Aditi Arya: సినిమా ఫ్లాప్ అయితేనేం, లైఫ్ లో సెటిల్ అయిపోయింది…

అదితి ఆర్య హీరోయిన్ అయ్యే కంటే ముందు షాహిద్ సుఖ్ దేవ్ ఆఫ్ బిజినెస్ స్టడీస్ నుంచి బిజినెస్ స్టడీస్ ఫైనాన్స్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది.

Written By: Gopi, Updated On : April 23, 2024 6:04 pm

Flop Heroine marry Billionaire Uday Kotak

Follow us on

Aditi Arya: సినిమా ఇండస్ట్రీలో చాలా మంది గొప్ప హీరోయిన్లు తమదైన రీతిలో సత్తాను చాటుతూ స్టార్ హీరోయిన్లుగా రాణిస్తూ చాలా కాలం పాటు ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు.ఇక ఇలాంటి సమయంలోనే హీరోయిన్ల మీద చాలా రూమర్లైతే వస్తాయి. వాటిలో వాళ్ళు ఏది పట్టించుకోకుండా వాళ్ల సినిమాలు వాళ్ళు చేసుకుంటూ ముందుకు వెళుతూ ఉంటారు. ఇక ఒక ముద్దుగుమ్మ సినిమాల్లో ఏమాత్రం సక్సెస్ అవ్వకపోయినా కొన్ని వేల కోట్లకు అధిపతిగా మారిందనే విషయం మనలో చాలామందికి తెలియదు.అయితే ఆమె ఎవరు అనేది ఒకసారి మనం తెలుసుకుందాం…

అదితి ఆర్య హీరోయిన్ అయ్యే కంటే ముందు షాహిద్ సుఖ్ దేవ్ ఆఫ్ బిజినెస్ స్టడీస్ నుంచి బిజినెస్ స్టడీస్ ఫైనాన్స్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. ఇక ఇండియాలోనే పెద్దదైన ఎర్నిస్ట్ అండ్ యంగ్ రీసర్చ్ అనలిస్ట్ గా పనిచేసింది. ఇక తను ఇలా పనిచేస్తున్న సమయంలోనే మిస్ ఇండియా కాంపిటీషన్ లో పాల్గొనడానికి ఆమె చేస్తున్న ఉద్యోగాన్ని వదిలేసింది. ఇక 2015 లో “ఎఫ్ బి బి ఫెమినా మిస్ ఇండియా కంపిటిషన్” లో విజేత గా నిలిచింది. ఇక ఆ తర్వాత ఈ అమ్మడు తెలుగులో కళ్యాణ్ రామ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘ఇజం’ సినిమాలో హీరోయిన్ గా నటించింది. అయితే ఈ సినిమాతో ఓకే అనిపించుకున్నప్పటికీ సినిమా కమర్షియల్ గా వర్కౌట్ అవ్వకపోవడంతో ఆమెకి మంచి గుర్తింపు అయితే రాలేదు. ఇక తర్వాత తెలుగులో పెద్దగా అవకాశాలు రాకపోవడంతో కన్నడ ఇండస్ట్రీకి వెళ్లి అక్కడ ‘కురుక్షేత్ర ‘అనే సినిమాలో నటించింది.

ఆ సినిమా కూడా ఆశించిన మేరకు సక్సెస్ సాధించలేదు. ఇక దాంతో బాలీవుడ్ లో 1983 వ సంవత్సరంలో ఇండియన్ టీం కి వరల్డ్ కప్ ఎలా సాధించిందో దాన్ని బేస్ చేసుకొని 83 అనే సినిమాని తెరకెక్కించారు. ఇక ఈ సినిమాలో రన్వీర్ సింగ్ దీపికా పదుకొనే లాంటి దిగ్గజ నటినటులతో నటించింది. అయితే ఈ సినిమా ఆమెకి కొంతవరకు ప్లస్ అవుతుంది అని తను భావించినప్పటికీ ఈ సినిమా ఆశించిన మేరకు సక్సెస్ సాధించకపోవడంతో ఈ అమ్మడు కెరియర్ డైలమాలో పడిపోయింది… మొత్తం 83 సినిమాకి 220 కోట్ల వరకు బడ్జెట్ పెడితే అది కేవలం 193 కోట్లు మాత్రమే వసూలు చేసి బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ గా నిలిచింది.

ఇక ఆ తర్వాత కోటక్ బ్యాంక్ అధినేత ఉదయ్ కొటక్ కొడుకు అయిన జై కోటక్ ని 2022 లో పెళ్లి చేసుకుంది.ఇక అప్పటినుంచి సినిమాలను చేయకుండా తన బిజినెస్ కి సంబంధించిన పనులను చూసుకుంటూ బిజీ అయిపోయింది. ఇక దాదాపు జై కోటక్ ఆస్తుల విలువ 13.4 బిలియన్ డాలర్లు కావడం విశేషం…ఇక మొత్తానికైతే సినిమా హీరోయిన్ గా ఫెయిల్ అయినప్పటికీ బిలియనీర్ ను పెళ్లి చేసుకొని ఇండస్ట్రీ లో ఏ హీరోయిన్ కి లేనంత ఆస్తిని కలిగి ఉందనే చెప్పాలి. ప్రస్తుతం ఇదే న్యూస్ సోషల్ మీడియా మొత్తం వైరల్ అవుతుంది…