Gajini 2 Movie: ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ హిస్టరీ లో సువర్ణాక్షరాలతో లిఖిందగ్గ చారిత్రాత్మక విజయం సాధించిన చిత్రం ‘గజినీ'(Ghajini Movie). సూర్య(Suriya Sivakumar), AR మురుగదాస్(AR Murugadoss) కాంబినేషన్ లో 2005 వ సంవత్సరం లో విడుదలైన ఈ చిత్రం తమిళనాట ఒక ప్రభంజనం సృష్టించింది. ఈ సినిమాతోనే సూర్య స్టార్ హీరోగా మారిపోయాడు. తమిళం లో సూపర్ హిట్ అయ్యాక, నిర్మాత అల్లు అరవింద్(Allu Aravind) ఈ చిత్రాన్ని తెలుగు లో డబ్ చేయగా, ఇక్కడ కూడా భారీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఈ సినిమాతోనే తెలుగు లో సూర్య కి తిరుగులేని ఫ్యాన్ బేస్, మార్కెట్ ఏర్పడింది. ఇదే చిత్రాన్ని అల్లు అరవింద్ హిందీ లో అమీర్ ఖాన్(Amir Khan) తో రీమేక్ చేశాడు. అక్కడ ఆరోజుల్లో ఈ చిత్రం ఒక సునామి అనే చెప్పాలి. కేవలం బాలీవుడ్ లో మాత్రమే కాదు, ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ హిస్టరీ లో మొట్టమొదటి వంద కోట్ల సినిమా ఇదే.
అల్లు అరవింద్ కి భవిష్యత్తులో మగధీర లాంటి సినిమాని తీయగలను అనే ధైర్యాన్ని ఇచ్చిన చిత్రమిదే. అలాంటి చరిత్ర సృష్టించిన ఈ సినిమాకు సీక్వెల్ రాలేదే అని అభిమానులు ఎంతో కాలం నుండి ఎదురు చూస్తున్నారు. అయితే మురుగదాస్ ఈ సినిమాకి సీక్వెల్ తియ్యాలి అనే ప్లాన్ లో ఎప్పటి నుండో ఉన్నాడట. కానీ హీరో సూర్య అనుకుంటే మాత్రం పొరపాటే. ఆయన ఈ సీక్వెల్ ని చేయాలని అనుకుంటుంది అమీర్ ఖాన్ తో. సూర్య కంటే అమీర్ ఖాన్ మార్కెట్ చాలా పెద్దది. పైగా సీక్వెల్స్ కి బాలీవుడ్ లో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. చిన్న హీరోలు కూడా సీక్వెల్స్ చేసి ఇండస్ట్రీ ని షేక్ చేసేస్తున్నారు. అందుకే మురుగదాస్ ఈ సీక్వెల్ ని అమీర్ ఖాన్ తో మాత్రమే చేయాలనే ఆలోచనలో ఉన్నాడట.
ఇటీవలే అమీర్ ఖాన్ ని కలిసి ఆయన స్టోరీ కూడా వినిపించినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం మురుగదాస్ సల్మాన్ ఖాన్ తో ‘సికిందర్’ అనే చిత్రం చేశాడు. ఈ సినిమా ఈ నెల 30వ తారీఖున విడుదల కాబోతుంది. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన టీజర్, పాటలకు పర్వాలేదు అనే రేంజ్ రెస్పాన్స్ వచ్చింది. ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ఆశించిన స్థాయిలో లేదు. సినిమా కి కావాల్సినంత హైప్ అయితే క్రియేట్ అవ్వలేదు. కేవలం సల్మాన్ ఖాన్ పేరు మీదనే బిజినెస్ జరుగుతుంది. కాబట్టి ఈ చిత్రం కమర్షియల్ హిట్ అవ్వాలంటే కచ్చితంగా సూపర్ హిట్ టాక్ రావడం అవసరం. సల్మాన్ ఖాన్ కి కరోనా లాక్ డౌన్ తర్వాత ఒక్క కమర్షియల్ హిట్ కూడా తగలడం లేదు. భారీ అంచనాల నడుమ విడుదలైన ‘టైగర్ 3’ కూడా యావరేజ్ రేంజ్ లోనే ఆడింది. అభిమానులు ఆయన నుండి భారీ బ్లాక్ బస్టర్ ని కోరుకుంటున్నారు,మరి ఆ బ్లాక్ బస్టర్ వస్తుందా లేదా అనేది మరికొద్ది రోజుల్లో తేలనుంది.