Nara Rohit: టాలీవుడ్ లో ఆల్ రౌండర్ అనిపించుకొన్న హీరో నారా రోహిత్ మళ్లీ యాక్టివ్ కాబోతున్నాడు. రోహిత్ సినిమాల ఎంపిక భిన్నంగా ఉంటుంది. అయితే, వరుస ప్లాప్ ల తర్వాత నారా రోహిత్ గ్యాప్ తీసుకున్నాడు. ఇన్నాళ్లకు మళ్లీ హీరోగా సినిమా చేయబోతున్నాడు. నారా రోహిత్ మాస్ కథలకు సరిగ్గా సరిపోతాడు. కానీ కొన్నేళ్లుగా రోహిత్ కి నుంచి కథలు రావడం లేదు.

ఈ క్రమంలోనే నారా రోహిత్ కి సినిమాలపై ఆసక్తి తగ్గిందన్న కామెంట్లు వినిపించాయి. ఆ మధ్య కొన్ని ప్రాజెక్టులు ప్రకటించినా – అవి సెట్స్ పైకి వెళ్లలేదు. ఒకటి రెండు వెళ్లినా పూర్తి కాలేదు. పైగా నారా రోహిత్ మీడియాకి కనిపించే చాలా కాలమైంది. అయితే, ఎట్టకేలకు నారా రోహిత్ మళ్లీ రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడని తెలుస్తోంది.
Also Read: Pakka Commercial : గోపీచంద్ ‘పక్కా కమర్షియల్’ ట్విట్టర్ రివ్యూ.. మూవీ టాక్ ఎలా ఉందంటే?
‘అర్జున్ మాధవ్’ అనే ఓ కథకు నారా రోహిత్ తాజాగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ ప్రాజెక్టు త్వరలోనే పట్టాలెక్కబోతుంది. కానీ.. ఇక్కడ ఒక సమస్య ఉంది. లాక్ డౌన్ కి ముందే నారా రోహిత్ బాగా లావైపోయాడు. కొన్ని నెలలుగా తన బరువు తగ్గించుకొనే పనిలో తలమునకలైనా, ఆశించిన స్థాయిలో రోహిత్ లుక్ మారలేదు. రోహిత్ ఇంకా లావుగానే ఉన్నాడని టాక్ నడుస్తోంది. రీ ఎంట్రీ కోసం ఎంత కష్టపడినా హీరో లుక్, లక్ మాత్రం మారడం లేదు.

మరో మూడు నెలల్లో తన కెరీర్ బిగినింగ్ లో తాను ఏ లుక్ లో అయితే ఉన్నాడో, మళ్లీ అదే లుక్ లోకి మారబోతున్నాడట. ముఖ్యంగా సోలో సినిమాలో ఎంత సన్నగా ఉన్నాడో, ఇప్పుడు అలా తయారవ్వబోతున్నాడట. అందుకే నారా రోహిత్ ఎక్కవగా మీడియా ముందుకూ రావడం లేదని తెలుస్తోంది. త్వరలోనే తన రీ ఎంట్రీ గురించి కూడా రోహిత్ గ్రాండ్ గా ప్రకటించబోతున్నాడు.
నిజానికి పుష్ప సినిమాలో విలన్ ఫహాద్ ఫాజిల్ కంటే ముందు.. నారా రోహిత్ ను కూడా అనుకున్నారు. మొదట పుష్పలో విలన్ గా విజయ్ సేతుపతి ఫైనల్ అయ్యాడు. కానీ, ఆ తర్వాత విజయ్ డేట్స్ సర్టుబాటు కాలేదు. దాంతో ఈ పాత్రకు హీరో నారా రోహిత్ పేరు వినిపించింది. కానీ, చివరికి మలయాళ హీరో ఫహాద్ ఫాజిల్ దగ్గరకు వెళ్ళింది.