Soumya Shetty: సౌమ్య శెట్టి గురించి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం చోరీ కేసులో అరెస్ట్ అయింది. పెందుర్తికి చెందిన సౌమ్యకు నటన అంటే ఇష్టం. దీంతో యూట్యూబ్, ఇన్ స్టాతో, షార్ట్ ఫిల్మ్ లో నటించింది. అలా ఈమెకు హీరోయిన్ గా అవకాశాలు వచ్చాయి. ఈమెకు రిటైర్డ్ ఉద్యోగి జనపాల ప్రసాద్ కుమార్తె మౌనికతో పరిచయం ఏర్పడింది. ఈమె సోషల్ మీడియా ఇన్ఫెయెన్సర్. 2016లో బీటెక్ చదువుతున్నప్పుడే ఇద్దరికి పరిచయం ఏర్పడింది. ఇద్దరికి నటన అంటే ఇష్టం ఉండడంతో కలిసి కొన్ని వీడియోలు కూడా చేశారు.
ఇక ఇద్దరికి వివాహాలు కూడా జరిగాయి. సౌమ్యకు కూడా సుజాత నగర్ లో ఉంటున్న ఒడిశాకు చెందిన బలరాం శెట్టితో వివాహం జరిగింది. ఇక మౌనికకు పాప పుట్టింది. తన చిన్నారి ఫోటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకోగా వాటిని చూసిన సౌమ్య రెస్పాన్స్ ఇచ్చింది. అలా ఇద్దరి మధ్య మాటలు కుదిరాయి. సౌమ్య ఈ మధ్య కొన్ని సినిమాల్లో నటిచింది కూడా. ఒసేయ్ సూర్యకాంతం, ట్రిప్ లాంటి వెబ్ సిరీస్ లలో నటించింది. ఏ మాస్టర్ పీస్ అనే సినిమాలో నటిస్తోంది.
ఇక అడపదడపా అవకాశాలు రావడంతో జల్సాలకు అలవాటు పడిందట. అలా వాటికోసం అప్పులు కూడా చేసిందట. అదే సమయంలో పాత స్నేహితురాలు మౌనిక టచ్ లోకి వచ్చింది. తను డెలివరీ కోసం అని.. దొండపర్తి ప్రాంతంలోని బాలీజీ రెసిడెన్సీలో తండ్రి వద్ద ఉంటున్నా అని చెప్పడంతో మౌనిక ఇంటికి వెళ్లింది సౌమ్య. గత నెల ఫిబ్రవరి 2న ఓ సారి ఇంట్లోకి వెళ్లి బాత్రూమ్ అని చెప్పి తలుపులు వేసుకుందట. చాలా సేపు బయటకు రాలేదట. కానీ వాళ్లు పెద్దగా పట్టించుకోలేదట.
ఫిబ్రవరి 23న యలమంచిలి లోని బంధువుల ఇంట్లో శుభకార్యం ఉందని బీరువాలో ఉన్న బంగారం కోసం వెతికితే దొరకలేదట. వెంటనే పోలీసులను ఆశ్రయించారు. తమ ఇంట్లో సుమారు 74 తులాల బంగారం మాయం అయిందని ఫిర్యాదు చేశారు. సౌమ్య శెట్టిపై అనుమానం వ్యక్త పరచారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపడితే విస్తు పోయే విషయాలు బయటకు వచ్చాయి. అయితే అప్పటికే సౌమ్య పరారీలో ఉంది. ఆ మొత్తం డబ్బును తీసుకొని గోవా పారిపోయిందట.
పోలీసులు ఆమె బ్యాంకు లావాదేవీలు పరిశీలించగా ఫిబ్రవరి 6వ తేదీన విశాఖ లో లలితా జ్యూయలరీ లో పాత నగలు విక్రయించి కొత్తవి కొన్నట్లు గుర్తించారు. రెండు బంగారు దుకాణాల్లో వాటిని విక్రయించింది. మొత్తం మీద సౌమ్యను అదుపులోకి తీసుకొని విచారించారు పోలీసులు. నగలు అమ్మేసిన డబ్బులతో పారిపోయి జల్సా చేసినట్టు తెలిపింది. రూ. 4లక్షలు ఖర్చు చేసినట్టు పేర్కొంది. క్రెడిట్ కార్డుల అప్పుల కోసం రూ.2లక్షలు, కార్ల రిపేర్లకు రూ. లక్షన్నర ఖర్చు చేసినట్టు వెల్లడించింది. మొత్తంగా ఆమె నుంచి 40 నుంచి 50 తులాల మధ్య బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.