https://oktelugu.com/

Flora Saini: అదిరిపోతున్న ‘లక్స్ పాప’ లేటేస్ట్ లక్స్ వైరల్

ఫ్లోరా షైనీ చంఢీఘర్ లోని ఓ ఆర్మీ అధికారి కుటుంబంలో జన్మించారు. జమ్మూ కాశ్మీర్ లోని ఉదంపూర్, ఢిల్లీలోని ఆర్మీ పబ్లిక్ స్కూల్లో చదివింది. ఆ తరువాత వీరి కుటుంబం కోల్ కతాకు మారింది. దీంతో ఆమె అక్కడే మోడలింగ్ రంగంలో అడుగుపెట్టింది. ఆ తరువాత ఫ్లోరా శైనీ మిస్ కోల్ కతా పోటీల్లో పాల్గొంది. ఈ క్రమంలో సినిమాల కోసం ఎదురుచూస్తున్న తరుణంలో 1999లో ‘ప్రేమకోసం’ అనే తెలుగు సినిమాలో నటించే అవకాశం వచ్చింది. ఆ తరువాత కొన్ని సినిమాల్లో నటించిన ఈమెకు నరసింహా నాయడు సినిమాతో గుర్తింపు వచ్చింది.

Written By: , Updated On : July 19, 2023 / 10:33 AM IST
Flora Saini

Flora Saini

Follow us on

Flora Saini: టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరో, హీరోయిన్లతో సమానంగా క్యారెక్టర్ ఆర్టిస్టులకు సమానంగా గుర్తింపు ఉంది. చాలా మంది హీరోయిన్ అవుదామనుకొని వచ్చిన వారు అవకాశాల్లేక సైడ్ పాత్రల్లో నటిస్తున్నారు. ఇలా నటించినా ఫేమస్ అయిన వారున్నారు. వారిలో ఆశాషైనీ ఒకరు. ఫ్లోరా షైనీగా పేరు మార్చుకున్న ఈమె అప్పట్లో సంచలన నటి. బాలకృష్ణ కెరీర్ లోనే మైలురాయిగా నిలిచిన ‘నరసింహానాయుడు’ సినిమాలో లక్స్ పాప అంటూ అలరించిన ఈ భామ ఆ తరువాత పలు సినిమాల్లో నటించింది. అయితే స్టార్ హీరోయిన్ అవుదామన్న కల నెరవేరలేదు. అయినా బాలీవుడ్ లో పలు సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. చాలా రోజులు తరువాత ఈమెకు సంబంధించిన లేటేస్ట్ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఫ్లోరా షైనీ చంఢీఘర్ లోని ఓ ఆర్మీ అధికారి కుటుంబంలో జన్మించారు. జమ్మూ కాశ్మీర్ లోని ఉదంపూర్, ఢిల్లీలోని ఆర్మీ పబ్లిక్ స్కూల్లో చదివింది. ఆ తరువాత వీరి కుటుంబం కోల్ కతాకు మారింది. దీంతో ఆమె అక్కడే మోడలింగ్ రంగంలో అడుగుపెట్టింది. ఆ తరువాత ఫ్లోరా శైనీ మిస్ కోల్ కతా పోటీల్లో పాల్గొంది. ఈ క్రమంలో సినిమాల కోసం ఎదురుచూస్తున్న తరుణంలో 1999లో ‘ప్రేమకోసం’ అనే తెలుగు సినిమాలో నటించే అవకాశం వచ్చింది. ఆ తరువాత కొన్ని సినిమాల్లో నటించిన ఈమెకు నరసింహా నాయడు సినిమాతో గుర్తింపు వచ్చింది.

అప్పటి నుంచి స్టార్ హీరోల సినిమాలో ఎక్కువగా నటించింది. వెంకటేశ్ హీరోగా వచ్చిన ‘నువ్వు నాకు నచ్చావ్’ మూవీలో ఆషాశైనీ హీరోయిన్ తో సమానంగా నటించింది. ఈమె క్యారెక్టర్ ఆర్టిస్టు అయినా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తెలుగు క్యారెక్టర్ ఆర్టిస్ట్ చిన్న.. హీరో కం డైరెక్షన్లో వచ్చిన ‘ఆ ఇంట్లో’ సినిమాలో ఆషా శైనీ దెయ్యం పాత్రతో నటించి అందరినీ భయపెట్టింది. చివరగా మనీ.. మనీ.. మోర్.. మనీ సినిమాలో నటించింది. ఆ తరువాత బాలీవుడ్ వెళ్లి అక్కడ కొన్ని సినిమాల్లో నటించింది.

ఏజ్ బార్ అయినా ఆషా శైనీ అందం ఏమాత్రం తగ్గలేదు. బాలకృష్ణ నరసింహానాయుడు సినిమాలో హాట్ గా కనిపించిన ఆషా ఇప్పటికీ అలాగే కనిపిస్తోంది. ఆమె లేటేస్ట్ పిక్స్ సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో కుర్రాళ్లు షాక్ అవుతున్నారు. అప్పటికీ , ఇప్పటికీ తరగని అందం ఆషా శైనిదీ.. అని కొనియాడుతున్నారు. ప్రస్తుతం సినిమాల్లో నటించకపోయినా సోషల్ మీడియా వేదికగా ప్రేక్షకులను అలరిస్తున్నారు.