Puri Jagannadh: ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో సీక్వెల్స్ హవా నడుస్తున్న నేపథ్యంలో చాలా సినిమాలకి దర్శకులు సీక్వెల్స్ ని ప్లాన్ చేస్తున్నారు. ఇక ఇప్పుడు వచ్చే సినిమాలైతే డైరెక్ట్ పార్ట్ 2 ని అనౌన్స్ చేసుకున్నకే మొదటి పార్ట్ ను రిలీజ్ చేస్తున్నారు. ఇలా అయితేనే ఆ సినిమా మీద మంచి అంచనాలు పెరగడంతో పాటు మొదటి పార్ట్ కూడా మంచి సక్సెస్ ను సాదిస్తుంది. ప్రస్తుతం స్టార్ హీరోలు అందరూ కూడా సీక్వెల్స్ సినిమాలను చేస్తూ ముందుకు కదులుతున్నారు.
అల్లు అర్జున్, ప్రభాస్, ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోలు సైతం ఇలా సీక్వెల్స్ ని చేయడానికి ఉత్సాహం చూపిస్తున్నారు అంటే మనం అర్థం చేసుకోవచ్చు సీక్వెల్స్ హవ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఏ రేంజ్ లో నడుస్తుందో.ఇక ఇప్పుడు పూరి జగన్నాథ్ అభిమానులు ఆయన రవితేజతో తెరకెక్కించిన నేనింతే సినిమాకి సీక్వెల్ తీయమని సోషల్ మీడియా వేదిక గా పూరి జగన్నాథ్ ని అడుగుతున్నట్టుగా తెలుస్తుంది. అయితే నేనింతే సినిమా పెద్ద గా సక్సెస్ కానప్పటికీ సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరి హృదయాలను తాకే సినిమాగా మంచి గుర్తింపును సంపాదించుకుంది.
పూరి డైలాగులు డైరెక్షన్ అలాగే రవితేజ యాక్టింగ్ అన్ని చాలా అద్భుతంగా ఉన్నాయంటూ అప్పట్లో ఈ సినిమా మీద విమర్శకులు సైతం ప్రశంశల వర్షం కురిపించారు. అలాగే ఈ సినిమా రవితేజకు కొన్ని అవార్డులను కూడా తీసుకువచ్చి పెట్టింది. ఇక ఈ సినిమా వచ్చి దాదాపు 15 సంవత్సరాలు కావస్తున్నప్పటికీ ఇప్పుడు కూడా ఈ సినిమా ప్రతి ప్రేక్షకుడికి ఫేవరెట్ మూవీగా గుర్తిండిపోయిందనే చెప్పాలి.
అయితే సోషల్ మీడియాలో పూరి టాపిక్ వచ్చిన ప్రతిసారి ఈ సినిమా గురించి అభిమానులు మాట్లాడుకుంటూ వీళ్ళ కాంబినేషన్ లో పార్ట్ 2 వస్తే చూడాలని ఆసక్తిగా ఉంది అంటూ చాలామంది అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. మరి ఆ కామెంట్లను చూసి అయిన పూరి జగన్నాథ్ , రవితేజ కలిసి నేనింతే పార్ట్ 2 చేస్తారా లేదా అనే విషయాలు తెలియాల్సి ఉంది…