Faria Abdulla : ఫరియా అబ్దుల్లా.. చూడడానికి ఎంతో అందంగా ఉండే ఈ హైదరాబాదీ అందం.. బ్రేక్ వచ్చాక కూడా సినిమాల్లో కనిపించడం లేదు. ‘జాతిరత్నాలు’ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ఫరియా అబ్ధుల్లాకు అవకాశాలు క్యూ కడుతాయని అందరూ అనుకున్నారు. చాలా మంది దర్శక నిర్మాతలు సంప్రదించారు. కానీ ఫరియా మాత్రం నో చెబుతోందట.. కనీసం ఐటెం సాంగ్ లు కూడా ఈ భామ చేయదట.. ఎందుకంటే.. తనకు ఎదగడం కంటే పద్ధతిగా బతకడం ఇష్టమని చెబుతోంది.

అందరు హీరోయిన్లలాగా దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకునే క్యారెక్టర్ కాదని.. క్యారెక్టర్ ఉన్న కథల్లోనే నటిస్తానని చెబుతోంది. ఇటీవల సంతోష్ శివన్ సినిమాలో హీరోయిన్ ఓరియెంటెడ్ పాత్ర కాబట్టే అందులో నటించిందట.. ఇక నాగార్జున ఐటెం సాంగ్ ఆఫర్ ఇచ్చినా మొదట్లో తిరస్కరించి ఆ తర్వాత సర్దుకొని చేసింది ఈ భామ.
ఎంత పెద్ద స్టార్ హీరో సినిమా అయినా కథ.. అందులో తనకు ప్రధాన పాత్ర ఉంటేనే చేస్తానని చెబుతోంది. చాలా అవకాశాలను ఈమె వదులుకుంటోందని ఇండస్ట్రీ టాక్. అందరు హీరోయిన్లలా అంగాంగ ప్రదర్శన అస్సలే చేయదట.. నీట్ గా.. హీరోయిన్ కు ప్రాధాన్యమున్న పాత్రలే చేస్తానంటోంది. గ్లామర్ కు దూరం అంటోంది.
దాదాపు 6 ఫీట్ల హైట్ తో నవ్వుతే ముత్యాలు రాలినట్టు ఉండే మోముతో అందంగా ఉండే ఫరియా ఇప్పుడు కొత్తలోనే ఇంత స్ట్రిక్ గా ఉంది కాబట్టే ఈమెకు పెద్ద సినిమాల్లో అవకాశాలు రావడం లేదని.. కాంప్రమైజ్ కాకపోవడం వల్లనే ఈమె స్టార్ హీరోయిన్ గా ఎదగడం లేదన్న టాక్ నడుస్తోంది. ఇలాంటి వాళ్లు నూటికోకోటికో ఒకరు ఉంటారని అందరూ మెచ్చుకుంటున్నారు.
