Mohan Babu : వ్యక్తిగత భద్రత కోసం ప్రముఖులు లైసెన్స్డ్ గన్స్ వాడతారు. టాలీవుడ్ స్టార్ హీరోలందరి వద్ద గన్స్ ఉన్నట్లు సమాచారం. మోహన్ బాబు రెండు గన్స్ మైంటైన్ చేస్తున్నారట. వివాదాల్లో చిక్కుకున్న మోహన్ బాబు నుండి సదరు గన్స్ రికవరీ చేయాలని పోలీసులు నిశ్చయించుకున్నారు. కొడుకు మంచు మనోజ్ తో మోహన్ బాబుకి వివాదం నెలకొంది. పరస్పరం దాడులు చేసుకున్నారు. పోలీస్ కేసులు సైతం పెట్టుకున్నారు.
మోహన్ బాబు జుల్ పల్లి ఫార్మ్ హౌస్ వద్ద మూడు రోజుల పాటు హైడ్రామా చోటు చేసుకుంది. ఇరువర్గాలు బలగాలు సమీకరించాయి. దాంతో వాతావరణం వేడెక్కింది. రంగంలోకి దిగిన పోలీసులు, మోహన్ బాబుతో పాటు తన ఇద్దరు కుమారులకు గట్టి వార్నింగ్ ఇచ్చారు. శాంతి భద్రతలు భంగం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని సూచనలు చేశారు. కాగా మోహన్ బాబు టీవీ 9 రిపోర్టర్ పై దాడి చేయడం మరొక కేసు అయ్యింది.
మైక్ తో రిపోర్టర్ తలపై మోహన్ బాబు కొట్టడంతో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. మోహన్ బాబు మీద హత్యాయత్నం కేసు నమోదైంది. మోహన్ బాబు అరెస్ట్ కి పోలీసులు రంగం సిద్ధం చేశారంటూ వార్తలు వచ్చాయి. అలాగే మోహన్ బాబు పరారీలో ఉన్నాడంటూ కథనాలు వెలువడ్డాయి. తాను ఎక్కడికీ పారిపోలేదని మోహన్ బాబు వివరణ ఇచ్చారు. క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న మోహన్ బాబు నుండి గన్స్ రికవరీ చేశారు పోలీసులు. చంద్రగిరిలో ఆయన డబుల్ బ్యారెల్ గన్ మోహన్ బాబు పోలీసులకు హ్యాండ్ ఓవర్ చేశాడు. అలాగే మోహన్ బాబు వద్ద స్పానిష్ మేడ్ రివాల్వర్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
ఈ గన్ ని మోహన్ బాబు పోలీసుల ఒత్తిడి మేరకు ఫిల్మ్ నగర్ పోలీస్ స్టేషన్ లో సరెండర్ చేశాడని సమాచారం. ఇక హత్యాయత్నం కేసులో మోహన్ బాబు అరెస్ట్ అనివార్యమే అంటున్నారు. డిసెంబర్ 24 వరకు కోర్టు మోహన్ బాబుకు మినహాయింపు ఇచ్చింది. అరెస్ట్ చేయకండి అంటూ ఆదేశాలు ఇచ్చింది. అందుకే మోహన్ బాబు అరెస్ట్ ఆలస్యం అవుతుంది. మోహన్ బాబు అరెస్ట్ చేయడం ఖాయం అంటూ రాచకొండ సీపీ సుధీర్ బాబు వెల్లడించారు.
కాగా తన దాడిలో గాయపడిన టీవీ 9 రిపోర్టర్ ని మోహన్ బాబు ఆసుపత్రిలో కలవడం విశేషం. అనుకోకుండా చీకట్లో జరిగిన పొరపాటు అది. నాపై ప్రత్యర్ధులు దాడి చేస్తున్నారేమో అనే భయంతో ప్రతిఘటించాను. అంతే కానీ మీడియా ప్రతినిధి మీద దాడి చేయాలన్న ఆలోచన నాకు లేదని, ఆయన అన్నారు.