Gamanam Movie: విడుదలకు సిద్దమైన “గమనం” సినిమా… రిలీజ్ డేట్ ఎప్పుడంటే ?

Gamanam Movie: కరోన కారణంగా విడుదల వాయిదా పడ్డ సినిమాలు చాలానే ఉన్నాయి. ప్రస్తుతం పరిస్థితులు మెరుగుపడటంతో ఈ ఏడాది ఒకరి తర్వాత ఒకరు వరుసగా సినిమాలను విడుదల చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఈ మేరకు కొవిడ్‌ లాక్‌డౌన్‌ కారణంగా విడుదల వాయిదా పడిన చిత్రాల్లో ‘గమనం’ కూడా  ఒకటి. త్వరలోనే ప్రేక్షకుల ముందుకురానుంది. పలు ఉపకథల సమ్మేళనంగా సుజనా రావు దర్శకత్వంలో ఈ సినిమాని  తెరకెక్కించారు. కాగా రమేష్‌ కరుటూరి, వెంకీ పుషదపు, జ్ఞానశేఖర్‌ వి.ఎస్‌ […]

Written By: Raghava Rao Gara, Updated On : November 21, 2021 7:58 pm
Follow us on

Gamanam Movie: కరోన కారణంగా విడుదల వాయిదా పడ్డ సినిమాలు చాలానే ఉన్నాయి. ప్రస్తుతం పరిస్థితులు మెరుగుపడటంతో ఈ ఏడాది ఒకరి తర్వాత ఒకరు వరుసగా సినిమాలను విడుదల చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఈ మేరకు కొవిడ్‌ లాక్‌డౌన్‌ కారణంగా విడుదల వాయిదా పడిన చిత్రాల్లో ‘గమనం’ కూడా  ఒకటి. త్వరలోనే ప్రేక్షకుల ముందుకురానుంది. పలు ఉపకథల సమ్మేళనంగా సుజనా రావు దర్శకత్వంలో ఈ సినిమాని  తెరకెక్కించారు. కాగా రమేష్‌ కరుటూరి, వెంకీ పుషదపు, జ్ఞానశేఖర్‌ వి.ఎస్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు.

ఈ సినిమాకు ఇళయరాజా స్వరాలందించడం మరో ప్రత్యేక విషయం అని చెప్పాలి. ఈ సినిమాలో శ్రియ, ప్రియాంక జవాల్కర్‌, శివ కందుకూరి, నిత్యామేనన్‌ ప్రధాన పాత్రలు పోషించారు. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ అప్డేట్ ను చిత్ర బృందం ప్రకటించింది. సోషల్ మీడియా వేదికగా ఈ మూవీ విడుదల తేదీని ఖరారు చేస్తూ చిత్ర బృందం ఓ పోస్టర్‌ని విడుదల చేసింది. డిసెంబరు 10వ తేదీన తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, ట్రైలర్‌కు విశేష స్పందన లభించింది. ఓ చెవిటి ఇల్లాలు.. ఓ యువజంట ప్రేమకథ.. మ‌రో అనాథ‌ల ప్రయాణమే ‘గమనం’ మూవీ అని చెప్పొచ్చు.  గృహిణి పాత్రలో శ్రియ తనదైన శైలిలో అద్భుతంగా నటించింది. కట్టుకున్న భ‌ర్త దుబాయ్ వెళ్లిపోతే అత‌ని రాక‌కోసం ఆమె ఎదురు చూస్తూ ఉంటుంది. తనకు విన్పించకపోయినా దేవుడిని మాత్రం నిత్యం పూజిస్తుంటుంది.