Nari Nari Naduma Murari: ఈ సంక్రాంతికి సర్ప్రైజ్ హిట్ గా నిల్చిన చిత్రం ‘నారీ నారీ నడుమ మురారి'(Nari Nari Naduma Murari). ఇక శర్వానంద్(Hero Sharwanand) కోలుకోవడం కష్టం, ఆయన ఎప్పటికీ హిట్ కొట్టలేడని ట్రేడ్ వర్గాలు సైతం బలంగా ఫిక్స్ అయిపోయిన సందర్భంలో వచ్చిన ఈ సినిమా కమర్షియల్ గా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిల్చింది. 5 రోజుల్లో బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకొని లాభాల్లోకి అడుగుపెట్టిన ఈ చిత్రం, ఫుల్ రన్ లో ఏ రేంజ్ లాభాలను అందుకుంటుందో అని ఇప్పటి నుండి లెక్కలు వేసుకుంటున్నాయి ట్రేడ్ వర్గాలు. ఈ చిత్రానికి కాస్త ఎక్కువ థియేటర్స్ దొరికి ఉండుంటే బాక్స్ ఆఫీస్ విద్వంసం వేరే లెవెల్ లో ఉండేదని అంటున్నారు విశ్లేషకులు. వరుసగా ఫెయిల్యూర్స్ తో ఆర్ధిక నష్టాల్లో ఉన్న నిర్మాత అనిల్ సుంకర కి ఈ చిత్రం సక్సెస్ ఇచ్చిన బూస్ట్ మామూలుది కాదు.
ఇదంతా పక్కన పెడితే ఈ సినిమా గురించి ఎవరికీ తెలియని ఒక ఆసక్తికరమైన విషయం ఇప్పుడు సోషల్ మీడియా లో లీకై బాగా వైరల్ అయ్యింది. అదేమిటంటే ఈ చిత్రాన్ని ముందుగా హీరో శర్వానంద్ తో చేయాలని అనుకోలేదట. ప్రముఖ యంగ్ హీరో నితిన్ తో చెయ్యాలని అనుకున్నారట. ‘రాబిన్ హుడ్’ మూవీ ని నితిన్ ఒప్పుకున్న కొత్తల్లో చెప్పిన స్టోరీ అట ఇది. నితిన్ కే కథ బాగా నచ్చింది , కానీ తనకు భీష్మ లాంటి భారీ కమర్షియల్ సక్సెస్ ని అందించిన వెంకీ కుడుముల కి కమిట్మెంట్ ఇచ్చేసాడు కాబట్టి, ‘రాబిన్ హుడ్’ చిత్రం పూర్తి అయ్యేవరకు ఆగాల్సిందిగా కోరాడట నితిన్. డైరెక్టర్ రామ్ అబ్బూరి అందుకు ఒప్పుకున్నాడట. అయితే ఇంతలోపు అతనికి 14 రీల్స్ సంస్థ నుండి పిలుపు వచ్చింది. మంచి అవకాశం అవ్వడంతో శ్రీవిష్ణు తో ‘సామజవరగమనా’ చిత్రం చేసాడు.
ఆ సినిమా కమర్షియల్ గా పెద్ద హిట్ అవ్వడంతో 14 రీల్స్ సంస్థ మరో ప్రాజెక్ట్ ని రామ్ అబ్బూరి తో లాక్ చేసుకుందట.ఆ సినిమానే ‘నారీ నారీ నడుమ మురారి’. ఈ చిత్రం లో హీరో గా తీసుకునేందుకు నితిన్ కోసమే ప్రయత్నం చేసాడట డైరెక్టర్ రామ్ అబ్బూరి. కానీ నితిన్ నుండి ఎలాంటి రెస్పాన్స్ రాకపోవడం తో, ఈ కథని శర్వానంద్ కి వినిపించడం, ఆయన వెంటనే ఒప్పుకొని చేయడం జరిగింది. ఇక ఆ తర్వాత ఫలితం ఎలా వచ్చిందో మనమంతా ఇప్పుడు చూస్తున్నాం. ఒకవేళ ఈ సినిమా నితిన్ ఒప్పుకొని చేసుంటే, ఆయనకు భారీ కం బ్యాక్ సినిమా అయ్యేది. కమర్షియల్ గా ఈ చిత్రం కచ్చితంగా వంద కోట్ల గ్రాస్ మార్కుని కూడా అందుకొని ఉండేది. దురదృష్టం అంటే ఇదే. ఇప్పుడు నితిన్ ఏ రేంజ్ ఫ్లాపుల్లో ఉన్నాడో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.
