Game Changer Collection: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘గేమ్ చేంజర్’ చిత్రానికి హిందీ లో అద్భుతమైన వసూళ్లు వస్తున్నాయి. ఊపు చూస్తుంటే ఈ చిత్రం కచ్చితంగా బాలీవుడ్ లో మరో పుష్ప అయ్యేలా అనిపిస్తుంది. ఓవర్సీస్ లో కూడా అనేక ప్రాంతాల్లో వసూళ్లు పుంజుకుంటున్నాయి. ముఖ్యంగా నార్త్ అమెరికా లో ఈ చిత్రానికి మొదటి 30 వేల డాలర్లు వచ్చాయి. శనివారం రోజు ఇంకా ఎక్కువ గ్రాస్ వసూళ్లు వచ్చే అవకాశాలు ఉన్నాయట. హిందీ ఆడియన్స్ ఒక సినిమాకి కనెక్ట్ అయితే దానిని బాక్స్ ఆఫీస్ పరంగా ఏ రేంజ్ కి తీసుకొని వెళ్లగలరో ఉదాహరణ పుష్ప చిత్రం. నార్త్ ఇండియా లో కేవలం రెండు కోట్ల రూపాయిల ఓపెనింగ్ వసూళ్లతో మొదలైన ఈ చిత్రం,, ఏకంగా 120 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లను రాబట్టే రేంజ్ కి వెళ్ళింది. ఇక పార్ట్ 2 అయితే చెప్పక్కర్లేదు.
ఏకంగా బాలీవుడ్ లో ఇండస్ట్రీ హిట్ గా నిలిచి, ఇప్పటికీ డీసెంట్ స్థాయి వసూళ్లతో కొనసాగుతుంది. ‘గేమ్ చేంజర్’ కూడా అలాంటి మ్యాజిక్ క్రియేట్ చేయబోతుందా అంటే అవుననే అంటున్నారు ట్రేడ్ పండితులు. రెండవ రోజు ఢిల్లీ , ముంబై , కోల్ కత్తా, అహ్మదాబాద్, పూణే ఇలా అనేక ప్రాంతాల్లో ఈ చిత్రానికి అడ్వాన్స్ బుకింగ్స్ ని చూసి ట్రేడ్ పండితులు మెంటలెక్కిపోతున్నారు. ఇంతటి నెగటివ్ టాక్ తో ఈ చిత్రం ఆ ప్రాంతాల్లో ఎలా ఆడుతుంది?, ఆడియన్స్ దీనిని ఎలా ఆదరిస్తున్నారు అంటూ విశ్లేషకులు కూడా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. గతం లో ఇలాంటి పరిస్థితే ప్రభాస్ ‘సాహూ’ చిత్రానికి వచ్చింది. బాహుబలి సిరీస్ తర్వాత భారీ అంచనాలతో విడుదలైన ఈ చిత్రం ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నప్పటికీ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద దుమ్ము లేపే వసూళ్లను రాబట్టింది. సుమారుగా 200 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లు వచ్చాయి.
ఈ రేంజ్ లో కాకపోయినా ‘గేమ్ చేంజర్’ చిత్తానికి ఫుల్ రన్ లో 100 కోట్ల రూపాయలకు పైగా నెట్ వసూళ్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. నార్త్ ఇండియా లో కేవలం మల్టీ ప్లెక్స్ థియేటర్స్ లోనే కాదు, సింగల్ స్క్రీన్ థియేటర్స్ లో కూడా ఈ చిత్రం రఫ్ఫాడించేస్తుంది. తెలుగు వెర్షన్ వసూళ్లు పండగ తర్వాత తగ్గినప్పటికీ, హిందీ వసూళ్లు బ్యాలన్స్ చేసేలా ఉన్నాయి. ఓవరాల్ గా రేటింగ్స్ డిజాస్టర్ రేంజ్ లో వచ్చినప్పటికీ, దిల్ రాజు భారీ నష్టాలను చూడకుండా ఎబోవ్ యావరేజ్ రేంజ్ ఫలితాన్ని దక్కించుకునే అవకాశం ఉంది. తెలుగు వెర్షన్ లో ఈ సినిమా ఫుల్ రన్ రేంజ్ ఎలా ఉండబోతుంది అనేది సంక్రాంతికి విడుదల అవ్వబోతున్న సినిమాలను చూసి ఒక అంచనాకి రావొచ్చు. ప్రస్తుతం బుక్ మై షో యాప్ లో ఈ సినిమాకి గంటకు 20 వేలకు పైగా టికెట్స్ అమ్ముడుపోతున్నాయి.