రిల్లర్ ఒకే ఒక్కడు ఇండస్ట్రీని షేక్ చేసింది. నిర్మాత దిల్ రాజు ఖర్చుకు వెనుకాడకుండా గేమ్ ఛేంజర్ తెరకెక్కిస్తున్నాడు. సవ్యంగా సాగుతున్న గేమ్ ఛేంజర్ ప్రాజెక్ట్ ని భారతీయుడు 2 డిస్టర్బ్ చేసింది. వివాదాలతో ఆగిపోయిన భారతీయుడు 2 పట్టాలెక్కింది. దాంతో శంకర్ ఆ ప్రాజెక్ట్ పై దృష్టి పెట్టి గేమ్ ఛేంజర్ నిర్లక్ష్యం చేస్తున్నాడనే టాక్ ఉంది.

Written By:
  • Shiva
  • , Updated On : July 11, 2023 / 05:34 PM IST

    Game Changer Shailesh Kolanu

    Follow us on

    Game Changer Shailesh Kolanu: దేశం మెచ్చిన దర్శకుల్లో శంకర్ ఒకరు. చెప్పాలంటే ఇండియన్ సినిమాకు భారీతనం నేర్పిన మొదటి దర్శకుడు. రాజమౌళి కంటే ముందే హాలీవుడ్ రేంజ్ చిత్రాలు తెరకెక్కించాడు. ఒకప్పుడు ఆయనతో మూవీ చేసే ఛాన్స్ కోసం స్టార్ హీరోలు క్యూ కట్టారు. శంకర్ ఒకటి రెండు పరాజయాలతో నెమ్మదించినా ఆయన టాలెంట్ అసామాన్యమైంది. అందుకే శంకర్ తో రామ్ చరణ్ చేస్తున్న గేమ్ ఛేంజర్ మూవీపై అంచనాలు ఏర్పడ్డాయి. గేమ్ చేంజర్ పొలిటికల్ థ్రిల్లర్.

    గతంలో శంకర్ తెరకెక్కించిన అవుట్ అండ్ అవుట్ పొలిటికల్ థ్రిల్లర్ ఒకే ఒక్కడు ఇండస్ట్రీని షేక్ చేసింది. నిర్మాత దిల్ రాజు ఖర్చుకు వెనుకాడకుండా గేమ్ ఛేంజర్ తెరకెక్కిస్తున్నాడు. సవ్యంగా సాగుతున్న గేమ్ ఛేంజర్ ప్రాజెక్ట్ ని భారతీయుడు 2 డిస్టర్బ్ చేసింది. వివాదాలతో ఆగిపోయిన భారతీయుడు 2 పట్టాలెక్కింది. దాంతో శంకర్ ఆ ప్రాజెక్ట్ పై దృష్టి పెట్టి గేమ్ ఛేంజర్ నిర్లక్ష్యం చేస్తున్నాడనే టాక్ ఉంది.

    నిర్మాత దిల్ రాజు గేమ్ ఛేంజర్ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేసి క్యాష్ చేసుకోవాలని ప్లాన్ చేస్తున్నాడు. ఇక శంకర్ 2024 ఫిబ్రవరి వరకు భారతీయుడు 2 పనుల్లో బిజీగా ఉంటాడని తెలుస్తుంది. శంకర్ తన అసిస్టెంట్స్ తో గేమ్ ఛేంజర్ షూటింగ్ కంప్లీట్ చేస్తున్నారు. దిల్ రాజు, రామ్ చరణ్ శంకర్ మీద అసహనంగా ఉన్నారు. అయితే దాన్ని ప్రదర్శించడం లేదు.

    తాజాగా ఓ క్రేజీ గాసిప్ తెరపైకి వచ్చింది. సంక్రాంతికి గేమ్ ఛేంజర్ చిత్రాన్ని సిద్ధం చేయాలనే క్రమంలో దిల్ రాజు కొత్త ఆలోచన చేశాడట. శంకర్ అనుమతితో యంగ్ డైరెక్టర్ శైలేష్ కొలనుతో గేమ్ ఛేంజర్ యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించనున్నారట. ఇది టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా ఉంది. శంకర్ వంటి దర్శకుడు తన మూవీలో శైలేష్ లాంటి ఓ చిన్న దర్శకుడిని ఏలు పెట్టనిస్తాడా? . అలాగే అనుభవం లేని శైలేష్ గేమ్ ఛేంజర్ వంటి భారీ మూవీ యాక్షన్ సన్నివేశాలకు న్యాయం చేయగలడా అనే సందేహం కలుగుతుంది. దీనిపై ఎలాంటి అధికారిక సమాచారం లేదు. కానీ ప్రముఖంగా వినిపిస్తోంది.