https://oktelugu.com/

Historical Films : స్వాతంత్య్రం.. అణిచివేత.. చరిత్ర తవ్వుతున్న రెండు చిత్రాల కథ

ఈ నేపథ్యంలో చారిత్రాత్మక చిత్రాలను పెద్ద పెద్ద నిర్మాణ సంస్థలు తెరకెక్కిస్తున్నాయి. ఇక ఈకోవలోకి మరికొన్ని చిత్రాలు రాబోతున్నాయి. వాటిలో ప్రముఖమైనవి 'బాఘా జతిన్, ఎమర్జెన్సీ'.

Written By:
  • Rocky
  • , Updated On : June 25, 2023 / 12:35 PM IST
    Follow us on

    Historical Films : దేశంలో ఇప్పుడు చారిత్రాత్మక సినిమాల హవా నడుస్తోంది. దక్షిణాది, ఉత్తరాది అని కాకుండా దర్శకులు చరిత్రను తవ్వి తీసే పనిలో పడ్డారు. ఇందులో వివాదాస్పద అంశాల ఆధారంగా కథలను రాసుకుంటూ ప్రేక్షకులను రంజింప చేస్తున్నారు. అయితే ఇప్పటివరకు ఇండియన్ సినిమా చరిత్రలో బయోపిక్ లేదా చారిత్రాత్మక చిత్రాలు ఎక్కువ శాతం విజయాలు అందుకున్నాయి. విజయాలు మాత్రమే కాదు సరికొత్త చరిత్రను సృష్టించాయి. ఈ నేపథ్యంలో చారిత్రాత్మక చిత్రాలను పెద్ద పెద్ద నిర్మాణ సంస్థలు తెరకెక్కిస్తున్నాయి. ఇక ఈకోవలోకి మరికొన్ని చిత్రాలు రాబోతున్నాయి. వాటిలో ప్రముఖమైనవి ‘బాఘా జతిన్, ఎమర్జెన్సీ’. ఇప్పుడు ఈ రెండు చిత్రాలు యావత్ భారత సినీ ప్రపంచాన్ని ఆసక్తిగా ఎదురుచూసేలా చేస్తున్నాయి.
    బాఘా జతిన్
    గొప్ప స్వాతంత్ర ఉద్యమకారుడుగా చరిత్రలో నిలిచిపోయిన బెంగాలీ పోరాటయోధుడు జతీంద్రద్రనాథ్ ముఖర్జీ బయోపిక్ ఆధారంగా ‘ బాఘా జతిన్’ అనే సినిమా రూపొందుతోంది. జతీంద్రద్రనాథ్ గా దేవ్ అధికారి నటిస్తున్నారు. జతీంద్రద్రనాథ్ ఇంటి పేరు బాఘా.. అందుకే ఈ సినిమా పేరు బాఘా జతిన్ అని పెట్టారు.”దౌర్జన్యం ప్రబరుతున్నప్పుడు విధ్వంసం దగ్గర దూరంలో ఉంటుంది. ఇటువంటి దురాఘతాలను దూరం చేసేందుకు ఒక వీర రక్షకుడు కావాలి. భారతదేశపు పుత్రుడు బాఘా జతిన్ కథను మొదటిసారిగా వెండితెరపై చూపించబోతున్నాం’ అంటూ ఈ చిత్ర నిర్మాణ సంస్థ తెలిపింది. భాఘా జతిన్ సినిమాలో టైటిల్ రోల్ లో నటిస్తున్న బెంగాల్ నటుడు దేవ్ అధికారి తాజా రూపాన్ని విడుదల చేసింది. భారత దేశ స్వాతంత్రం కోసం పోరాడిన ఉద్యమకారుడు బాఘా జతిన్ బయోపిక్ గా అరుణ్ రాయ్ దర్శకత్వంలో బెంగాలీ, ఈ భాషల్లో ఈ చిత్రం రూపొందుతోంది. బాఘా జతిన్ గా నటిస్తున్న దేవ్ అధికారి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 1879 డిసెంబర్ 7న జన్మించిన జతీంద్రనాథ్ ముఖర్జీ 1915 సెప్టెంబర్ 10న మరణించారు. తుపాకి కాల్పులకు గురై, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన వీరమరణం పొందారు. కాగా, జతీంద్రనాథ్ కు బాఘా జతిన్ అనే పేరు వచ్చేందుకు కారణం ఆయన ఎలాంటి మారణాయుధాలు లేకుండా ఒట్టి చేతులతో పోలిని చంపడం. బాఘా అంటే బెంగాలీ భాషలో పులి అని అర్థం. 1906లో పులిని చంపేసిన తర్వాత జతేంద్రనాథ్ పేరు ‘బాఘా జతిన్’ గా మారింది. స్వాతంత్రం కోసం జతిన్ చేసిన వీర పోరాటాలతో పాటు ఇంకా పలు విశేషాలతో ‘బాఘా జతిన్’ అనే సినిమా తెరకెక్కింది. ‘నవరాత్రి సందర్భంగా దేవ్ ఎంటర్టైన్మెంట్స్ నుంచి అక్టోబర్ 20న బాఘా జతిన్ సినిమా థియేటర్లలో ప్రదర్శితమవుతుందని’  చిత్ర యూనిట్ తెలిపింది.
    ఎమర్జెన్సీ
    ఈ దేశంలో ఉక్కు మహిళగా పేరొందిన ఇందిరాగాంధీ హయాంలో విధించిన ఎమర్జెన్సీ ఒక చీకటి అధ్యాయం. ఇప్పటివరకు దీని గురించి రకరకాల కథనాలు వ్యాప్తిలో ఉన్నాయి. ఆ రోజుల్లో ఆ పరిస్థితులను అనుభవించిన వారు ఒక్కొక్కరు ఒక్కొక్క తీరుగా తమ అనుభవాలను చెప్పారు. అయితే ఇప్పటికీ మెజారిటీ ప్రజలు నాటి ఎమర్జెన్సీని చీకటి రోజులుగా అభివర్ణిస్తారు. నాటి ఎమర్జెన్సీ రోజులను ప్రస్తావిస్తూ కంగనా రనౌత్ ప్రధానపాత్రలో ‘ఎమర్జెన్సీ’ అనే సినిమా రూ పొందుతోంది..”దేశాన్ని కాపాడాల్సిన బాధ్యత నా చేతుల్లో ఉంది. ఎందుకంటే భారత్ అంటే ఇందిరా.. ఇందిరా అంటే భారత్’ అనే డైలాగ్ తో ‘ఎమర్జెన్సీ’ చిత్రం టీజర్ విడుదలైంది. ఇంకా ఈ టీజర్ లో ప్రతిపక్ష నాయకులను పోలీసులు అరెస్టు చేయడం, ప్రసారాలు నిలిపివేయడం, ఆందోళనకారులపై దాడులు చేస్తున్న సంఘటనలను చూపించారు. 1975 జూన్ 25వ తేదీతో ఈ సినిమా టీజర్ ప్రారంభమవుతుంది..”రక్షకురాల లేకుండా కరుడుగట్టిన నియంతా? మనదేశ నేత తన ప్రజలపై యుద్ధం ప్రకటించిన చీకటి రోజులకు సాక్షిగా చరిత్రలో నిలిచిన ఘట్టం ఇది’ అంటూ కంగనా రనౌత్ ఈ సినిమా టీజర్ ను తన సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు. ప్రధానమంత్రిగా ఇందిరా గాంధీ ఉన్నప్పుడు (1975_1977) ఎందుకు ఎమర్జెన్సీ విధించారు? అనే కథా నేపథ్యంతో ఈ సినిమాను రూపొందించారు. కంగనా ఇందిరాగాంధీ రూపంలో ఒదిగిపోయారు. ఈ చిత్రానికి ఆమె దర్శకురాలు, నిర్మాత కూడా. నవంబర్ 24న ఈ సినిమాను విడుదల చేస్తున్నట్టు ఆమె ప్రకటించారు. సినిమా టీజర్ లో పలు వివాదాస్పద అంశాలను ప్రస్తావించడంతో ఒకింత ఆసక్తికరంగా ఉంది. మరో ఏడాదిలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ సినిమాల ప్రభావం దేశ రాజకీయాల మీద ఎంతో కొంత ఉంటాయని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.