Gadar 2 Box Office Collections: సన్నీ డియోల్-అమీషా పటేల్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ గదర్ 2 ఏకంగా బాహుబలి 2 రికార్డు పై కన్నేసింది. సెకండ్ హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచే సూచనలు కనిపిస్తున్నాయి. అందుకు కేవలం ఒక్క అడుగుదూరంలో నిలిచింది. షారుక్ ఖాన్ గత చిత్రం పఠాన్ రూ. 543 కోట్లతో ఇండియాలో ఆల్ టైం హిందీ హైయెస్ట్ గ్రాసర్ గా ఉంది. బాహుబలి 2 రూ. 511 కోట్లతో రెండో స్థానంలో ఉంది. బాహుబలి 2ని వెనక్కి నెట్టి రెండో స్థానంలో గదర్ 2 నిలవనుంది. అయితే అందుకు ఒక కోటి రూపాయల దూరంలో ఉంది.
దాదాపు నాలుగు వారాలు గదర్ 2 బాక్సాఫీస్ రన్ కొనసాగింది. ఫస్ట్ వీక్ రూ. 284.63, సెకండ్ వీక్ రూ. 134.47 కోట్లు, మూడవ వారం రూ. 63.35 కోట్ల వసూళ్లు రాబట్టింది. అత్యంత వేగంగా రూ. 500 కోట్ల క్లబ్ లో చేరిన చిత్రంగా గదర్ నిలిచింది. జవాన్ విడుదలతో గదర్ వసూళ్లు భారీగా పడిపోయాయి. శుక్రవారం గదర్ 2 కేవలం కోటి రూపాయల వసూళ్లు అందుకుంది. దీంతో టోటల్ కలెక్షన్స్ రూ. 510 కోట్లని సమాచారం. బాహుబలి 2 ని బీట్ చేయడానికి మరొక కోటి రూపాయలు వస్తే సరిపోతుంది.
కాబట్టి గదర్ 2 బాహుబలి 2 చిత్రాన్ని అధిగమించి ఆల్ టైం సెకండ్ హైయెస్ట్ గ్రాసర్ గా పఠాన్ తర్వాత స్థానంలో ఉంటుంది. గదర్ 2 బ్లాక్ బస్టర్ నేపథ్యంలో ముంబై వేదికగా యూనిట్ పార్టీ ఏర్పాటు చేశారు. షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్, జాకీష్రాఫ్, సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీ, టబు, శిల్పా శెట్టితో పాటు పలువురు బాలీవుడ్ సెలెబ్స్ హాజరయ్యారు.
గదర్ 2 చిత్రానికి అనిల్ శర్మ దర్శకుడు. 2001లో విడుదలైన గదర్ చిత్రానికి ఇది సీక్వెల్. గదర్ చిత్రానికి పని చేసిన అనిల్ శర్మ, సన్నీ డియోల్, అమీషా పటేల్ కాంబో తిరిగి రిపీట్ అయ్యింది. తారా సింగ్ పాత్రలో సన్నీ డియోల్ మరోసారి మెస్మరైజ్ చేశారు. తారా సింగ్ పాత్ర సన్నీ డియోల్ తప్ప హిందీ పరిశ్రమలో ఎవరూ చేయలేరు. సౌత్ స్టార్ ఎన్టీఆర్ మాత్రమే చేయగలడు అని చెప్పడం విశేషం.