Bangarraju Movie: అక్కినేని నాగ చైతన్య ఈ ఏడాది ఫిల్మ్ కెరీర్ పరంగా మాత్రం ఫుల్ జోస్ లో దూసుకుపోతున్నాడు. ఇటీవల ‘లవ్ స్టోరీ’ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నారు ఈ యంగ్ హీరో. కరోనా సెకండ్ వేవ్ తర్వాత టాలీవుడ్ లో బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లను సాధించిన చిత్రంగా లవ్ స్టోరీ నిలిచింది. కాగా ఇప్పుడు తన తండ్రి నాగార్జునతో కలిసి ‘బంగార్రాజు’ మూవీ చేస్తున్నారు చైతూ. ఈ సినిమాకి కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహిస్తుండగా… అన్నపూర్ణ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తుంది. గతంలో వచ్చిన “సోగ్గాడే చిన్నినాయన” సినిమాకు సీక్వెల్ గా దీన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే చైతూ బర్త్ డే సందర్భంగా బంగార్రాజు సినిమా నుంచి విడుదల చేసిన టీజర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ టీజర్‌లో చిన్న బంగార్రాజుగా తండ్రి నాగార్జున లెవల్లో నటించి ఔరా అనిపించారు. తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్‌కు ముహూర్తం ఖరారైంది.

Also Read: 83 సినిమా తెలుగు ట్రైలర్ విడుదల… గూస్ బంప్స్ గ్యారంటీ
ఈ మూవీ నుంచి ‘నా కోసం’ అంటూ సాగే ఫస్ట్ సాంగ్‌ను డిసెంబర్ 1న ఉదయం 11.12 నిమిషాలకు విడుదల చేయనున్నట్టు మూవీ యూనిట్ ప్రకటించారు. ఈ సినిమాలో నాగ చైతన్య సరసన కృతిశెట్టి నటిస్తోంది. తొలిసారి వీళ్లిద్దరు జోడిగా నటిస్తుండంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. మరోవైపు నాగ చైతన్య విక్రమ్ కుమార్ దర్శకత్వంలో చేస్తోన్న ‘థాంక్యూ’ మూవీ నుంచి ఫస్ట్ లుక్ విడుదల చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది. అలానే నాగ చైతన్య విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ హార్రర్ వెబ్ సిరీస్‌లో నటిస్తున్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. ఇక ఈయన హిందీలో తొలిసారి నటించిన ‘లాల్ సింగ్ చద్ధా’లో ముఖ్యపాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాను ఏప్రిల్ 14న విడుదల చేస్తున్నారు. బంగార్రాజు సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
Time for some Melody🎵#NaaKosam Song Teaser from #Bangarraju on 1st Dec @ 11:12AM🎻
Dedicated to all the People in love❤️
An @anuprubens Musical 🎹
📝#Balaji
@iamnagarjuna @chay_akkineni @IamKrithiShetty @kalyankrishna_k @ZeeStudios_ @zeemusiccompany pic.twitter.com/t71jK1PElw— Annapurna Studios (@AnnapurnaStdios) November 29, 2021
Also Read: గోల్డెన్ గ్లోబ్ పురస్కారానికి నామినేట్ అయినా సూర్య ” జై భీమ్” మూవీ…