Dil Raju: ఈ సంక్రాంతికి దిల్ రాజు అదృష్టం మామూలుది కాదు అని చెప్పొచ్చు. ఒక తెలివైన నిర్ణయం మనుషులను తీవ్రమైన సమస్యల నుండి ఎలా బయటపడేస్తుంది అనడానికి దిల్ రాజు ఈ సంక్రాంతికి తీసుకున్న నిర్ణయాన్ని ఉదాహరణగా చూపించొచ్చు. ఆయన తన కెరీర్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని, తన 50 వ చిత్రంగా ‘గేమ్ చేంజర్’ కి సుమారుగా 400 కోట్ల రూపాయిల బడ్జెట్ ని ఖర్చు చేశాడు. దురదృష్టం కొద్దీ ఆ సినిమా ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ అయ్యింది. మొదటి ఆట నుండే ఫ్లాప్ టాక్ ని కొనితెచ్చుకుంది. అయితే దిల్ రాజు ఒక సినిమా ఫలితాన్ని అంచనా వేయడం వెన్నతో పెట్టిన విద్య. ‘గేమ్ చేంజర్’ మూవీ ఫైనల్ ఔట్పుట్ చూసిన తర్వాత, ఎందుకో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద వర్కౌట్ అవ్వదేమో అని ఆయనకీ అనిపించి ఉండొచ్చు. అందుకే ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రాన్ని కూడా విడుదల చేస్తున్నట్టు గత ఏడాది అధికారిక ప్రకటన చేసాడు.
రెండు సినిమాలు నాలుగు రోజుల గ్యాప్ లో విడుదలయ్యాయి. దిల్ రాజు ప్రతీ ప్రాంతంలోనూ బయ్యర్స్ కి రెండు సినిమాలను కాంబినేషన్ గా అమ్మాడు. దీంతో ‘గేమ్ చేంజర్’ కి నష్టపోయిన బయ్యర్లు, ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రంతో భారీ లాభాలను అందుకున్నాడు. నిర్మాత దిల్ రాజు సేఫ్, బయ్యర్స్ డబుల్ సేఫ్. దాదాపుగా 300 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను ఇప్పటి వరకు రాబట్టిన ఈ సినిమా, ఫుల్ రన్ లో ఇంకా ఎక్కువ వసూళ్లను రాబట్టే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు ట్రేడ్ పండితులు. ఇలా తమకు భారీ లాభాలు వచ్చేలా చేసిన దిల్ రాజు కి మరియు టీం కి కృతఙ్ఞతలు తెలియచేస్తూ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న బయ్యర్స్ సక్సెస్ పార్టీ రేపు ఇవ్వబోతున్నట్టు సమాచారం. ఇప్పటి వరకు నిర్మాతలు సక్సెస్ పార్టీలు ఇవ్వడమే కానీ, బయ్యర్లు నిర్మాతకు సక్సెస్ పార్టీని ఇవ్వడం ఇప్పుడే చూస్తున్నాం.
తెలుగు సినిమా చరిత్రలో ఇది మొట్టమొదటిసారి జరిగిన పరిణామం గా తీసుకోవచ్చు. ఇప్పటికీ కూడా ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రానికి బుక్ మై షో యాప్ లో గంటకు రెండు వేలకు పైగా టికెట్స్ అమ్ముడుపోతున్నాయి. రేపు, ఎల్లుండి మరోసారి ఈ చిత్రం పవర్ ప్లే బ్యాటింగ్ చేసే అవకాశం ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు ఈ చిత్రానికి 130 రూపాయిల వరకు షేర్ వసూళ్లు వచ్చాయి. ఈ వీకెండ్ లో మరో 10 కోట్ల రూపాయిల షేర్ అదనంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. నాల్గవ వారం లో శివ రాత్రి ఉండడంతో ఆరోజు కూడా దుమ్ము లేచిపోయే వసూళ్లు వస్తాయని ట్రేడ్ విశ్లేషకుల అంచనా. ఓవరాల్ గా ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకి క్లోజింగ్ లో 160 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి.