Hari Hara Veera Mallu Fans: పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) అభిమానులు ఎప్పుడెప్పుడా అని వాళ్ళ అభిమాన హీరో ని వెండితెర పై చూసేందుకు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఆయన నుండి చివరగా విడుదలైన చిత్రం ‘భీమ్లా నాయక్’. ‘బ్రో ది అవతార్’ చిత్రం విడుదలైంది కానీ, అందులో పవన్ కళ్యాణ్ కేవలం ముఖ్య పాత్రలో మాత్రమే కనిపించాడు. అందుకే ఈ చిత్రాన్ని పవన్ కళ్యాణ్ సినిమాగా ఎవ్వరూ పరిగణించరు. అయితే ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన నుండి ‘ఓజీ’ చిత్రం విడుదల అవుతుందని అభిమానులు ఆశించారు. కానీ దానికి బదులుగుగా ‘హరి హర వీరమల్లు'(Hari Hara Veeramallu) చిత్రం ముందుగా విడుదల అవుతుంది. ఆరేళ్ళ నుండి వాయిదా పడుతూ రావడం , ఈ సినిమాని అభిమానులు సైతం మర్చిపోయే పరిస్థితి కి వచ్చింది. కానీ థియేట్రికల్ ట్రైలర్ బాగుండడంతో ఫ్యాన్స్ లో కొంత ఉత్సాహం కలిగింది. థియేటర్స్ లో ట్రైలర్ ని ప్రదర్శించినప్పుడు అభిమానులు చేసిన సంబరాలు అందుకు ఒక ఉదాహరణగా తీసుకోవచ్చు.
Also Read: ’అఖండ 2′ టీం కి చురకలు అంటించిన ‘ఓజీ’ నిర్మాత..ఇలా అయితే కష్టమే!
ఇది ఇలా ఉండగా రీసెంట్ గా ఈ చిత్ర దర్శకుడు జ్యోతి కృష్ణ ఒక నేషనల్ మీడియా కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో యాంకర్ అడిగిన ఒక ప్రశ్నకు ఆసక్తికరమైన సమాధానం చెప్పాడు. యాంకర్ ప్రశ్న అడుగుతూ ‘పవన్ కళ్యాణ్ అభిమానులంతా ఓజీ సినిమా కోసమే ఎదురు చూస్తున్నారు. కానీ మీ సినిమా గురించి వాళ్ళు ఎందుకో పట్టించుకోలేదని అనిపిస్తుంది. అందుకు కారణం ఏమిటంటారు?’ అని అడగ్గా, దానికి జ్యోతి కృష్ణ సమాధానం చెప్తూ ‘మా సినిమాని కరోనా ముందు ప్రారంభించాం. ఆ తర్వాత జరిగిన కొన్ని అనుకోని సంఘటనల కారణంగా మా సినిమా షూటింగ్ వాయిదా పడుతూ వచ్చింది. పవన్ కళ్యాణ్ గారు అప్పుడే ఓజీ చిత్రాన్ని ఒప్పుకున్నారు. ఇది గ్యాంగ్ స్టర్ స్టోరీ సినిమా, నేటి తరం ఆడియన్స్ మైండ్ సెట్ కి తగ్గ సినిమా కావడం తో ఫ్యాన్స్ ఈ చిత్రం కోసం ఆతృతగా ఎదురు చూడడం మొదలు పెట్టారు. మాది పాతది అయిపోవడం తో చిన్న చూపు చూశారు’ అంటూ చెప్పుకొచ్చాడు.
కానీ థియేట్రికల్ ట్రైలర్ విడుదల తర్వాత ఫ్యాన్స్ లో కొత్త ఊపు వచ్చిందని, ఇప్పుడు వాళ్ళు ట్రాక్ లోకి వచ్చేశారని డైరెక్టర్ జ్యోతి కృష్ణ అంటున్నాడు కానీ, నార్త్ అమెరికా లో జరుగుతున్న అడ్వాన్స్ బుకింగ్స్ ని చూస్తుంటే అలా అనిపించడం లేదని, ఈ సినిమా పై అభిమానుల్లో, ప్రేక్షకుల్లో ఇంకా ఆసక్తి కలగలేదని అంటున్నారు. ఒక్కసారి ఆడియన్స్ లో సినిమా పాత బడిపోయింది అనే అభిప్రాయం వస్తే, అంత తేలికగా వాళ్ళు థియేటర్స్ కి కదలడం కష్టమని గతం లో అనేకసార్లు రుజువు అయ్యింది. పవన్ కళ్యాణ్ కాబట్టి ఓపెనింగ్ వసూళ్లతో లాగేస్తాడు, కానీ ఈ సినిమా బ్రతకాలన్నా, AM రత్నం కి పెట్టిన డబ్బులు రీకవర్ అవ్వాలన్నా, కచ్చితంగా ఈ చిత్రానికి మొదటి ఆట నుండే బ్లాక్ బస్టర్ టాక్ రావడం అత్యవసరం, లేదంటే అంతే సంగతి అంటూ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.