https://oktelugu.com/

ప్చ్.. ర‌ఘువీర సాహిత్యం మోహన్ బాబు పైత్యం !

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు హీరోగా నటిస్తూ నిర్మిస్తోన్న తాజా సినిమా ‘సన్‌ ఆఫ్‌ ఇండియా’. కాగా ఈ సినిమాలోని తొలి గీతానికి సంబంధించిన లిరిక‌ల్ వీడియోను తాజాగా విడుద‌ల చేసింది టీమ్. ‘జ‌య జ‌య మ‌హావీర మ‌హాధీర’ అంటూ సాగే ఈ ర‌ఘువీర గ‌ద్యం ఆద్యంతం అల‌రిస్తోందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గొప్ప సాహిత్యంతో సాగిన ఈ పాటకు ఇళ‌య‌రాజా స్వ‌రాలు మరింత వన్నెను తెచ్చాయి. ఇక పాటలోని బలమైన రౌద్రపు పదాలను సింగర్ రాహుల్ నంబియార్ […]

Written By:
  • admin
  • , Updated On : June 15, 2021 / 04:43 PM IST
    Follow us on

    కలెక్షన్ కింగ్ మోహన్ బాబు హీరోగా నటిస్తూ నిర్మిస్తోన్న తాజా సినిమా ‘సన్‌ ఆఫ్‌ ఇండియా’. కాగా ఈ సినిమాలోని తొలి గీతానికి సంబంధించిన లిరిక‌ల్ వీడియోను తాజాగా విడుద‌ల చేసింది టీమ్. ‘జ‌య జ‌య మ‌హావీర మ‌హాధీర’ అంటూ సాగే ఈ ర‌ఘువీర గ‌ద్యం ఆద్యంతం అల‌రిస్తోందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గొప్ప సాహిత్యంతో సాగిన ఈ పాటకు ఇళ‌య‌రాజా స్వ‌రాలు మరింత వన్నెను తెచ్చాయి.

    ఇక పాటలోని బలమైన రౌద్రపు పదాలను సింగర్ రాహుల్ నంబియార్ ఆల‌పించిన విధానం కూడా చాల బాగుంది. పాట‌కు తగ్గట్టు దర్శకుడు రత్నబాబు చేయించిన విజువల్స్ కూడా బాగున్నాయి. అయితే, కొన్ని విజువల్ షాట్స్ మాత్రం పెళ్లి వీడియోల్లో వేసే గ్రాఫిక్స్ లాగా అనిపిస్తాయి. ఈ పాటలో అర్ధాన్ని బట్టి మోహ‌న్ బాబు ప‌లికించిన‌ హావభావాలు సందర్భానికి అనుగుణంగా సాగాయి.

    కానీ, మోహన్ బాబు విగ్గు విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సింది. అలాగే ఆయన నడక విషయంలోనూ దర్శకుడు ప్రత్యేక దృష్టి పెట్టాల్సింది. మొత్తమ్మీద పాట బాగున్నా.. ఎవరికి అర్ధం కాదు, అర్ధం కానప్పుడు, దాని గొప్పతనం ఏమి అర్ధం అవుతుంది ? ఏదో గొప్ప సాహిత్యం అంటూ పైత్యం చూపించినట్టు అయింది వ్యవహారం. అయినా గంభీరమైన పదాలతో పాటు వాటి అర్ధాలు కూడా ప్రేక్షకులకు అర్ధమై నచ్చినప్పుడే కదా, ఆ పాట పదికాలాల పాటు నిలిచిపోతుంది.

    నిజానికి మోహ‌న్ బాబు తన కెరీర్‌ లో ఎన్నో సూప‌ర్ డూప‌ర్ హిట్‌ పాటలను దగ్గర ఉండి చేయించుకున్నారు. మరి అలాంటి మోహన్ బాబు కూడా ఈ సాంగ్ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోలేకపోయారు. ఇక ‘పెద‌రాయుడు’ చిత్రం 26 ఏళ్లు పూర్తి చేసుకున్న సంద‌ర్భంగా ఈ గీతాన్ని విడుద‌ల చేశామని మోహన్ బాబు సగర్వంగా చెప్పుకొచ్చాడు.

    ఈ చిత్రంలో మోహన్ బాబుతో పాటు ప్ర‌గ్యా జైస్వాల్‌, శ్రీకాంత్‌, కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. హీరో మంచు విష్ణు ఈ సినిమాని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.