Faria Abdullah: హైదరాబాద్ బ్యూటీ ఫరియా అబ్దుల్లా అసలు తగ్గడం లేదు. తనలోని గ్లామర్ యాంగిల్ సోషల్ మీడియా వేదికగా ఆవిష్కరిస్తుంది. తాజాగా ఆమె బోల్డ్ వీడియో ఒకటి వైరల్ అవుతుంది. ఫరియా అబ్దుల్లా అనగానే మనకు జాతి రత్నాలు చిత్రం గుర్తుకు వస్తుంది. దర్శకుడు అనుదీప్ జాతి రత్నాలు చిత్రంతో సంచలనం చేశాడు. యూత్ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీ వసూళ్ల వర్షం కురిపించింది. భారీ లాభాలు పంచిన చిత్రాల జాబితాలో నిలిచింది.
నవీన్ పోలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ప్రధాన పాత్రలు చేశారు. హీరోయిన్ గా ఫరియా అబ్దుల్లా నటించింది. ఫరియా చిట్టి పాత్రలో కట్టిపడేసింది. అమాయకపు లాయర్ పాత్రలో ఫరియా కోర్ట్ రూమ్ సన్నివేశాల్లో నవ్వులు పూయించింది. జాతి రత్నాలు మూవీ ఫరియాను ఓవర్ నైట్ స్టార్ చేసింది అనడంలో సందేహం లేదు. జాతి రత్నాలు విజయం సాధించినా ఆశించిన స్థాయిలో ఫరియాకు ఆఫర్స్ రాలేదు.
సంతోష్ శోభన్ కి జంటగా ‘లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్’ టైటిల్ తో ఓ చిత్రం చేసింది. ఇది డిజాస్టర్ అయ్యింది. అనంతరం బంగార్రాజు మూవీలో స్పెషల్ సాంగ్ చేసింది. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ చిత్రంలో ఎక్స్టెండెడ్ గెస్ట్ రోల్ చేసింది. రవితేజ హీరోగా విడుదలైన రావణాసుర చిత్రంలో కీలక రోల్ లో మెప్పించింది. అయితే ఫరియాను హీరోయిన్ గా నిలబెట్టే మరో మూవీ పడలేదు. జాతి రత్నాలు తరహా హిట్ కోసం ఆమె ఎదురు చూస్తుంది.
ఫరియా మంచి డాన్సర్. అద్భుతమైన డాన్సింగ్ స్కిల్స్ ఉన్నాయి. తన టాలెంట్ ఇంస్టాగ్రామ్ వేదికగా బయటపెడుతోంది. తరచుగా ఆమె డాన్స్ వీడియోలు చేస్తుంది. తాజాగా డెనిమ్ షార్ట్స్, టాప్ ధరించి బాలీవుడ్ ఆల్బమ్ కి ఇరగదీసింది. పొట్టి నిక్కర్ లో ఫరియా డాన్స్ మూమెంట్స్ బోల్డ్ గా ఉన్నాయి. దీంతో ఫరియా ఇంస్టాగ్రామ్ పోస్ట్ వైరల్ అవుతుంది. ఫరియా హాట్ ఫోటో షూట్స్ కి ఫ్యాన్స్ ఉన్నారు. ఇంస్టాగ్రామ్ లో ఆమెను 8 లక్షలు పైగా ఫాలో అవుతున్నారు. ఫరియా డిజిటల్ కంటెంట్ మీద దృష్టి పెడుతుంది.
View this post on Instagram