Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ 7 ఐదో వారం మొదటి కెప్టెన్సీ టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. దీని కోసం శుభశ్రీ -గౌతమ్,అమర్ దీప్ -సందీప్ మాస్టర్, శోభా -ప్రియాంక,శివాజీ -ప్రశాంత్, తేజ-ప్రిన్స్ యావర్ జంటలుగా మారారు. కెప్టెన్సీ రేస్ లో భాగంగా వీళ్లకి దశల వారీగా కొన్ని టాస్క్ లు ఇచ్చాడు. అందరి కంటే తక్కువ స్టార్స్ ఉండటం వలన శోభా – ప్రియాంక రేస్ నుంచి తప్పించేసాడు బిగ్ బాస్.మిగిలిన నాలుగు జంటలు పోటీలో కొనసాగుతున్నారు.
కెప్టెన్సీ రేస్ లో చివరి గేమ్ గా ”చిట్టి ఆయిరే ” నిర్వహించాడు. కంటెస్టెంట్స్ కి తమ కుటుంబ సభ్యులు నుంచి లెటర్స్ వచ్చాయి.ఇందులో జంటలో ఒక్కరు మాత్రమే లెటర్ చదవాలి. త్యాగం చేసిన వారు రేస్ నుంచి తప్పుకుంటారు. టాస్క్ లో రెండో రౌండ్ లో తేజ – ప్రిన్స్ యావర్ వెళ్లారు. ఇద్దరు త్యాగం చేయడానికి నేనంటే నేనంటూ పోటీ పడ్డారు. యావర్ నాలుగు వారాలుగా ఇమ్యూనిటీ కోసం కష్టపడుతున్నాడు.
అందుకే వాడికి ఇద్దామని అనుకుంటున్నా అని తేజ అన్నాడు. తన లెటర్ త్యాగం చేసి కంటెండర్ రేసు నుండి తప్పుకునేందుకు సిద్దమయ్యాడు. అయితే ఒకరిని బాధ పెట్టి సంతోషంగా ఉండే క్యారెక్టర్ నాది కాదని యావర్ అన్నాడు. తేజ లెటర్ ప్రిన్స్ కి ఇచ్చి నన్ను డిస్ క్వాలిఫై చేయమని చెప్పాడు. కానీ ప్రిన్స్ మాత్రం ఎవరు ఊహించని పని చేసాడు. తన లెటర్ ని మెషిన్ లో వేసి స్వయంగా రేస్ నుంచి తప్పుకున్నాడు.
కన్టెండర్షిప్ త్యాగం చేసి తేజ ని గెలిపించాడు. ప్రిన్స్ చేసిన పనికి అందరూ ఆశ్చర్యపోయారు. యావర్ చర్య ప్రేక్షకుల్లో హీరోకి చేసింది. కొన్ని వారాలుగా ఇమ్మ్యూనిటీ కోసం ఎంతో కష్టపడి టాస్క్ లు ఆడినా లాభం పొందలేక పోయాడు. తన స్వార్థం చూసుకోకుండా తేజ ని గెలిపించడంతో ప్రిన్స్ హీరో గా నిలిచాడు. మొత్తంగా యావర్ త్యాగం జనాల్లో అతనికి మైలేజ్ పెంచింది. ఇక బిగ్ బాస్ హౌస్ కి మొదటి కెప్టెన్ పల్లవి ప్రశాంత్ అయినట్లు సమాచారం.
This one makes me cry
He proved once again why he is stronger than others #Yawar #PrinceYawar #BiggBossTelugu7 pic.twitter.com/ejriV6MTx0
— Cheeku (@AjitVirat1718) October 5, 2023