Mahesh Babu: టాలీవుడ్ లో ప్రస్తుతం వరుస విజయాలతో మంచి ఊపు మీదున్న స్టార్ హీరో ఎవరైనా ఉన్నారా అంటే అది సూపర్ స్టార్ మహేష్ బాబు మాత్రమే అని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు.ఆయన రేంజ్ కి తగ్గ సినిమా పడకపోయినా కూడా, యావరేజి సినిమాలతోనే అవలీలగా వంద కోట్ల రూపాయిల షేర్ మార్కుని కొల్లగొడుతూ ముందుకు దూసుకెళ్తున్నాడు.ఇలాంటి స్టార్ స్టేటస్ రావాలంటే అదృష్టం ఉండాలి, కానీ మహేష్ ఫ్యాన్స్ మాత్రం తమ అభిమాన హీరో పై అసంతృప్తి తో ఉన్నారు.ఎందుకంటే మహేష్ బాబు అంటేనే సరికొత్తరకమైన కథలు చేసేవాడు.

ఆయన సూపర్ హిట్ సినిమాలన్నీ టాలీవుడ్ ని మరో రేంజ్ కి తీసుకెళ్ళినవే.అలాంటి మహేష్ నుండి ఈమధ్య అలాంటి సినిమాలు అసలు రావడం లేదని, కేవలం కమర్షియల్ కంటెంట్స్ తో సేఫ్ గేమ్ ఆడుతున్నాడని, ఇలాంటి మహేష్ నుండి మేము ఆసించట్లేదని ట్విట్టర్ లో గత కొద్దిరోజుల నుండి మహేష్ ఫ్యాన్స్ నిరసన వ్యక్తం చేస్తున్నారు.
అకస్మాత్తుగా వాళ్ళు ఇలా నిరసన వ్యక్తం చెయ్యడానికి కూడా ఒక కారణం ఉంది, అదేమిటంటే మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఒక సినిమా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.ఈ కాంబినేషన్ కోసం కేవలం అభిమానులు మాత్రమే కాదు, ప్రేక్షకులు కూడా అంతే ఆత్రుతతో ఎదురు చూస్తున్నారు.ఎందుకంటే గతం లో వీళ్లిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు అలాంటివి మరి.మళ్ళీ వీళ్లిద్దరు కలిసి పనిచేస్తున్నారంటే కచ్చితంగా ట్రెండ్ ని సెట్ చేసే కథాంశంనే ఆశిస్తారు.కానీ మహేష్ మాత్రం ఎలాంటి రిస్క్ తీసుకోకుండా, ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ ని త్రివిక్రమ్ సెట్ చేయించుకున్నాడు.ఈ సినిమా షూటింగ్ కి సంబంధించిన షూటింగ్ లొకేషన్ ఫోటోలు సోషల్ మీడియా లో లీకై,మళ్ళీ రొటీన్ సినిమానే తీస్తున్నారు అనే సంకేతం ఇచ్చింది.
దీనితో మహేష్ ఫ్యాన్స్ ‘మినిమమ్ గ్యారంటీ కమర్షియల్ సినిమాలు వరుసగా సక్సెస్ అవ్వడం వల్లే అలాంటి సినిమాలు చేస్తూ పోతున్నాడు.ఒకసారి గట్టిగ దెబ్బ తగలాలి, త్రివిక్రమ్ తో చెయ్యబోయే సినిమా ఫ్లాప్ అయితే కానీ దారిలోకి రాడు’అంటూ సోషల్ మీడియా లో పోస్టులు పెడుతున్నారు.దీనిని చూసి ఇతర హీరోల అభిమానులు కూడా ఆశ్చర్యపోతున్నారు.