Gabbar Singh Re Release Record: గత నాలుగేళ్ళ నుండి మన టాలీవుడ్ లో సూపర్ హిట్స్ గా నిల్చిన చిత్రాలను రీ రిలీజ్ చేయడం ఆనవాయితిగా వస్తోంది. కచ్చితంగా థియేట్రికల్ అనుభూతిని అందించే సినిమాలకు జనాలు క్యూలు కట్టేస్తున్నారు. సాధారణంగా మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీస్ , లేదంటే అద్భుతమైన పాటలు ఉన్నటువంటి సినిమాలకు రీ రిలీజ్ లో భారీ వసూళ్లు వస్తుంటాయి. కమర్షియల్ సినిమాలకు పెద్దగా వర్కౌట్ అవ్వడం లేదు. అలాంటిది 2012 వ సంవత్సరం లో విడుదలైన ‘గబ్బర్ సింగ్’ చిత్రాన్ని , 2024 లో పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా రీ రిలీజ్ చేసి, మొదటి రోజే ఏకంగా 8 కోట్ల గ్రాస్ వసూళ్లను కొల్లగొట్టడం ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లోనే ఒక హిస్టరీ గా నిల్చింది. పైగా అది కూడా సోమవారం లాంటి వర్కింగ్ డే లో, ‘సరిపోదా శనివారం’ వంటి బ్లాక్ బస్టర్ కొత్త సినిమాని ఎదురుగా పెట్టుకొని సాధించిన వసూళ్లు ఇవి.
వీటికి తోడు ఈ సినిమా విడుదలైన రోజు వర్షాలు కూడా ఉన్నాయి. ఇన్ని అడ్డంకులను ఎదుర్కొని , ఈ చిత్రం ఈ స్థాయిలో వసూళ్లు రాబట్టడం అనేది అసాధారణమైన విషయం. చాలా చిత్రాలు ఈ సినిమా మొదటి రోజు రికార్డుని బద్దలు కొట్టడానికి గట్టి ప్రయత్నాలు చేశాయి. కానీ ఒక్క సినిమా కూడా టార్గెట్ ని చేరుకోలేకపోయాయి. ఆంధ్ర ప్రదేశ్ లో బాహుబలి రీ రిలీజ్ కూడా ‘గబ్బర్ సింగ్’ గ్రాస్ ని అందుకోలేకపోయిందంటే , పవన్ కళ్యాణ్ స్టార్ స్టేటస్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఇక రీసెంట్ గా విడుదలైన ‘రేసు గుర్రం’ చిత్రం కచ్చితంగా ‘గబ్బర్ సింగ్’ మొదటి రోజు రికార్డు ని కొడుతుందని అనుకున్నారు. కానీ మొదటి రోజు కనీసం 2 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను కూడా ఈ చిత్రం రాబట్టలేకపోయింది. టీం మాత్రం కామెడీ గా 3 కోట్ల 33 లక్షల రూపాయిల గ్రాస్ వచ్చిందని పోస్టర్ ని విడుదల చేశారు. దీని పై సోషల్ మీడియా లో ఇప్పుడు వస్తున్న ట్రోల్స్ మామూలు రేంజ్ లో లేవు.
ఇది కాసేపు పక్కన పెడితే , ఇప్పుడు ఈ గబ్బర్ సింగ్ మొదటి రోజు రికార్డుని బద్దలు కొట్టేది ఎవరు..?, మళ్లీ పవన్ కళ్యాణ్ అభిమానులకే ఇది సాధ్యం అవుతుందా ?, లేకపోతే వేరే ఏ హీరో అయినా కొట్టగలడా అనే చర్చలు నడుస్తున్నాయి. ఈ నెల 23 న ప్రభాస్ కెరీర్ లో కల్ట్ క్లాసిక్ గా నిల్చిన ‘డార్లింగ్’ చిత్రం రీ రిలీజ్ అవ్వబోతుంది. ఈ సినిమాకు యూత్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఉంది. భారీ రిలీజ్ కూడా ఇవ్వబోతున్నారు. ఈ నెల 18 వ తారీఖు నుండి అడ్వాన్స్ బుకింగ్స్ కూడా మొదలు కాబోతున్నాయి. ఈ చిత్రానికి కచ్చితంగా ‘గబ్బర్ సింగ్’ మొదటి రోజు వసూళ్లను కొల్లగొట్టేంత సత్తా ఉందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. మరి ఆ రేంజ్ కి వెళ్తుందా లేదా అనేది చూడాలి.