OTT: చేతి వేళ్ళ గోర్లు కొరికేలా.. సీటు చివర అంచున కూర్చునేలా.. ఊపిరి బిగబట్టి చూసేలా.. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ వస్తే చెవులు మూసుకునేలా.. ఇదుగో ఇలాంటి సినిమాలే ప్రేక్షకులకు ఎక్కువ కాలం గుర్తుంటాయి. నాలుగు పిచ్చి గెంతులు, అర్థం పర్థం లేని పాటలు, లాజిక్ లేని సీన్లు, వీరోచిత మైన హీరోయిజాన్ని పో పోవోయ్ అంటున్నారు. అంత దాకా ఎందుకు ముని సిరీస్ లో ఇప్పటివరకు నాలుగు సినిమాలు వచ్చాయి. ఈ నాలుగు సినిమాల్లో ఒక్కటే కాన్సెప్ట్. కానీ ప్రేక్షకులను భయపెట్టే తీరు వేరే విధంగా ఉంటుంది. ఆ భయాన్నే రాఘవ లారెన్స్ క్యాష్ చేసుకున్నాడు. ఇప్పుడు ముని సిరీస్ లో ఐదో సినిమాను చిత్రీకరిస్తున్నాడు. ఇక కరోనా తర్వాత ప్రేక్షకుల ఆలోచన స్వరూపం మారిపోయింది. అప్పటిదాకా రోడ్డ కొట్టుడు సినిమాలకు అలవాటు పడి మొహం మొత్తి కొత్తదనం వెంట పయనించడం ప్రారంభించారు. మరి ముఖ్యంగా మెదడుకు పదును పెట్టే సస్పెన్స్, థ్రిల్లర్, హర్రర్, డిటెక్టివ్, సైకలాజికల్ సినిమాలను ఇష్టపడటం ప్రారంభించారు. హాలీవుడ్లో ఈ తరహా సినిమాలు ఎక్కువ వస్తుంటాయి కాబట్టి వాటిని ఒక సెక్షన్ ప్రేక్షకులు ఎక్కువగా ఇష్టపడుతుంటారు. ఇక మన దేశానికి వచ్చేసరికి ఇక్కడ హిందీ, ఇతర భాషల్లో ప్రేక్షకులు ఎక్కువ కాబట్టి ఆ భాషల్లో నిర్మితమయ్యే సినిమాలను ఎక్కువగా చూస్తుంటారు. ఒకప్పుడు వినోదం అంటే సినిమా థియేటర్ మాత్రమే. కానీ ఇప్పుడు ఆ స్థానాన్ని ఓటీటీలు ఆక్రమించాయి. కేవలం విడుదలైన సినిమాలనే కాకుండా.. సొంతంగా సినిమాలను నిర్మించి తమ ప్లాట్ఫారంలో విడుదల చేస్తున్నాయి.

రొటీన్ సినిమాలు కాకుండా
ప్రేక్షకులు కొత్తదనం కోరుకుంటున్నారు కాబట్టి గ్రిప్పింగ్ అంశాలను ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టే ఓటీటీలు కూడా అలాంటి సినిమాలనే స్ట్రీమింగ్ చేస్తున్నాయి. ప్రస్తుతం ఓటీటీ మార్కెట్లో మెజారిటీ వాటా నెట్ ప్లిక్స్ ది , ఆ తర్వాత హాట్ స్టార్, ఆమెజాన్ ప్రైమ్, సోనీ లివ్, వూట్, ఆహా, సన్ ఎన్ఎక్స్టీ ఉన్నాయి. అయితే వీటిల్లో ఎక్కువగా నెట్ ఫ్లిక్స్ హర్రర్, క్రైమ్, పోలీస్ ఇన్వెస్టిగేషన్, కోర్టు రూమ్ డ్రామా, డిటెక్టివ్, సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్లలో సినిమాలను స్ట్రీమింగ్ చేస్తోంది. వీటిల్లో కట్టిపడేసే అంశాలు ఉండటం, సామాజిక సమస్యలను వెలుగెత్తి చూపడంతో ప్రేక్షకులు వీటినే కోరుకుంటున్నారు. మిగతా ఓటిటి ప్లాట్ ఫామ్ లు కూడా ఇదే బాటలో పయనిస్తున్నాయి.
Also Read: Oscars 2023 RRR : ఆస్కార్ బరిలో ఆర్ఆర్ఆర్ కు కశ్మీర్ ఫైల్స్ గట్టి పోటీ!
ఇక ఈ తరహా సినిమాల విషయంలో అన్నింటికన్నా మలయాళ సినీ పరిశ్రమ ముందంజలో ఉంది. కరోనా మొదటి దశ నుంచి ఇప్పటివరకు ఈ సినీ పరిశ్రమ నుంచి లెక్కకు మిక్కిలి సినిమాలు విడుదలయ్యాయి. వాటిలో అంజం పతిరా, ఫోరెన్సిక్, మహేశంతే ప్రతీకారం, నాయట్టు, దృశ్యం 2, జోజి, లూసిఫర్, మాలిక్ అలాంటి సినిమాలు తెలుగు ప్రేక్షకులపై తీవ్ర ప్రభావం చూపించాయి. ఫలితంగా ఆ సినిమాలను డబ్ చేసి ఓటిటీలో ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ చేస్తున్నారు. అయితే మలయాళం అనువాదాలకు సంబంధించి ఎక్కువ సినిమాలు ఆహాలో విడుదలవుతున్నాయి.

మార్కెట్ పెరుగుతోంది
అపరిమితమైన డాటా సౌకర్యం అందుబాటులోకి వచ్చిన తర్వాత ఓటీటీల్లో సినిమాలు చూసే ప్రేక్షకుల సంఖ్య పెరుగుతున్నది. వారి అభిరుచికి అనుగుణంగానే ఆ సంస్థలు కూడా సినిమాలను విడుదల చేస్తున్నాయి. ప్రస్తుతం అసోచామ్ లెక్కల ప్రకారం భారతదేశంలో ఓటీటీ మార్కెట్ విలువ 500 కోట్ల వరకు ఉంటుందని ఒక అంచనా. ఇక కరోనా సమయంలో థియేటర్లు అసలు తెరుచుకోలేదు. ఈతరుణంలో సినీ నిర్మాతలకు ఓటిటీ ఫ్లాట్ ఫాం లు కామధేనువులుగా నిలిచాయి. ప్రస్తుతం సినిమా విడుదలైన మూడు నుంచి నాలుగు వారాల లోపే ఓటి టి ప్లాట్ పాం ల్లో స్ట్రీమింగ్ అవుతున్నాయంటే వీటికి ఉన్న రీచ్ ను అర్థం చేసుకోవచ్చు.