First Mobile Movie theatre : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వినూత్న రీతిలో మొబైల్ సినిమా థియేటర్ అందుబాటులోకి వచ్చింది. ఈ కొత్తతరం థియేటర్లతో ఇప్పుడు ఎక్కడైనా ఏ మారుమూలన అయినా ఏసీ థియేటర్లలో చూసినట్టు సినిమాలు చూసేయవచ్చు. ఈ ఆలోచన అద్భుతం అని చాలా మంది కొనియాడుతున్నారు.
ఏ మారుమూల ప్రాంతానికైనా ట్రక్కులో తీసుకుపోయి అమర్చుకోగల మొబైల్ సినిమా హాల్ సిద్ధమైంది. గోదావరి జిల్లాలోని . రాజానగరం వద్ద నేషనల్ హైవే పక్కన హాబిటేట్ ఫుడ్ కోర్టు ప్రాంగణంలో ఈ ధియేటర్ ఏర్పాటవుతోంది. వెదర్ ప్రూఫ్, ఫైర్ ఫ్రూఫ్ పద్ధతుల్లో వేసిన టెంట్ లో గాలినింపే టెక్నాలజీతో 120 సీట్ల కెపాసిటీతో ఈ ఏసి ధియేటర్ ను రూపొందిస్తున్నారు.
“పిక్చర్ డిజిటల్స్” సంస్ధ ఆంధ్రప్రదేశ్ లో నెలకొల్పుతున్న మొబైల్ ధియేటర్లలో ఇది మొదటిది. ఆచార్య సినిమాతో ధియేటర్ ప్రారంభం కాబోతోందని సంస్ధ ప్రతినిధి చెప్పారు. ఇది ఒకప్పటి టూరింగ్ టాకీసులకు ఆధునికమైన, సౌకర్యవంతమైన రూపంగా దీన్ని అభివర్ణిస్తున్నారు..
ఈ మొబైల్ థియేటర్ ప్రయోగం విజయవంతమైతే మరిన్ని చోట్ల ఇలాంటి థియేటర్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది.ఈ మొబైల్ బెలూన్ థియేటర్ లో 120 సిటీతోపాటు 5.1 సరౌండ్ సౌండ్ సిస్టం ప్రేక్షకులను కనువిందు చేయనున్నారు.
మల్టీప్లెక్స్ థియేటర్ లో ఏ విధంగా అయితే వాష్ రూమ్స్, ఏసీ తోపాటు లేటెస్ట్ టెక్నాలజీని వాడుతున్నారో.. అలాగే దీన్ని కూడా కేవలం ఐదు నుంచి ఏడు రోజుల్లోనే నిర్మించడం విశేషం. మారుమూల గ్రామస్థుల కోసం ఈ మొబైల్ థియేటర్ ను మొదట అనుకున్నారు. అలాంటి మొబైల్ ఎయిర్ బెలూన్ రూమ్ థియేటర్ ఇప్పుడు రాజానగరంలోనూ ప్రేక్షకులకు వినోదాన్ని పంచడానికి ఏర్పాటైంది.