Prabhas Anushka Marriage: ప్రభాస్-అనుష్క శెట్టిలు డేటింగ్ చేశారంటూ పుకార్లు ఉన్నాయి. వీరి పెళ్లిపై పదుల సంఖ్యలో కథనాలు పుట్టుకొచ్చాయి. అత్యధికంగా ప్రభాస్ అనుష్కతో నాలుగు చిత్రాలు చేశారు. బిల్లా చిత్రం కోసం మొదటిసారి కలిశారు. అది హిట్ అని చెప్పాలి. అనంతరం మిర్చి చిత్రంలో జత కట్టారు. ఇక బాహుబలి సిరీస్ తో ఇండియా వైడ్ పాప్యులర్ అయ్యారు. 2017లో బాహుబలి 2 విడుదల కాగా… ప్రభాస్, అనుష్క పెళ్లి పీటలు ఎక్కనున్నారని కథనాలు వెలువడ్డాయి.
2019లో సాహో ప్రమోషన్స్ లో పాల్గొన్న ప్రభాస్ కి ఈ ప్రశ్న ఎదురైంది. బెంగుళూరు మీడియా సమావేశంలో యాంకర్ అనుష్కతో మీకున్న బంధం ఏమిటీ? పెళ్లి పుకార్లపై మీ స్పందన ఏంటి? అని అడిగారు. ప్రభాస్ సహనంగా సమాధానం చెప్పాడు. అనుష్క నాకు ఫ్రెండ్ మాత్రమే. అంతకు మించిన రిలేషన్ లేదు. నేను ఆమెను వివాహం చేసుకోబోతున్నాననే వార్తల్లో నిజం లేదని అన్నారు.
అప్పటి నుండి ప్రభాస్-అనుష్కల పెళ్లి పుకార్లు సద్దుమణిగాయి. అయితే ఎక్కడో అనుమానాలు ఉన్నాయి. వీరిద్దరికీ నలభై ఏళ్ళు దాటిపోయాయి. పెళ్లి మాత్రం చేసుకోవడం లేదు. అయితే అభిమానులు ఊహల్లో వీరికి పెళ్లి చేసేశారు. అనుష్క-ప్రభాస్ పెళ్లి పీటలపై ఎలా ఉంటారు. వారికి పాప పుడితే ఎలా ఉంటుంది? అనేది ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ ద్వారా క్రియేట్ చేశారు. అవి సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా అద్భుతంగా ఉన్నాయి.
చూడ ముచ్చటైన జంట అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇది నిజం కావాలని పలువురు కోరుకుంటున్నారు. ఇక అనుష్క ఆచితూచి చిత్రాలు చేస్తుంది. చాలా గ్యాప్ అనంతరం ఇటీవల మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి చిత్రంతో పలకరించింది. ఇది హిట్ టాక్ తెచ్చుకుంది. మరోవైపు ప్రభాస్ ఒకటికి మూడు చిత్రాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ఆయనకు మోకాలి సర్జరీ జరిగింది. విదేశాల్లో రెస్ట్ తీసుకుంటున్నారు. ఆయన హీరోగా తెరకెక్కిన సలార్ డిసెంబర్ 22న విడుదల కానుంది.