Homeఎంటర్టైన్మెంట్Movie Trends: టుడే ట్రెండ్ అవుతున్న క్రేజీ అప్ డేట్స్ !

Movie Trends: టుడే ట్రెండ్ అవుతున్న క్రేజీ అప్ డేట్స్ !

Movie Trends : మూవీ ట్రెండ్స్ నుంచి ప్రజెంట్ క్రేజీ అప్ డేట్స్ విషయానికి వస్తే.. సీఎం జగన్ బీసీల పక్షపాతి అని సినీ నటుడు, నిర్మాత ఆర్. నారాయణమూర్తి అన్నారు. విజయవాడ బీసీ భవన్‌‌లోని విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ చాంబర్‌కు వచ్చిన ఆయనను సత్కరించారు. సీఎం జగన్ దేశంలోనే ఎక్కడా లేని విధంగా బీసీలకు ఒక భవన్‌ను ఏర్పాటు చేశారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీ కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేసి, చైర్మన్లను ఏర్పాటు చేసిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు.

R Narayana Murthy1
R Narayana Murthy

అలాగే మరో అప్ డేట్ విషయానికి వస్తే.. సమతకు చిహ్నమైన రామానుజాచార్య సహస్రాబ్ది ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ముచ్చింతల్‌లోని దివ్యక్షేత్రాన్ని సందర్శించేందుకు భక్తులు, ప్రముఖులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. శుక్రవారం సమతామూర్తి కేంద్రాన్ని హీరో అల్లు అర్జున్, బాబా రామ్‌దేవ్, తమిళనాడు గవర్నర్ ఆర్‌ఎన్ రవి సందర్శించారు. అక్కడి శిల్పాలను, కట్టడాలను పరిశీలించారు. సమతామూర్తి విశిష్టతను సిబ్బంది వారికి వివరించారు.

Allu Arjun at Ramanujacharya Statue
Allu Arjun at Ramanujacharya Statue

అలాగే మరో అప్ డేట్ విషయానికి వస్తే.. ఎనభైకి పైగా సినిమాల్లో నటించినా తనకు పెద్దగా పేరు రాకపోవడానికి కారణాలను బిగ్‌బాస్ విన్నర్ కౌశల్ వెల్లడించాడు. ఒకానొక సమయంలో తన తల్లి అనారోగ్యానికి గురైనప్పుడు డబ్బు కోసం ఓ అడల్ట్ మూవీ చేయాల్సి వచ్చిందని, అప్పటి నుంచి కౌశల్ అడల్ట్ మూవీస్ చేస్తాడనే ముద్ర పడిందని చెప్పాడు. ఆ సినిమా(స్వర్ణ) వల్లే తన కెరీర్ నాశనమైందని చెప్పుకొచ్చాడు. రమ్యశ్రీ హీరోయిన్, షకీలా, రేష్మ ఇతర పాత్రలు పోషించారు.

KGF 2
KGF 2

మరో అప్ డేట్ విషయానికి వస్తే.. దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్న KGF-2లో అమితాబ్ బచ్చన్ షోలేలోని ‘మెహబూబా.. మెహబూబా’ పాటను రీమేక్ చేశారు. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14న ఈ సాంగ్ ను రిలీజ్ చేస్తారని తెలుస్తోంది. . ఈ ఐటమ్ సాంగ్‌లో బాలీవుడ్ బ్యూటీ నోరా ఫతేహి.. హీరో యశ్ సరసన నటించినట్లు సమాచారం

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Exit mobile version