Pawan kalyan- Bandla Ganesh: పవన్ కళ్యాణ్ భక్తుడు ఎవరు? అంటే టక్కున చెప్పేస్తారు బండ్ల గణేష్ అని. పవన్ కళ్యాణ్ డై హార్డ్ ఫ్యాన్స్ ఆయన్ని కూడా అభిమానిస్తారు. అన్నయ్య అంటూ ప్రేమగా పిలుచుకుంటారు. సోషల్ మీడియాలో ఎప్పుడూ టచ్ లో ఉంటారు. ఆయన కూడా పవన్ ఫ్యాన్స్ తో కలిసిపోతారు. వాళ్ళు అడిగే ప్రశ్నలకు సమాధానం చెబుతూ ఉంటారు. పవన్ ఫ్యాన్స్ కి బండ్ల గణేష్ విడదీయరాని బంధం ఉందనేది నిజం. పవన్ కళ్యాణ్ వరుస ప్లాప్స్ ఇబ్బందిపడుతున్న రోజుల్లో బండ్ల గణేష్ నిర్మాతగా తెరకెక్కిన గబ్బర్ సింగ్ బ్లాక్ బస్టర్ నమోదు చేసింది.

పవన్ అభిమానులకు పిచ్చ కిక్ ఇచ్చిన చిత్రంగా గబ్బర్ సింగ్ ఉంది. ఇక పబ్లిక్ వేదికల్లో బండ్ల గణేష్ పవన్ కి ఇచ్చే ఎలివేషన్ గూస్ బంప్స్ కలిగిస్తుంది. ఈశ్వరా… పవనేశ్వరా… అంటూ బండ్ల మైక్ ముందు ఊగిపోతుంటే ఫ్యాన్స్ కి పూనకాలు వస్తాయి. అలా బండ్ల గణేష్ తో పవన్ అభిమానులకు విడదీయరాని బంధం ఏర్పడింది. సెప్టెంబర్ 2న పవన్ బర్త్ డే నేపథ్యంలో బండ్ల గణేష్ సర్ప్రైజ్ ప్లాన్ చేశారు. ఆయన నటించిన డేగల బాబ్జీ చిత్రం డైరెక్ట్ ఓటీటీలో అదే రోజున విడుదల చేస్తున్నారు.
Also Read: Cobra Movie Review: రివ్యూ : కోబ్రా
తమిళ హిట్ మూవీ రీమేక్ గా తెరకెక్కిన డేగల బాబ్జీ చిత్రంలో బండ్ల గణేష్ ప్రధాన పాత్ర చేశారు. ఆయన ఓ ఖైదీగా ఈ చిత్రంలో కనిపించనున్నారు. తమిళంలో ఆ పాత్రను పార్తీబన్ చేశారు. అక్కడ ఆ మూవీ మంచి విజయం సాధించింది. మర్డర్ మిస్టరీగా తెరకెక్కిన ఈ చిత్రానికి వెంకట్ చంద్ర దర్శకత్వం వహించారు. ఆహా లో నేరుగా విడుదలవుతున్న ఈ చిత్రం చూసి ఆదరించాల్సిందిగా పవన్ ఫ్యాన్స్ ని బండ్ల గణేష్ కోరారు. మరి పవన్ భక్తుడు బండ్ల గణేష్ కోరికను ఆయన ఫ్యాన్స్ ఎంత మేరకు సీరియస్ గా తీసుకుంటారో చూడాలి.

కాగా బండ్ల గణేష్ ని పవన్ దూరం పెట్టినట్లు పరిశ్రమలో పుకార్లు వినిపిస్తున్నాయి. భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ వేడుక విషయంలో దర్శకుడు త్రివిక్రమ్ ని బండ్ల గణేష్ దూషించినట్లు ఓ ఆడియో రికార్డు వైరల్ అయ్యింది. ఆ వాయిస్ నాది కాదని బండ్ల గణేష్ వివరణ ఇచ్చారు. అయినప్పటికీ పవన్ బండ్ల గణేష్ పై కోపంగా ఉన్నారని టాలీవుడ్ టాక్. ఆ సంఘటన తర్వాత బండ్ల గణేష్ కి పవన్ అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం కూడా ఈ పుకార్లకు బలం చేకూర్చుతుంది. అయితే రాజకీయాల్లో బిజీగా ఉన్న పవన్ కి ఎవరినీ కలిసే తీరిక లేదని కూడా కొందరు అంటున్నారు.
Also Read:Brahmaji – Anasuya: అనసూయపై ఇండస్ట్రీకి మండింది?… బ్రహ్మాజీతో స్టార్ట్, కేసు వేస్తా అంటూ షురూ!
[…] […]